NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Telangana CM KCR: కేసిఆర్ సంచలనం ..! గాంధీలో కోవిడ్ పేషంట్స్ పరామర్శ..!!

Telangana CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ బుధవారం గాంధీ ఆసుపత్రిని సందర్శించారు. సిఎం కెసిఆర్ గంట సేపు కరోనా రోగులు ఉన్న  వార్డులలో కలియ తిరిగి వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఎవరూ అధైర్యపడవద్దనీ, భయపడవద్దనీ మెరుగైన వైద్యం అందించి బీమార్ తగ్గించడం జరుగుతుందని భరోసా ఇచ్చారు. ఐసియు, ఎమర్జెన్సీ, ఔట్ పేషెంట్ వార్డులతో సహా పలు జనరల్ వార్డులలో సిఎం కెసిఆర్ కలియ తిరిగారు. రోగులతో వారి పేరు, వివరాలు అడిగి తెలుసుకుని మరీ ప్రత్యేకంగా మాట్లాడి వారికి దైర్యం చెప్పారు. రోగులు ఆయన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను వెంటనే అధికారులకు చెప్పి పరిష్కరించే విధంగా ఆదేశాలు ఇచ్చారు.

Telangana CM KCR visit Gandhi hospital
Telangana CM KCR visit Gandhi hospital

అసుపత్రిలోని ఆక్సిజన్ ప్లాంట్ ను కెసిఆర్ పరిశీలించారు. నిమిషానికి రెండు వేల లీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ ను తయారు చేసే ఈ ప్లాంట్ ను  ఇటీవలే గాంధీలో నెలకొల్పారు. ఈ సందర్భంగా గాంధీలో వైద్య సేవలందిస్తున్న కాంట్రాక్టు నర్సులతో, జూనియర్ డాక్టర్లతో సిఎం కెసిఆర్ స్వయంగా మాట్లాడి వారు అందిస్తున్న సేవలను ప్రశంసించారు. సిబ్బందికి ఎటువంటి సమస్యలు ఉన్నా  పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రజల కోసం నిలబడాల్సిన అవసరం యువ డాక్టర్లుగా వారి మీద ఉన్నదని సిఎం అన్నారు. జూనియర్ డాక్టర్లు, నర్సుల సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల కోసం ప్రతిపాదనలను తక్షణమే పంపాలని వైద్య అధికారులను సిఎం ఆదేశించారు.

Telangana CM KCR visit Gandhi hospital
Telangana CM KCR visit Gandhi hospital

ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్యా ఆరోగ్యశాఖ కార్యదర్శి ఎస్ఎఎం రిజ్వీ, సిఎం సెక్రటరీ, కోవిడ్ ప్రత్యేక అధికారి రాజశేఖర్ రెడ్డి, సిఎంవో అధికారి గంగాధర్, డిఎంఈ రమేశ్ రెడ్డి, గాంధీ సూపరిండెంట్ రాజారావు తదితరులు పాల్గొన్నారు.

సీఎం కేసిఆర్ ఇటీవలే కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. ఆయన పిపిఈ కిట్ ధరించకుండా కేవలం మాస్కు మాత్రమే ధరించి  గాంధీ ఆసుపత్రిలో కలియతిరుగుతూ  కోవిడ్ రోగులను పరామర్శించడం తీవ్ర సంచలనం అయ్యింది. ముఖ్యమంత్రి హోదాలోని నేత కోవిడ్ రోగులను నేరుగా కలుసుకుని పరామర్శించడంతో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?