Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కి నాగార్జున రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..??

Share

Bigg Boss 5 Telugu: తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను అమితంగా అలరిస్తున్న బిగ్ బాస్ రియాల్టీ షో సీజన్ ఫైవ్ ప్రారంభమైంది. మొట్ట మొదటి రోజు 19 మంది సభ్యులను ఇంటిలోకి పంపించగా రెండో రోజే ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ చాలా రసవత్తరంగా ఉండేలా షో నిర్వాహకులు అప్పుడే.. షో పై ఇంట్రెస్ట్ కలిగించే రీతిలో వ్యవహరించారు. దీంతో ఇప్పుడు హౌస్ లో వాడి వేడి వాతావరణం నెలకొంది. 24 గంటలు గడవకముందే.. ఇంటి సభ్యుల మధ్య చిచ్చు పెట్టే రీతిలో నామినేషన్ ప్రక్రియ బిగ్ బాస్ నిర్వహించడంతో.. ఇంటిలో అప్పుడే గొడవలు గ్రూపులు స్టార్ట్ అయిపోయాయి. బిగ్ బాస్ హౌస్ విషయంలో పరిస్థితి ఇలా ఉంటే.. ఈ షోకి హోస్ట్ గా మూడోసారి వ్యవహరిస్తున్న నాగార్జున.. రెమ్యూనరేషన్ కి సంబంధించి సరికొత్త వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వాస్తవానికి ఈ షో ప్రారంభం అవ్వకముందు హోస్ట్ గా నాగార్జున కాకుండా అనేక మంది పేర్లు వినపడ్డాయి. దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, అరియన్నా.. సమంతా ఇంకా చాలా మంది పేర్లు వినిపించాయి. చివరాకరికి నాగార్జున ప్రోమో ద్వారా ఎంట్రీ ఇచ్చి…సీజన్ 5 హోస్ట్ విషయంలో వస్తున్న వార్తలకు తెరదించారు.

Bigg Boss Telugu 5: Host Nagarjuna's rumoured fee hike to contestants, all you need to know about the upcoming season | The Times of India

గతంలో సీజన్-3, 4 లకి హోస్ట్ గా చేసిన నాగార్జున.. ఇప్పుడు ఐదో సీజన్ కి హోస్ట్ గా చేయటానికి దాదాపు 106 రోజులకు గాను భారీ పారితోషికాన్ని అందుకుంటున్న ట్లు.. గతంలో కంటే ఎక్కువగా ఈసారి సీజన్ కి నాగ్ పారితోషికాన్ని అమాంతం పెంచినట్లు ఇండస్ట్రీ లో వైరల్ వార్తలు వస్తున్నాయి. విషయంలోకి వెళితే 106 రోజులు జరిగే ఈ షోలో వీకెండ్ కి మాత్రమే వచ్చే నాగార్జున… షో మొత్తం కలిపి పన్నెండు కోట్ల మేర పారితోషికం తీసుకుంటున్నట్లు వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి. గతం లో.. వీకెండ్ ఎపిసోడ్ కి 12 లక్షలు తీసుకొని నాగార్జున ఈసారి ఆ రీతిగా కాకుండా ఒక్కసారిగా ఓవరాల్ రెమ్యునిరేషన్.. 12 కోట్లు తీసుకుంటున్నారని లేటెస్ట్ వార్త ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

తన స్టూడియో అన్నపూర్ణలో.. హౌస్ సెట్ :

అయితే ఒక్కసారిగా ఇంత రెమ్యునరేషన్ అది కూడా రియాల్టీ షో కి స్టార్ హీరో తీసుకుంటూ ఉండటం తో ఈ వార్త ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయినట్లు సమాచారం. కరోనా కారణంగా చాలావరకు సినిమా షూటింగ్ లకు అంతరాయం కలుగుతూనే ఉండటంతోపాటు నాగార్జున ఈ షోకి హోస్ట్ గా మాత్రమే కాకుండా తన స్టూడియో అన్నపూర్ణలో.. హౌస్ సెట్టు వేయించటం..తో.. చాలావరకు సీజన్ ఫైవ్ బిగ్ బాస్ తో.. టాలీవుడ్ కింగ్ నాగ్ భారీగా సొమ్ము వెనకేసుకుని ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. యాంకరింగ్ గా గతంలోనే హౌస్ లో.. ఇంటి సభ్యులను పొగిడే విషయంలో పోవటంతో పాటు వార్నింగ్ ఇచ్చే విషయంలో.. కూడా పెద్ద రకంగా నాగార్జున వ్యవహరించడంతో ఈసారి సీజన్ ఫైవ్ లో.. ఏ రీతిగా నాగ్ ఇంటి సభ్యులను డీల్ చేస్తారు అన్నది సస్పెన్స్ గా ఉంది. చాలా వరకు ఊ తన ఛానల్ మా లో.. ఉన్న యాంకర్లు అదే రీతిలో తనకు దగ్గరగా ఉండే సభ్యులు ఇంట్లో ఉండటంతో నాగార్జున.. వారి పట్ల ఎలా వ్యవహరిస్తారు అన్నది అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. ఏది ఏమైనా ఒకపక్క సినిమా రంగంలో మరోపక్క యాంకరింగ్లో కింగ్ మాదిరిగా నాగార్జున దూసుకెళ్లి పోతూ ఉండటం విశేషం.


Share

Related posts

AP CM YS Jagan: భీమవరంలో నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైఎస్ జగన్

somaraju sharma

TDP : టీడీపీ ఎంపీ కేశినేని నాని కి సొంత పార్టీలో సెగ..!!

sekhar

రాష్ట్రపతి హైదరాబాద్ రాక 21న

Siva Prasad