NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: విశాఖ జీవీఎంసీ 31వ వార్డు ఎన్నికలో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన వైసీపీ..! ఖంగుతున్న టీడీపీ..!!

YSRCP: “ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే” అన్నారు ఓ మహా కవి. కానీ అది అవునో కాదో తెలియదు కానీ రాజకీయ నాయకుల మాటలకు అర్ధాలే వేరులే అన్నది ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను చూస్తే ప్రతి ఒక్కరికీ అర్ధం అవుతుంది. విశాఖ నగర పాలక సంస్థ 31వ డివిజన్ ఉప ఎన్నికల్లో వైసీపీ బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. వైసీపీ ట్విస్ట్ కు అక్కడి టీడీపీ ఖంకుతిన్నది.

YSRCP big twist in gvmc elections
YSRCP big twist in gvmc elections

Read More: Kuppam Municipality: కుప్పం మున్సిపల్ అఫీసు వద్ద టీడీపీ నేతల ఆందోళన..! ఎందుకంటే..?

YSRCP: పార్టీ అభ్యర్ధిగా మారిన స్వతంత్ర అభ్యర్ధి

విషయంలోకి వెళితే.. విశాఖ జీవీఎంసీ పరిధిలో 31వ వార్డు టీడీపీ కార్పోరేటర్, 61వ వార్డు వైసీపీ కార్పోరేటర్ మృతి చెందడంతో ఈ వార్డుల్లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఏ పార్టీకి చెందిన వారు మృతి చెందారో ఆ ప్రాంతంలో మరొకరు పోటీ చేయకూడదని టీడీపీ, వైసీపీ ఓ అంగీకారానికి వచ్చాయి. ఈ అంగీకారం మేరకు 61వ వార్డులో టీడీపీ అభ్యర్ధిని ఆ పార్టీ పోటీ పెట్టలేదు. వైసీపీ కూడా 31వ వార్డులో పోటీకి అభ్యర్ధిని పెట్టలేదు. సో.. ఇంత వరకూ బాగానే ఉంది. అయితే 31వ వార్డులో స్వతంత్ర అభ్యర్ధిగా బిపిన్ కుమార్ జైన్ స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేయడంతో రిటర్నింగ్ అధికారి బీరువా గుర్తు కేటాయించారు. అయితే వైసీపీ సదరు స్వతంత్ర అభ్యర్ధికి బీఫాం అందజేయడంతో సాయంత్రం ఆరు గంటల తరువాత అదే బిపిన్ కుమార్ జైన్ కు వైసీపీ ఫ్యాన్ గుర్తును కేటాయిస్తూ రిటర్నింగ్ అధికారి మరో ప్రకటన విడుదల చేశారు. దీంతో టీడీపీ ఖంగుతినాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. వైసీపీ విలువలను దిగజారి ప్రవర్తిస్తుందని టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. రిటర్నింగ్ అధికారిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు టీడీపీ సిద్దమవుతోంది.

బద్వేల్ లో సంప్రదాయం విశాఖలో తప్పింది

ఇటీవల బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో దివంగత ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య సతీమణి డాక్టర్ దాసరి సుధ వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన నేపథ్యంలో సంప్రదాయాన్ని అనుసరించి అభ్యర్ధులను  టీడీపీ, జనసేన నిలపలేదు. ఈ నేపథ్యంలోనే వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విశాఖ నగర పాలక సంస్థ 31వ డివిజన్ లో పోటీ వైసీపీ నుండి పోటీ పెట్టడం లేదని కూడా ప్రకటించారు. ఇప్పుడు వైసీపీ మాట మార్చి ఇండిపెండెంట్ అభ్యర్ధిని పార్టీ అభ్యర్ధిగా నిలపడంపై సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది.

Related posts

పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలకు వైసీపీ టికెట్… బంప‌ర్ ఆఫ‌ర్‌..?

విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం…!

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?

షర్మిలను ఓడించేందుకు కోమటిరెడ్డి కుట్రలు ..!

గేరు మార్చితేనే `న‌గ‌రి`లో భానోద‌యం… రోజా గేమ్ మామూలుగా ఉండ‌దు మ‌రి..?

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N