NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ సినిమా

Tollywood: సినీ ఇండస్ట్రీ సమస్యలపై సంచలన వ్యాఖ్యలు చేసిన నిర్మాత సి కళ్యాణ్..!!

Tollywood: తెలుగు సినీ ఇండస్ట్రీలో టికెట్ల వివాదంపై ఇంకా వాడివేడిగా చర్చ జరుగుతూనే ఉంది. ఏపి ప్రభుత్వం తాజాగా తీసుకువచ్చిన సినిమాటోగ్రఫీ చట్ట సవరణతో ఇండస్ట్రీకి తీవ్ర నష్టం జరుగుతోందన్న అభిప్రాయం వారిలో ఉన్నా కొంత మంది మాత్రమే బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా నిర్మాత సీ కళ్యాణ్ ఈ అంశంపై స్పందించారు. ఇప్పుడు ఉన్న టికెట్ల ధరల పెంపుపై ఏపి ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఆయన కోరారు. ఇప్పటి వరకూ అందరు ముఖ్యమంత్రులు టాలీవుడ్ ఇండస్ట్రీకి అనుకూలంగానే వ్యవహరించారని పేర్కొన్న కళ్యాణ్ .. ఏపి సీఎం జగన్ తో టాలీవుడ్ కు ఇటీవల కాలంలో కొంత గ్యాప్ వచ్చిన మాట వాస్తవమేనన్నారు.

Tollywood producer c kalyan comments on industry
Tollywood producer c kalyan comments on industry

Tollywood: దాసరి లేని లోటు కనబడుతోంది

ఇదే క్రమంలో ఆయన దివంగత దాసరి నారాయణరావును గుర్తు చేస్తూ అటువంటి పరపతి కల్గిన వ్యక్తి ప్రస్తుతం ఇండస్ట్రీలో లేరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆన్ లైన్ టికెటింగ్ విధానం తమకు మేలే అని పేర్కొన్న ఆయన టికెట్ ధరలు పెంచకపోతే ఇండస్ట్రీకి తీరని నష్టమేనన్నారు. టికెట్ల ధరలపై ప్రభుత్వం మరో సారి పునరాలోచన చేయాలని ఆయన కోరారు. ఇంతకు ముందు మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత డి సురేష్ తదితరులు కూడా టికెట్ ధరల విషయంలో ఏపి సర్కార్ కు విజ్ఞప్తులు చేసిన విషయం తెలిసిందే. సమస్యలపై చర్చించేందుకు ఇండస్ట్రీ పెద్దలు ఎవరైనా సీఎం వైఎస్ జగన్ తో నేరుగా చర్చించాలని భావిస్తూ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదనీ, సంబందిత మంత్రి పేర్ని నానితో భేటీ కావాలని సూచిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. త్వరలో పలు భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఆ వర్గాల్లో కొంత ఆందోళన నెలకొని ఉందని అంటున్నారు. చూడాలి ఏమి జరుగుతుందో.

Related posts

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri