Prabhas: పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ప్రభాస్ క్రేజ్ ప్రస్తుతం జాతీయస్థాయిలో తిరుగులేని పాపులారిటీ ఉంది. బాహుబలి సినిమా విజయం తో ప్రభాస్ రేంజ్ ఊహించని విధంగా మారిపోయింది. బాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలను సైతం వెనక్కి నెట్టి.. అనేక రీతులుగా ప్రభాస్ .. పాపులారిటీ సంపాదించడం జరిగింది. ఈ యంగ్ రెబల్ స్టార్ తో సినిమా చేయడం కోసం దేశంలో అనేక ఇండస్ట్రీలలో ఉన్న టాప్ డైరెక్టర్లు మరియు నిర్మాతలు.. ప్రభాస్ అవకాశం ఇస్తాడేమో అని కాచుకొని కూర్చుని ఉన్నారు.
ఆ రేంజ్ కలిగిన ప్రభాస్ ప్రస్తుతం మూడోసారి హీరోయిన్ కాజల్ అగర్వాల్ తో కలిసి నటించబోతున్నట్లూ ఆడి పాడటానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. విషయంలోకి వెళితే “కేజిఎఫ్” డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “సలార్” అనే సినిమా లో… ప్రభాస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం కాజల్ అగర్వాల్ నీ సినిమా యూనిట్ ఓకే చేసినట్లు సమాచారం. గతంలో కాజల్ అగర్వాల్ తో ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్ అనే సినిమాలు చేయడం జరిగింది.
Read more: Prabhas: ప్రభాస్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన డైరెక్టర్ సుజిత్..!!
ఈ రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ జంట కి హిట్ పెయిర్ అనే టాక్ ఉంది. ఇటువంటి తరుణంలో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న “సలార్” లో కాజల్ అగర్వాల్.. స్పెషల్ సాంగ్ కోసం సినిమా యూనిట్ తీసుకుంటున్నట్లు వార్తలు రావటం ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ కి పెద్దగా అవకాశాలు దక్కడం లేదు.. ఇటువంటి తరుణంలో ప్రభాస్ సరసన స్పెషల్ సాంగ్ కోసం ఆమె ఓకే అయినట్లు వార్తలు రావడం.. ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ఈ వార్త సంచలనం సృష్టిస్తోంది.