NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Kondapalli Municipality: కొండపల్లి మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నిక వివాదం..! హైకోర్టు‌కు చేరిన పంచాయతీ..!!

Kondapalli Municipality: కొండపల్లి మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నిక వ్యవహారం తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. వైసీపీ ఆందోళనల నేపథ్యంలో రెండవ రోజు చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. నిన్న వైసీపీ కౌన్సిల్ హాలులో గొడవ చేసిన నేపథ్యంలో ఎన్నికల అధికారి నేటికి వాయిదా వేశారు. ఈ రోజు కూడా వైసీపీ సభ్యులు కౌన్సిల్ హాలులో ఎంపి కేశినేని నాని ఎక్స్ అఫిషియో ఓటును వ్యతిరేకిస్తూ ఆందోళన చేశారు. దీంతో ఎన్నికను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఎంపీ కేశినేని నానితో సహా టీడీపీ సభ్యుడు 14 మంది, ఇండిపెండెంట్ సభ్యుడు ఓ పక్క కూర్చోగా వైసీపీ సభ్యులు, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కౌన్సిల్ హాలులోకి వచ్చారు. కౌన్సిల్ హాలులో గొడవ అనంతరం వీరు వాకౌట్ చేశారు.

Kondapalli Municipality chairperson election controversy
Kondapalli Municipality chairperson election controversy

 

Kondapalli Municipality: ఎన్నికపై హైకోర్టు సీరియస్

మరో పక్క కొండపల్లిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ మున్సిపాలిటీలో టీడీపీ, వైసీపీకి 14 – 14 కౌన్సిలర్ లు గెలుచుకోగా గెలిచిన మరో స్వతంత్ర అభ్యర్ధిని టీడీపీలోకి చేరిపోయారు. దీంతో హైకోర్టు ఆదేశాలతో ఎక్స్ అఫిషియో ఓటు వినియోగించుకునేందుకు విజయవాడ టీడీపీ ఎంపి కేశినేని నాని పాల్గొనగా వైసీపీ వర్గీయులు వ్యతిరేకిస్తున్నారు. ఎన్నిక వాయిదా పై టీడీపీ హైకోర్టులో లంచన్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. టీడీపీ తరుపున న్యాయవాది అశ్వనీకుమార్ వాదనలు వినిపించారు. ఎన్నిక జరగకుండా వైసీపీ నాయకులు విధ్వంసం సృష్టించారని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఈ పిటిషన్ పై వాదనలు విన్న ధర్మాసనం అక్కడి పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విజయవాడ సీపీ, కొండపల్లి మున్సిపల్ కమిషనర్ కోర్టుకు హజరు అయి వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ ఎన్నికపై హైకోర్టు ఎటువంటి డైరెక్షన్ ఇస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Related posts

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju