NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్

Viral Video: ఆ ఎమ్మెల్యేలను చంపితే రూ.50లక్షలు…? కమ్మాయన వైరల్ కామెంట్..!!

Viral Video: వీళ్లు సాధారణ వ్యక్తులు కాదు..ఒకరు రాష్ట్ర మంత్రి. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు. కానీ వీళ్లను భౌతికంగా లేకుండా చేస్తే తన వంతుగా రూ.50 లక్షలు ఇస్తానంటూ ఓ వ్యక్తి బహిరంగంగా ప్రకటించడం, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం అయ్యింది. ఇటీవల ఏపి అసెంబ్లీలో చంద్రబాబుపై జరిగిన ఘటన తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. తనను అవమానించిందే కాకుండా ఏనాడూ రాజకీయాల్లోని తన సతీమణి భువనేశ్వరిపైనా వైసీపీ నేతలు నిందారోపణలు చేస్తూ అవమానించారని చంద్రబాబు కన్నీరు పెట్టుకోవడం ఆ పార్టీ వర్గాలను, ఆ సామాజిక వర్గాన్ని కలచివేసింది. అసెంబ్లీలో భువనేశ్వరి పేరును ఎవరూ ప్రస్తావించలేదనీ, చంద్రబాబు కావాలనే సానుభూతి డ్రామాలు అడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే అసెంబ్లీలో జరిగిన ఘటనకు సంబంధించి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో చంద్రబాబు మాటలను విశ్వసిస్తున్నారు. దీనిపై ఏపి వ్యాప్తంగా టీడీపీ వర్గాలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. నందమూరి కుటుంబం మొత్తం మీడియా ముందుకు వచ్చి వైసీపీ నేతల తీరును తీవ్రంగా ఖండించారు. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిరలో టీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఒకరు ఈ ఘటనను పురస్కరించుకుని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.

Viral Video: Madhira leader sensational comments
Viral Video: Madhira leader sensational comments

 

Read More: CM Jagan: ఆ లబ్దిదారులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..! వారి కల నెరవేరే సమయం ఆసన్నమైంది..!!

కాకతీయ సేవా సమితి (కమ్మ సామాజిక వర్గ) వన సమారాధాన కార్యక్రమంలో ఎం వాసు అనే వ్యక్తి పరిటాల రవి హత్య, ఇటీవల ఏపిలో జరిగిన పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.  గతంలో టీడీపీకి, కమ్మ సామాజిక వర్గం వారికి ధైర్యంగా ఉన్న పరిటాల రవిని భౌతికంగా నిర్మూలించడం కోసం అప్పటి పాలకులు వెనుక ఉండి మొద్దు శ్రీను అనే క్రిమినల్ తో ఆపరేషన్ స్టార్ట్ చేసి హత్య చేయించారని ఆరోపించారు. పరిటాల రవి ప్రస్తుతం ఉండి ఉంటే ఆంధ్రాలో ఇటువంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం సమయం ఆసన్నమైంది. మనల్ని మనం ఫ్రూ చేసుకోవాల్సిన సమయం వచ్చింది. కులంలో చీడ పురుగురులుగా ఉన్న వల్లభనేని వంశీ, కొడాలి నాని లాంటి వాళ్లే కాకుండా మదపుటేనుగుగా ప్రవర్తిస్తున్నటువంటి అంబటి రాంబాబుల కోసం మనం కూడా ఆపరేషన్ స్టార్ట్ చేసి వారిని భౌతికంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని అన్నారు. దాని కోసం అవసరమైతే అటువంటి కార్యక్రమానికి ముందుకు వస్తే తాను రూ.50 లక్షల ఆర్ధిక చేయూత అందిస్తానని కూడా ఆయన ప్రకటించారు.

ఒక రాష్ట్రానికి చెందిన మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలను హత్య చేయడానికి ముందుకు వస్తే తన వంతుగా రూ.50 లక్షల ఇస్తానని అతను  ప్రకటించడం తీవ్ర సంచలనం అవుతోంది. ఇదే నిజమైతే ఏపి సర్కార్ దీనిపై ఊరుకుంటుందా ?. అతను మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఇదీ రియల్ వీడియో కాదనీ, మర్ఫింగ్ వీడియో అని కూడా కొందరు అంటున్నారు. పోలీసుల దర్యాప్తులో ఇది వాస్తవమైనదా కాదా అనేది తేలాల్సి ఉంది.

 

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju