NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Cinema: ఏపి హైకోర్టు ఆదేశాలతో సినిమా టికెట్ల అంశంపై ప్రభుత్వ కీలక నిర్ణయం

AP Cinema: ఏపిలో సినిమా టికెట్ల ధరల నిర్ణయంపై ధియేటర్ల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే. ఓ పక్క రెవెన్యూ, పోలీసు అధికారుల తనిఖీల నేపథ్యంలో పలు ధియేటర్లను స్వచ్చందంగా మూసివేశారు. ఈ సమస్యపై చర్చలు జరిపేందుకు ధియేటర్ల యాజమాన్యాలకు మంత్రి పేర్ని నాని అపాయింట్మెంట్ ఖరారు చేశారు. మరో పక్క ప్రభుత్వం హైకోర్టు ఆదేశాల మేరకు సినిమా టికెట్ల ధరల పరిశీలనకు కొత్త కమిటీని నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వలు జారీ చేసింది. ఈ కమిటీకి హోంశాఖ ముఖ్య కార్యదర్శి విశ్వజిత్ చైర్మన్ గా వ్యవహరించనున్నారు. దీనిలో సభ్యులుగా రెవెన్యూ, ఆర్ధిక, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శులు, సమాచార శాఖ కమిషనర్, న్యాయశాఖ కార్యదర్శి,  కృష్ణాజిల్లా జేసితో పాటు ధియేటర్ల యాజమానులు, డిస్ట్రిబ్యుటర్లు, సినీ గోయర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఉంటారు. థియేటర్ల వర్గీకరణతో పాటు టికెట్ల ధరలను ఈ కమిటీ నిర్దారించనున్నది. అనంతరం ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది.

Govt appointed new committee on AP Cinema tickets issue
Govt appointed new committee on AP Cinema tickets issue

 

AP Cinema: 16 మందితో ఏపి ప్రభుత్వానికి లిస్ట్

ఈ క్రమంలో సినీ రంగం నుండి ప్రతినిధుల పేర్లు పంపాలని ఏపి ప్రభుత్వం కోరడంతో కమిటీని ఏర్పాటు చేశామని ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలిపారు. మొత్తం అయిదురు నిర్మాతలు, అయిదుగురు డిస్ట్రిబ్యూటర్లు, ఆరుగురు ఎగ్జిబిటర్ల పేర్లను సెలెక్ట్ చేశామని తెలుగు ఫిలిం ఛాంబర్ తెలియజేసింది. ఈ 16 మందిలో అయిదుగురు పేర్లను ఏపి ప్రభుత్వం సెలెక్ట్ చేయనుంది. ఈ అయిదుగురు సభ్యుల బృందంతో ఏపి సర్కార్ చర్చించనుంది.

కోర్టు ఆదేశాలతో…

సినిమా టికెట్ల ధరలను నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 35పై కొందరు థియేటర్ యజమానులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఆ జివోను నిలుపుదల చేసిన విషయం తెలిసిందే. పాత విధానమే అమలు చేసుకోవాలని సూచించారు. అయితే సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన ఈ తీర్పును రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ధర్మాసనంలో సవాల్ చేసింది. దీనిపై విచారించిన ధర్మాసనం సినిమా టికెట్ల కు సంబంధించి ధియేటర్ల యజమానులు తమ ప్రతిపాదనలు జాయింట్ కలెక్టర్ల దృష్టికి తీసుకువెళ్లాలని తెలిపింది. ఇదే క్రమంలో ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసింది.

Related posts

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju