NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Six Marriages Case Hyderabad: 6 పెళ్లిళ్లు – 12 కేసులు..! హైదరాబాద్ లో నిత్య పెళ్ళికొడుకు..!!

Six Marriages Case in Hyderabad:

Six Marriages Case Hyderabad: వయసుంది. తెలివుంది. కొద్దిపాటి అందముంది. వాక్చాతుర్యం ఉంది. వీటన్నిటినీ వాడుకుని మోసం చేసే దుర్భుద్దీ పుట్టింది..! అదే తడవుగా పెళ్లిళ్ల వేట మొదలు పెట్టాడు.. వరుసగా ఆరుగురిని పెళ్లి చేసుకుని, సొత్తు కాజేసి వదిలేసి, ఏడో పెళ్ళికి సిద్ధపడిన సిద్ధహస్తుడి అసలు బాగోతాన్ని పోలీసులు గుట్టురట్టు చేశారు. ఓ చిన్న కేసుతో మొత్తం కూపీ లాగి ఇతని పాత నేరాలు, ఘోరాలు మొత్తం చిట్టా తీసి అరెస్టు చేశారు. హైదరాబాద్ లో జరిగిన ఈ సినిమాటిక్ క్రైమ్ ఘటనపై వివరాలు ఇలా ఉన్నాయి..!

హైదరాబాద్ లోని సైబరాబాద్ పోలీస్ స్టేషన్ కి ఇటీవల ఒక ఫిర్యాదు వచ్చింది. ఓ యువకుడు తనను పెళ్లి చేసుకుని మోసం చేసి వదిలేశాడని ఓ వివాహిత ఫిర్యాదు చేసింది. ఆ కేసు విచారణలో భాగంగా మూలాల్లోకి వెళ్లిన పోలీసులు షాకింగ్ నిజాలు తెలుసుకున్నారు.

Six Marriages Case in Hyderabad:
Six Marriages Case in Hyderabad:

అనంతపురం జిల్లాకు చెందిన రంగస్వామి అనే యువకుడు(37) ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో స్థిరపడ్డాడు. గడిచిన అయిదేళ్ల వ్యవధిలో ఆరుగురు మహిళల్ని పెళ్లి చేసుకుని వదిలేసినట్టు గుర్తించారు. డబ్బున్న ఒంటరి మహిళల్ని చూడడం.., అనాధనని చెప్పడం.., పెళ్లి చేసుకోవడం.. వారి నుండి డబ్బు తీసుకుని వదిలేసి వెళ్లిపోవడం ఇలాగే అయిదేళ్లుగా చేస్తూ వస్తున్నాడు. చివరికి ఓ మహిళ ధైర్యం చేసి ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితున్ని గోవాలో అరెస్టు చేసారు.

అతని పాత చరిత్ర చూసిన పోలీసులు షాక్ తిన్నారు. రంగస్వామిపై అప్పటికే 12 కేసులున్నాయి. ఓ మహిళపై అత్యాచారం కేసు, దొంగతనం చేసు.. చీటింగ్ కేసులతో సహా రకరాకాల సెక్షన్లలో చాలా కేసులున్నాయి. దీంతో పోలీసులు కొత్తగా ఈ కేసులు నమోదు చేసి అతన్ని రిమండ్ కి తరలించారు. ఇటువంటి వారి పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Related posts

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju

Video Morphing Case: అమిత్ షా డీప్ షేక్ వీడియో కేసు.. గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు ..సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు

sharma somaraju