NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Corona Effect: అసెంబ్లీ, పార్లమెంట్ ఉప ఎన్నికల నిర్వహణపై ఈసీ కీలక నిర్ణయం..!!

Corona Effect: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తున్న వేళ నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడు హైకోర్టు ఓ కేసు విచారణ సందర్భంలో ఈసీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తమిళనాడు ఎన్నికల సమయంలో వివిధ రాజకీయ పార్టీల ర్యాలీ, ప్రచారాలను కట్టడి చేయడంలో ఎన్నికల సంఘం విఫలం అవ్వడంతో కరోనా కేసులు విపరీతంగా పెరిగాయి. దీనిపై హైకోర్టు ఈసీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్నికల అధికారులపై హత్యాభియోగం ఎందుకు మోపకూడదంటూ ప్రశ్నించింది. ఈ వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం నొచ్చుకోవడమే కాక హైకోర్టు వ్యాఖ్యలపై సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

Corona Effect ec key decision on by polls
Corona Effect ec key decision on by polls

హైకోర్టు నుండి అక్షింతలు పడిన నేపథ్యంలో ఎన్నికల సంఘం వివిధ రాష్ట్రాలలో నిర్వహించాల్సిన ఉప ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సెకండ్ వేవ్ కరోనా ఉధృతి వేగంగా పెరుగుతున్న కారణంగా పలు కారణాలతో ఖాళీ అయిన అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు జరగాల్సిన ఉప ఎన్నికలను వాయిదా వేసినట్లు ఈసీ ప్రకటించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

దేశంలో కరోనా పరిస్థితులపై సమీక్షించిన ఈసీ..పరిస్థితులు మెరుగపడే వరకూ ఉప ఎన్నికలు నిర్వహించరాదని నిర్ణయించినట్లు పేర్కొంది. మధ్యప్రదేశ్ లోని దాద్రా నాగర్ హవేలీ, ఖండ్వా, హిమాచల్ ప్రదేశ్ లోని మండి లోక్ సభ స్థానాలతో పాటు పలు రాష్ట్రాల్లోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు ఈసీ ఇప్పటికే నోటిఫై చేసింది. ఏపిలోని బద్వేలు నియోజకవర్గంతో పాటు హరియాణలోని కల్కా, ఎలియాబాద్, రాజస్థాన్ లోని వల్లభ్ నగర్, కర్నాటక లోని సిండ్గి, మేఖాలయలోని రాజబల్ల, మారైంగ్ కేంగ్, హిమాచల్ ప్రదేశ్ లోని ఫతేపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. కరోనా తగ్గుముఖం పట్టిన తరువాత ఈ రాష్ట్రాల నుండి సమాచారం తీసుకుని పరిస్థితులను సమీక్షించి తగిన సమయంలో ఎన్నికల నిర్వహణకు నిర్ణయం తీసుకోనున్నట్లు ఈసిీ తెలిపింది.

ఏపిలోని కడప జిల్లా బద్వేలులో వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య మార్చి నెలాఖరున అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది.

Related posts

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju