NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Badvel By Poll: గతంలో తిరుపతి, నేడు బద్వేల్ లో యదేశ్చగా దొంగ ఓట్లు – ఇదిలో ఫ్రూఫ్ అంటూ వీడియోలు విడుదల చేసిన బీజేపీ…

Badvel By Poll: కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే పోలింగ్ తీరుపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లా బద్వేల్ లో వైసీపీ దొంగ ఓట్లు వేయించుకుంటోందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు,. ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, ఆ పార్టీ నేత విష్ణు వర్ధన్ రెడ్డిలు ట్విట్టర్ వేదికగా పోలింగ్ తీరుపై ఆరోపణలు చేస్తూ పోలింగ్ కేంద్రాల వద్ద తీసిన వీడియోలను పోస్టు చేశారు. గతంలో తిరుపతి – నేడు బద్వేల్, చివరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లాలో కూడా దొంగ ఓట్లకు వైసీపీ నేతలు తెర తీశారని సోము వీర్రాజు విమర్శించారు. అట్లూరు మండలంలోని పోలింగ్ బూతులకు సరిహద్దు గ్రామాల నుండి ప్రజలను తీసుకువచ్చి బాహాటంగా దొంగ ఓట్లు వేయించుకుంటున్న వైసీపీ.వేయించుకుంటోందని పేర్కొంటూ ఆ పోలింగ్ వద్ద ఇతర ప్రాంతాల వారు వచ్చిన వీడియో ను షేర్ చేశారు.

BJP Leaders slams Badvel By Poll ycp activities
BJP Leaders slams Badvel By Poll ycp activities

Badvel By Poll: ఇదీ ఒక గెలుపేనా ?

డబ్బులు పంచి ఓట్లు వేయించుకోవడం కూడా ఒక గెలుపేనా?, బద్వేల్ 21వ వార్డ్ కౌన్సిలర్ భూమా రెడ్డి ఓటర్లకు నేరుగా డబ్బులు పంచుతున్నాడు, బద్వేల్ లో ఓట్లు వేసేవారు లేక పక్క జిల్లాల నుంచి తెచ్చుకుంటున్నారు, ఇలాంటి గెలుపు కూడా ఒక గెలుపేనా? , అట్లూరు మండలంలో పోలీసులు వైసిపి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు అంటూ ఆరోపించిన సోము వీర్రాజు ఇది జగన్ రెడ్డి గారి ప్రజాదరణ అని ఎద్దేవా చేశారు. బీజేపీ ఏజెంట్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారనీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఆరోపించారు. ఈ ఉప ఎన్నికల్లో దొంగలు, పోలీసులు ఒక్కటయ్యారంటూ ఆరోపణలు గుప్పించారు. పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలు లేకపోవడంతో స్థానిక పోలీసులే ఉంటున్నారని పేర్కొన్నారు. పోరుమామిళ్లలో బయటి వ్యక్తులు తిరుగుతున్నారని ఆయన ఆరోపించారు. తిరుపతి ఉప ఎన్నికలు అయినా, బద్వేల్ ఉప ఎన్నిక అయినా వీరు రక్షక భటులు కాదు ప్రేక్షక భటులు అంటూ బీజేపీ ఓ వీడియోను విడుదల చేసింది. పోలింగ్ బూత్ వద్ద జనాలు వెళుతున్నా విధి నిర్వహణ ఉన్న కానిస్టేబుల్ సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ ఉన్న వీడియోను షేర్ చేసింది బీజేపి.

 

పోలీసులకు, వైసీపీ కార్యకర్తలకు పెద్ద తేడా ఏమీలేదు

బద్వేల్ లో పోలీసులకు, వైసీపీ కార్యకర్తలకు పెద్ద తేడా ఏమీలేదనీ, వైసీపీ కార్యకర్తల కంటే ఘోరంగా వైసీపీకి పోలీసులు సహకరిస్తున్నారని బీజేపీ నేత విష్ణు వర్ధన్ రెడ్డి విమర్శించారు. మాజీ ఎమ్మెల్సీ గోవిందరెడ్డిని హౌస్ అరెస్టు చేయాలని డిమాండ్ చేసిన విష్ణువర్ధన్ రెడ్డి ..దొంగ ఓట్లతో గెలిచేది ఒక గెలుపేనా అని ప్రశ్నించారు. నాడు తిరుపతిలో ఏ రకంగా అయితే దొంగ ఓట్లు వేశారో దాన్నే ,బద్వేల్ లో పునరావృత్తం చేశారని విమర్శించారు. పోలీసులే దొంగ ఓట్లను ప్రోత్సహించడం సిగ్గుచేటని ఆయన అన్నారు.

ఆ ఆరోపణల్లో నిజం లేదు

కాగా బీజేపీ నేతలు ఈ రకమైన ఆరోపణలు చేస్తుండగా ఏపీ సీఇఓ విజయానంద్ వాటిని ఖండించారు. ఇతర ప్రాంతాల నుండి జనాన్ని తరలిస్తున్నారని వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని అన్నారు. దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదన్నారు. మొత్తం 281 పోలింగ్ కేంద్రాలను కూడా వెబ్ కాస్టింగ్ ద్వారా నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాత్రి 7 గంటల వరకూ పోలింగ్ కొనసాగుతుందని, పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని విజయానంద్ వెల్లడించారు.

 

Related posts

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju