NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Toll Issue: టోల్ ఫీజు విషయంలో మాజీ కలెక్టర్ గొడవ..!

Toll Issue: సాధారణంగా జాతీయ రహదారులపై టోల్ గేట్ ల వద్ద టోల్ ఫీజు చెల్లింపు విషయంలో అధికార పార్టీ నాయకులు గొడవ చేయడం జరుగుతూనే ఉంటుంది. స్థానిక ప్రజా ప్రతినిధులు ఇచ్చిన నెంబర్ వాహనాలకు మినహాయింపు ఇస్తుంటారు. అయితే కొందరు నాయకులు వారి కారు ట్రబుల్ ఇచ్చినప్పుడు వేరే వాహనాలలో టోల్ గేటు మీదుగా వెళుతున్న సమయంలో టోల్ గేట్ సిబ్బంది వాహనాన్ని నిలుపుదల చేస్తే సిబ్బందితో వాదనకు దిగుతుంటారు. ఇటువంటి సంఘటనలు అక్కడక్కడా జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ విషయం ఏమిటంటే టోల్ గేట్ సిబ్బంది ఓ ఐఏఎస్ అధికారి వెళుతున్న వాహనాన్ని అడ్డుకోవడం వివాదానికి కారణమైంది. నిబంధనల ప్రకారం ప్రభుత్వ వాహనాలకు టోల్ ఫీజు మినహాయింపు ఉంటుంది. అయితే కొందరు ప్రైవేటు వాహనాల్లో వెళుతున్న సమయంలో సమస్యలు ఎదురవుతుంటాయి.

ias pola baskar toll issue
ias pola baskar toll issue

ఇటీవల కాలం వరకూ ప్రకాశం జిల్లా కలెక్టర్ గా పని చేసి ప్రస్తుతం ఏపి కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న పోలా బాస్కర్ ప్రయాణిస్తున్న వాహనాన్ని కర్నూరు – గుంటూరు రహదారిపై త్రిపురాంతకం మండలం మేడపి దగ్గర ఉన్న టోల్ ప్లాజా వద్ద సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఇక్కడ వివాదం చోటుచేసుకుంది. వాహనానికి టోల్ ఫీజు కట్టే విషయంపై పోలా బాస్కర్ తో టోల్ గేట్ సిబ్బంది వాగ్వివాదానికి దిగారు. తాను ఐఏఎస్ అధికారిని అని ప్రస్తుతం కాలేజ్ ఎడ్యుకేషన్ కమిషనర్ గా ఉన్నానని పోలా బాస్కర్ టోల్ సిబ్బందికి తెలిపారు. తమ వాహనానికి టోల్ మినహాయింపు ఇవ్వాలని కోరినా టోల్ గేట్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఐడీ కార్డు చూపించాలంటూ పోలా బాస్కర్ తో సిబ్బంది దురుసుగా మాట్లాడారు. దీంతో పోలా బాస్కర్ వ్యక్తిగత సిబ్బంది టోల్ గేటు సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. అయితే టోల్ గేటు సిబ్బంది పోలా బాస్కర్ వాహనానికి అడ్డంగా నిలబడి కదలకుండా అడ్డుకున్నారు. ఈ విషయం త్రిపురాంతకం తహసీల్దార్ కిరణ్ కు తెలియడంతో ఆయన పోలీసులతో హుటాహుటిన అక్కడకు చేరుకుని టోల్ గేట్ సిబ్బందితో మాట్లాడి పోలా బాస్కర్ ను అక్కడి నుండి పంపించేశారు.

Toll Issue: సిబ్బందిపై తహశీల్దార్ ఆగ్రహం

అనంతరం టోల్ గేటు సిబ్బందిపై తహశీల్దార్ కిరణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వాహనాలను, అందులోనూ ఉన్నతాధికారులు ప్రయాణించే వాహనాలను అడ్డుకుని దురుసుగా ప్రవర్తించడం ఏమిటని సిబ్బందిని నిలదీశారు. టోల్ గేటు వద్ద ప్రభుత్వ వాహనాలను అడ్డుకున్నా, వాహనదారులతో దుసుసుగా వ్యవహరించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ వ్యవహారం పెద్ద చర్చనీయాంశం అయ్యింది.

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?