NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

Anandaiah Medicine: ఆనందయ్య మందు పంపిణీపై ఆయుష్ కమిషనర్ ఏమన్నారంటే…!?

Anandaiah Medicine: కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు పంపిణీపై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం నుండి అనుమతి వచ్చిన తరువాతే మందు తయారు చేసి పంపిణీ చేస్తానని ఆనందయ్య చెబుతున్నారు. రహస్య ప్రదేశంలో కరోనా మందు తయారు చేస్తున్నారన్న విషయంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. అదంతా తప్పుడు ప్రచారమన్నారు. గతంలో తాను మందు తయారు చేస్తున్న సమయంలో తీసిన వీడియోలను ప్రసారం చేస్తున్నారని అన్నారు. శుక్రవారం స్వగ్రామానికి వచ్చిన ఆనందయ్యను మళ్లీ శనివారం వేకువ జామున పోలీసులు తీసుకువెళ్లారు. కృష్ణపట్నం నుండి అనందయ్యను రహస్య ప్రాంతానికి తరలించి పోలీసులు భద్రత కల్పిస్తున్నట్లు సమాచారం.

Ayush commissioner ramudu comments on Anandaiah Medicine
Ayush commissioner ramudu comments on Anandaiah Medicine

 

ఇదిలా ఉండగా ఆనందయ్య మందు పంపిణీపై సోమవారం రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆయుష్ కమిషనర్ రాములు పేర్కొన్నారు. శనివారం అందే నివేదికలను  మరో అధ్యయన కమిటీ పరిశీలన చేస్తుందని చెప్పారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ సీసీఆర్ఎఎస్ అధ్యయన నివేదిక కూడా అందనుందని తెలిపారు. ఆనందయ్య మందుపై ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ లు దాఖలైన నేపథ్యంలో వాటిపై సోమవారం విచారణ జరగనున్నదన్నారు. నివేదికలతో పాటు కోర్టు తీర్పు వచ్చిన తరువాత ఆనందయ్య మందుపై రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై జరిపిన సమీక్షలో ఆనందయ్య మందుల పంపిణీనా చర్చించారన్నారు.

Read More: Pet Dog Birthday: ఆయనకు పెంపుడు జంతువులే కుటుంబ సభ్యులు..! శునకానికి ఘనంగా బర్త్‌డే వేడుకలు..!!

ఇప్పటి వరకూ ఆనందయ్య మందుపై వచ్చిన నివేదికలు అన్ని సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆనందయ్య మందు తీసుకున్న వారిలో ఎవరూ మృతి చెందలేదని చెప్పారు. ఆ మందు తీసుకున్న వారికి ఫోన్ చేసి విచారణ చేయగా చాలా మంది సానుకూలంగా చెప్పారన్నారు. ఆనందయ్య మందుపై ఇంకా క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం కాలేదని చెప్పారు. ఒక వేళ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నట్లయితే అది అధికారికంగా చేపట్టింది కాదని అన్నారు. ఈ మందు పంపిణీకి సంబంధించి ఆనందయ్య ముందుగా ఆయుర్వేద విభాగం గుర్తింపునకు ధరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?