Salaar: సలార్.. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్. కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. వరుస పాన్ ఇండియన్ సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. హైదరాబాద్ లో సలార్ ప్రస్తుతం శరవేగంగా సాగుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ ని ప్రశాంత్ నీల్ ఎలా చూపించబోతున్నాడు, ఏ పాత్రలో కనిపించబోతున్నాడో అని ఆసక్తి అందరిలోనూ క్రియేట్ అయింది. ఇప్పటికే సలార్ అనే టైటిల్ తో
పాటు ఆయన లుక్ అందరిలోనూ విపరీతమైన క్యూరియాసిటీని పెంచింది.
కాగా తాజాగా సలార్ సినిమాకు సంబంధించిన రెండు వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతూ, వైరల్ అవుతున్నాయి. ‘సలార్’ ఓ మాస్ రెట్రో స్టోరీ అని టాక్ వినిపిస్తోంది. కేజీఎఫ్ ఛాప్టర్ 1, ఛాప్టర్ 2ల కంటే రెట్టింపు యాక్షన్ సీన్స్ ఉండేలా ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడట. అంతేకాదు ఈ మూవీ 1970ల పీరియడ్లో జరుగుతుందని తెలుస్తోంది. అప్పటి పాకిస్తాన్ – ఇండియా వార్ బ్యాక్ డ్రాప్ లో సలార్ కథ ఉంటుందని ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాదాపు కేజీఎఫ్ కి పనిచేసిన
టీం సలార్ కి పనిచేస్తోంది.
Salaar: సలార్ సినిమాలో మరో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ వాణీ కపూర్
ఇక రెండవది సలార్ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రభాస్ ఓ సైనికుడుగా కనిపించబోతున్నాడని చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ – శృతి హాసన్ ల మధ్య వచ్చే సీన్స్ చాలా ఆసక్తికరంగా ఉంటాయట. కాగా ఇందులో మరో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ వాణీ కపూర్ నటిస్తుందని లేటెస్ట్ అప్డేట్. వాణీ కపూర్ తెలుగులో ఆహా కళ్యాణం అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మళ్ళీ తెలుగు సినిమాలలో కనిపించలేదు. కానీ బాలీవుడ్ లో హాట్ హీరోయిన్ గా ఈమెకి మంచి క్రేజ్ ఉంది. ఆ కారణంగానే సలార్ సినిమాలో వాణీ కపూర్ ని ప్రశాంత్ నీల్ తీసుకున్నాడట.