NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Buchaiah Chowdary: గోరంత ను కొండంతలు చేస్తున్న గోరంట్ల ! జగన్ టంగ్ స్లిప్‌కు బుచ్చయ్య కొత్త భాష్యం !!

Buchaiah Chowdary: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఇటీవల దిశ యాప్ అవగాహన కార్యక్రమం సందర్భంగా చేసిన ప్రసంగంలో తడబాటులో వచ్చిన ఓ మాట వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఏ పార్టీ అయినప్పటికీ రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఒక్కో సందర్భంలో మాటల తడబాటు సహజమే. గతంలో 40 ఇయర్స్ ఇండస్ట్రీ అయిన టీడీపీ అదినేత చంద్రబాబు కూడా ప్రసంగంలో తడబాటుకు గురైన సందర్భాలు ఉన్నాయి. ఇక లోకేష్ విషయం అయితే చెప్పాల్సిన పని లేదు. చాలా సందర్భాల్లో ఉఛ్చారణ దోషాలు కనబడ్డాయి.

Butchaiah Chowdary tweet On jagan tongue slip
Butchaiah Chowdary tweet On jagan tongue slip

అయితే లోకేష్ టంగ్ స్లిప్ అయిన ప్రతి సందర్భంలోనూ వైసీపీ సోషల్ మీడియా విభాగం ఆ వీడియోలను ట్రోల్ చేసి ఆడేసుకున్నారు. అయితే ఇప్పుడు తాజాగా టీడీపీ వారికి జగన్ చిక్కారు. గత కొంత కాలంగా జగన్ బెయిల్ రద్దు అయితే భారతిరెడ్డి సీఎం అవుతారని, ఇప్పటికే ఆమె పరిపాలనపై అవగాహన కోసం తర్ఫీదు పొందుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో గొల్లపూడిలో జరిగిన సభలో  సీఎం జగన్ నోటి వెంట “ముఖ్యమంత్రిగా సాక్షాత్తు ఒక మహిళ” అని తడబాటులో అనడంతో టీడీపీ సోషల్ మీడియా వింగ్ ఆ వీడియోను వైరల్ చేసింది. దీనిపై ఆ పార్టీ వర్గాలు విపరీతంగా కామెంట్స్ చేస్తున్నారు.

Read More: Brahmamgari Matam: బ్రహ్మం గారి మఠం పీఠాధిపత్యం వివాదంలో కొత్త ట్విస్ట్..! అదేమిటంటే..!?

జగన్ వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్ తన సతీమణి భారతిరెడ్డిని సీఎం చేయాలనే ఆలోచనను ఇలా బయటపెట్టారా అని బుచ్చయ్య ప్రశ్నించారు. “ఏంటి సంగతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి గారు.. భారతి రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచన బహిర్గతం చేసారా..? లోపల మాట్లాడుకునే మాటలు మీ వాళ్ళని మానసికంగా సంసిద్ధుల్ని చేసేందుకు ఇలా మాటలు వదిలినట్టు ఉన్నారు. జైలు కి వెళ్ళడానికి సిద్ధం అయ్యారు అని అంతః పురం టాక్.. ! అందుకే ఇలా కంఫ్యూషన్ లో మాటలు నిజాలు గా వచ్చేసాయి” .. అని అంటున్నారని సెటైర్ వేశారు బుచ్చయ్య చౌదరి.

 

Related posts

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?

పార్ల‌మెంటు ఎన్నిక‌ల సాక్షిగా కేసీఆర్‌ను ఇరుకున పెట్టిన శంకరమ్మ…?

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

sharma somaraju

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

sharma somaraju

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

sharma somaraju

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను వ్యతిరేకించిన ఈడీ .. తీర్పు రిజర్వు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

sharma somaraju

Russia: భారత్ కు రష్యా మద్దతు .. పన్నూ కేసులో ఆమెరికా ఆరోపణలను తోసిపుచ్చిన రష్యా

sharma somaraju

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N