NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: సీజన్ ఫైవ్ ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ కి నామినేట్ అయిన సభ్యులు..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ సూటిగా సుత్తి లేకుండా ప్రారంభమయింది. చాలా సైలెంట్ గా పెద్దగా హడావుడి లేకుండా ప్రారంభమైన ఈ షోకి ఆదరణ బాగానే దక్కుతుంది. ప్రారంభమైన రోజే ఇంటి లోకి 19 మంది సభ్యులను.. హౌస్ లోకి వదిలిన బిగ్ బాస్.. వారి మధ్య అప్పుడే చిచ్చు పెట్టేసాడు. ఎంట్రీ ఇచ్చిన తర్వాత రోజే ఎలిమినేషన్ కి నామినేషన్ కార్యక్రమం నిర్వహించడం తో.. అందరూ ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. హౌస్ లో అడుగు పెట్టి 24 గంటలు గడవకముందే.. నామినేషన్ ప్రక్రియ ప్రారంభించడం తో.. ఇంటి సభ్యుల మధ్య అప్పుడే గొడవలు.. ఈగోలు స్టార్ట్ అయిపోయాయి.

Bigg Boss 5 Telugu: Six Contestants Nominated 1st Week, List Inside - Sakshi

చాలా చిన్న చిన్న కారణాలతో ఈ క్రమంలో.. ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ సాగింది. ఇటువంటి తరుణంలో ఎవరు ఎవరిని నామినేషన్ చేశారు..? ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ ఎలా జరిగింది అన్న విషయానికి వస్తే.. కంటెస్టెంట్ లు నామినేట్ చేయాలనుకునే వారి ఫోటోలు.. డస్ట్ బిన్ లో.. కవరు గట్టిన చెత్త టైపు లో ఉన్న బాగ్ ఫోటో.. తీసి చెత్త బుట్టలో విసరాలి…అనే  రీతిలో బిగ్ బాస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తరుణంలో ముందుగా సింగర్‌ శ్రీరామచంద్ర.. మానస్‌, జెస్సీల ఫోటోలు కలిగిన చెత్త కవర్ కలిగిన ఫోటోలను తీసి రీజన్ చెప్పి నామినేట్‌ చేశాడు. సరయూ.. ఆర్జే కాజల్‌, యాంకర్‌ రవిని; శ్వేత వర్మ.. హమీదా, నటరాజ్‌ మాస్టర్‌ను, జెస్సీ.. విశ్వ, హమీదాను; ఉమాదేవి.. కాజల్‌, జెస్సీలను నామినేట్‌ చేశారు. ఇక బిహేవియర్‌ నచ్చలేదని జెస్సీని, అందరితో క్లోజ్‌ అవ్వాలంటూ మానస్‌ను నామినేట్‌ చేశాడు విశ్వ. తనకు కాంపిటీషన్‌గా వస్తుందని సిరిని, కోపం తగ్గించుకోవాలంటూ జెస్సీని నామినేట్‌ చేసింది యానీ మాస్టర్‌. బయట ఉన్నట్లుగా హౌస్‌లో లేడని…చాల స్ట్రిక్ట్ గా నటరాజ్‌ మాస్టర్‌ ఉంటున్నాడు అని, రిలాక్స్‌గా ఉంటున్నాడని మానస్‌ను నామినేట్‌ చేశాడు రవి.

రవికి వార్నింగ్ ఇచ్చిన లోబో..:-

ఈ క్రమంలో తనకు నటించడం రాదని రవికి గట్టి కౌంటరిస్తూనే అతడిని నామినేట్‌ చేశాడు నటరాజ్‌ మాస్టర్‌. అదే రీతిలో అమాయకత్వంతో ఈ హౌస్‌లో ఉండలేవంటూ జెస్సీని నామినేట్‌ చేశాడు. హౌస్ లోకి వచ్చి 24 గంటలు గడవకుండానే అందరూ తనని నామినేట్‌ చేస్తుండటం తో  జీర్ణించుకోలేకపోయిన జెస్సీ ఒక్కసారిగా బోరున ఏడ్చేశాడు. ఇక ఆ తరువాత ఇష్టానుసారంగా మాట్లాడుతుందని లహరిని, తనను కామెంట్‌ చేశాడని జెస్సీని నామినేట్‌ చేసింది హమీదా.  టాస్క్‌లు ఆడమని తనకు చెప్పడం నచ్చలేదని సన్నీని, తన విషయాలలో ఎక్కువగా జోక్యం చేసుకోవడం నచ్చదని లోబోను నామినేట్‌ చేశాడు యూట్యూబ్ స్టార్  షణ్ముఖ్‌. యాటిట్యూడ్‌ చూపించిందని ప్రియను, యాపిల్‌ తినేటప్పుడు కళ్లలో కళ్లు పెట్టి చూస్తూ యాటిట్యూడ్‌ చూపించాడని రవిని నామినేట్‌ చేశాడు లోబో.

ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ కి నామినేట్ అయిన సభ్యులు లెక్క

దీంతో మొట్టమొదటి సీజన్ ఫైవ్ ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ కి నామినేట్ అయిన సభ్యులు లెక్క చూస్తే..మానస్‌.. విశ్వ, సరయూ; సిరి.. హమీదా, ప్రియను; సన్నీ.. షణ్ముఖ్‌, లహరిని; ప్రియాంక సింగ్‌.. షణ్ముఖ్‌, హమీదాలను; ప్రియ.. సిరి, కాజల్‌ను; మానస్‌.. విశ్వ, సరయూలను; కాజల్‌.. సరయూ, ఉమాదేవిని; లహరి.. హమీదా, కాజల్‌. వీరిలో ఎక్కువగా ఓట్లు పడిన సభ్యుల వివరాలు  రవి, మానస్‌, సరయూ, కాజల్‌, హమీదా, జెస్సీ. సో ఆరుగురు మొదటి వారం ఎలిమినేషన్‌ ప్రక్రియ కోసం నామినేట్‌ అయినట్లు బిగ్‌బాస్‌ వెల్లడించాడు. మరి వీరిలో ఎవరు సేఫ్ అవ్వుతారు…ఎవరు ఎలిమినట్ అవ్వుతారు అన్నది చూడాలి. 

 

Related posts

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju