NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Govt: ఏపి డిప్యూటి సీఎం నారాయణ స్వామికి సర్కార్ షాక్..! మేటర్ ఏమిటంటే..?

AP Govt: జగన్మోహనరెడ్డి సర్కార్ మంత్రుల శాఖలను పునర్వ్యవస్థీకరించింది. ఇప్పటి వరకూ డిప్యూటి సీఎం నారాయణ స్వామి ఆధీనంలో ఉన్న వాణిజ్య పన్నుల శాఖను ప్రభుత్వం తప్పించింది. ఈ కీలక శాఖను ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డికి అప్పగించారు. ఈ మార్పుతో ఇక నుండి డిప్యూటి సీఎం నారాయణ స్వామి ఆధీనంలో ఎక్సేజ్ శాఖ మాత్రమే ఉంటుంది. వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా బుగ్గన రాజేంద్ర నాధ్ కొనసాగనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు,

AP Govt key orders on commercial tax  department
AP Govt key orders on commercial tax department

AP Govt: డిప్యూటి సీఎం నారాయణ స్వామి నుండి వాణిజ్య పన్నుల శాఖ మంత్రి బుగ్గనకు బదిలీ

ఆర్ధిక శాఖ పరిధిలోకి వాణిజ్య పన్నులు, స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలను తీసుకువెళ్లాలని గతంలోనే ప్రభుత్వం భావించింది. అయితే అప్పట్లో దానిపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఆ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. అయితే అప్పటి ప్రతిపాదనల్లో ఉన్న వాణిజ్య పన్నల శాఖను ఆర్ధిక శాఖలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రే షన్ కు సంబంధించి ఇంకా ప్రభుత్వ నిర్ణయం వెలువడలేదు. ఈ శాఖను ఆర్ధిక శాఖలో విలీనం చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రభుత్వవర్గాలు పేర్కొంటున్నాయి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ప్రస్తుతం మరో డిప్యూటి సీఎం ధర్మాన కృష్ణ దాస్ ఆధీనంలో ఉంది,. ఈ శాఖను ధర్మాన కృష్ణదాస్ నుండి తప్పించి ఆర్దీక శాఖలో విలీనం చేస్తే ధర్మాన పరిధిలో రెవెన్యూ శాఖ మాత్రమే ఉంటుంది.

 

శాఖల మార్పుతో కొత్త మంత్రులకు పోర్టుపోలియోలు

సీఎం వైెఎస్ జగన్ ప్రస్తుతం ఉన్న మంత్రులను పూర్తిగా మార్చి కొత్త వారితో మంత్రివర్గం ఏర్పాటు చేస్తారని వార్తలు వస్తున్న తరుణంలో తాజాగా తీసుకున్న ఈ నిర్ణయాలు కీలకంగా మారాయి. మంత్రుల శాఖలో మార్పుల అనంతరం దాని ఆధారంగానే కొత్త మంత్రులకు ఫోర్టుపోలియోలు కేటాయించనున్నారు. ఆదాయ పరంగా కీలక శాఖలపై వాణిజ్య పన్నులు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలను ఆర్ధిక శాఖ పరిధిలో ఉండటం మేలన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్ధిక శాఖ మంత్రి అసెంబ్లీ అసెంబ్లీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. నూతన మార్పుల వల్ల ఆర్ధిక శాఖకి పని భారం, ఒత్తిడి ఎక్కువగా ఉంటాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆర్ధిక మంత్రి పరిధిలో ఉన్న శాసనసభా వ్యవహారాలను విస్తరణలో భాగంగా న్యాయశాఖతో కలిపి కేటాయిస్తారనే మాట వినబడుతోంది. డిసెంబర్ 8 నాటికి ప్రస్తుత మంత్రులు బాధ్యతలు చేపట్టి రెండున్నరేళ్లు పూర్తి అవుతుంది. దీంతో డిసెంబర్ నెలాఖరులోగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే సీఎం జగన్ దీనిపై కసరత్తు ప్రారంభించారని సమాచారం.

 

 

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju