NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila: కేసీఆర్ కు ష‌ర్మిల ఇస్తున్న షాకుల్లో కొత్త ట్విస్టు ఇది

YS Sharmila: టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సార‌థ్యంలోని తెలంగాణ లో రాజ‌న్న రాజ్యం తీసుకురావడ‌మే ల‌క్ష్యంగా అడుగులు వేస్తున్న వైఎస్ ష‌ర్మిల ఈ క్ర‌మంలో త‌న దూకుడు పెంచుతున్నారు. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు కోవిడ్ బ్రేకులు వేయ‌డంతో ఆమె ఆన్‌లైన్ వేదిక‌గా గులాబీ ద‌ళ‌ప‌తిపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ క్ర‌మంలో ష‌ర్మిల కొత్త ట్రెండ్ ఎంచుకున్న‌ట్లు క‌నిపిస్తోంది. కరోనా కట్టడి విషయంలో కేబినెట్ సమావేశం అనంతరం లాక్డౌన్ నిర్ణయం ప్రకటించడంపై షర్మిల ట్విట్టర్ వేదికగా స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్ షర్మిల మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ,ఈ విమ‌ర్శ రొటీన్ కు భిన్నంగా ఉండ‌టం గ‌మ‌నార్హం.

ఆ లైన్ లో వెళ్తున్న ష‌ర్మిల‌

తెలంగాణ‌లో ఆరోగ్య శ్రీలో క‌రోనా చికిత్స‌ను చేర్చ‌క‌పోవ‌డం , ఆయుష్మాన్ భార‌త్ ప‌రిధిలోకి సైతం రాక‌పోవ‌డం పై ష‌ర్మిల ఫైరయ్యారు. “అయ్య పెట్టడు అడుక్కు తిననియ్యడు. KCR కరోనా ను ఆరోగ్యశ్రీ లో చేర్చడు. కేంద్ర ఆయుష్మాన్ భారత్ లో చేరరు“అంటూ విరుచుకుపడ్డారు. కేసీఆర్ దొర నిర్ణయాలన్నీ కార్పొరేట్ హాస్పటల్స్ కు దోచిపెడుతున్నాయని ఆమె ఆరోపించారు. కాగా బీజేపీ నేత‌లు సైతం ఇదే లైన్‌లో ఆరోప‌ణ‌లు చేస్తుండ‌టం ఆస‌క్తిక‌రం!

ఘాటు విమ‌ర్శ‌లు…

ప్రభుత్వం నిర్వహిస్తున్న కోవిడ్ హాస్పిటల్స్ లో వసతులు ఉండట్లేద‌ని ష‌ర్మిల మండిప‌డ్డారు “సర్కార్ దవాఖానా ఉన్నావా అంటే ఆ ఉన్నా అన్నట్లే ఉంది.. హైదరాబాద్ నాలుగు దిక్కులా దవాఖానాలు కడుతానన్న దానికి మోక్షం లేదు.. ప్రజల ఆరోగ్యానికి సరిపోను బడ్జెట్ ఇచ్చెదిలేదు.,ఉస్మానియా.. గాంధీ, నిమ్స్ .. టిమ్స్ ఆస్పత్రులకే ఊపిరి సక్కగా అందుతలేదు, ఇక అందులో చేరినవారి ఊపిరి గాలిలో దీపం..కార్పొరేట్ హాస్పిటల్స్ లో కరోనా వైద్యానికి .. రేటు ఎక్కువ, జనం కరోనా నుండి బతికి బయటపడితెే.. అప్పులతో చచ్చేటట్టుంది.. KCR సారు .. సోయిలకురా. ఇప్పటికైనా సర్కార్ దవాఖానాలను సక్కగ చేసి, కరోనా ను ఆరోగ్యశ్రీ లో చేర్చు“ అంటూ వైఎస్ షర్మిళ ఒకింత ఘాటుగా స్పందించారు.

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju