NewsOrbit
న్యూస్

Karthika Deepam Jan 22 Today Episode: అబ్బా! ఒక కాఫీ ఎంతపని చేసింది.దీపను అడ్డంగా బుక్ చేసేసిందిగా. మరి దీప ఎలా తప్పించుకుంటుందో..?

Karthika Deepam Jan 22 Today Episode:కార్తీక దీపం సీరియల్ భలే ఆసక్తికరంగా ముందుకు సాగుతూ పోతుంది.కార్తీక్ కుటుంబం చెట్టుకి ఒకళ్ళు పుట్టకి ఒకళ్ళు అన్నట్టుగా విడిపోయి బతుకుతున్నారు . కార్తీక్, దీప ఇద్దరూ కూడా ప్రకృతి ఆశ్రమంలో సౌందర్య, ఆనందరావుని చూసినప్పటి నుంచి తమలో తామే మదనపడుతూ ఉన్నారు. మరోవైపు. సౌందర్య, ఆనందరావులు కాఫీ తాగేందుకు తాను పనిచెసే హోటల్ కే రావడం చూసి కార్తీక్ షాక్ అవుతాడు. ఎలా వాళ్ళకి కనిపించకుండా తప్పించుకోవాలో అనే ఆలోచనలో పడతాడు కార్తీక్ అక్కడితో నిన్నటి ఎపిసోడ్ ముగుస్తుంది.

Gudivada: గుడివాడ క్యాసినో కేసులో దిమ్మతిరగే ట్విస్ట్ – కొడాలి నాని మామూలోడు కాదు బాబోయ్..!

Karthika Deepam Jan 22 Today Episode: మోనిత ఫోటోను సౌందర్యకు చూపించిన అప్పిగాడు :

ఇక ఈరోజు ఎపిసోడ్ కూడా హోటల్ సీన్ తోనే ప్రారంభం అవుతుంది. హోటల్ లో అప్పారావు చూపిన బస్తీ దొరసాని ఎవరో కాదు వచ్చింది మోనితేనండి అనుకుంటారు. అసలు ఈ ఊరెందుకు వచ్చిందంటారు అని అంటుంది కంగారుగా సౌందర్య. ఇంతలో ఆనందారావు ఏమి కాదు ప్రశాంతంగా ఉండు,ఆ రుద్రాణి గొడవ మరిచిపోదాం అనుకుంటే మళ్ళీ నువ్వు ఆ మోనితని గుర్తు చేయకంటాడు ఆనందరావు. ఇంతలో అప్పారావు లోపలికి వెళ్లి.. ‘ఏంటి బావా కాఫీ తెమ్మంటే తీసుకుని రావు అని కార్తీక్ చేతిలో పిలిస్తే రావు’ అంటూనే.. కార్తీక్ చేతిలోని కాఫీ తీసుకుని అప్పారావు వెళ్లగా అది తాగి చాలా బాగుంది అంటూనే అప్పారావుతో సరదాగా మాట్లాడతారు ఇద్దరూ. అప్పారావు మోనితతో తీసుకున్న సెల్ఫీ చూపించి.. ‘మేడమ్ నేను చెప్పినామె ఈమె’ అంటాడు. ఆ ఫొటో చూసి షాక్ అయిన సౌందర్య.. ఆనందరావుకి చూపించి కాఫీ డబ్బులు ఇచ్చేసి చిల్లర నువ్వే ఉంచుకో అనేసి వెళ్లిపోతుంది.

Prabhas : 9 భాషలు – 30 వేల థియేటర్లు.. హాలీవుడ్ హీరోల రికార్డ్ బద్దలు కొట్టిన ప్రభాస్.. ఫ్యాన్స్‌కి పూనకం తెప్పించే న్యూస్ !
రుద్రాణితో జాగ్రత్త అని దీపను హెచ్చరించిన మహాలక్ష్మి:

కట్ చేస్తే.. మహాలక్ష్మి బాబుని తీసుకొచ్చి దీపకు ఇస్తుంది. బాబు ఎమన్నా ‘ఇబ్బంది పెట్టాడా అంటే లేదు అని..కానీ ఆ రుద్రాణి ఎక్కడ మా ఇంటికి వస్తుందో.. బాబుని ఎక్కడ చూస్తుందో అని భయపడ్డాను అంటుంది.మీరు ఆ రుద్రాణి సమస్య నుంచి తొందరగా బయటపడితే బెటర్’ అంటూ బాబుని అప్పగించి  వెళ్లిపోతుంది. ఆ రుద్రాణి గురించి ఆలోచిస్తూ వడ్డీ కట్టాల్సిన గడువు తీరిపోయింది.. ఇంకా కట్టలేదు ముందు ఆ పనిలో ఉండాలని మనసులో అనుకుంటూ.. ‘నాన్నా ఆనంద్‌ నువ్వు బొజ్జో.. నేను ఇప్పుడే వస్తాను’ అంటూ బయటికి వెళ్తుంది దీప. మరోవైపు కార్తీక్ అప్పారావుతో నాకు సెలవు కావాలి నువ్వు ఓనర్‌కి చెబుతావా అంటాడు. బావా నువ్వు జాయిన్ అయ్యింది ఇప్పుడే కదా సెలవు కావాలా అని అలా కాదు కానీ.. నీకు కడుపు నొప్పి వస్తే వెళ్లిపోయావని చెప్తాలే అని తన ఐడియాతో కార్తీక్‌ని ఇంటికి పంపిస్తాడు.

బాబుని ఎత్తుకొచ్చిన రుద్రాణి… ఆవేశంలో దీప..:

ఇక సౌందర్య, ఆనందరావులు వెళ్తూ వెళ్తూ ఒకేసారి ఇద్దరు ఆ కాఫీ మన వంటలక్క దీప పెట్టినట్లే ఉంది కదా అనుకుంటారు. అక్కడకు వెళ్లి కనుక్కుందాం పద అనుకుంటారు.సీన్ కట్ చేస్తే పిల్లిగడ్డం రౌడీ బాబుని ఊయల్లో వేసి ఊపుతుంటాడు.ఇంతలో దీప గేట్ తోసుకుంటూ ‘రుద్రాణీ’ అని అరుస్తూ వస్తుంటే అరవకు దీపా అన్న రుద్రాణితో బాబుని ఎత్తుకొచ్చి తప్పుచేశావ్ నీకు డబ్బులు ఇస్తాం అన్నాం కదా అంటుంది.3 లక్షల 20 వేలకు రెండు రూపాల చొప్పు ఆరు వేల నాలుగు వందలు తెచ్చి ఇచ్చి రంగరాజుని తీసుకెళ్లు అంటుంది రుద్రాణి. కాదు కూడదు అంటే నా మనుషులతో చెప్పి నీ పిల్లల్ని కూడా ఎత్తుకుని రమ్మంటా జాగ్రత్తా అని వార్నింగ్ ఇస్తుంది . దాంతో దీప వాడికి పాలు పట్టండి, నేను వడ్డీ డబ్బులు తీసుకొస్తాను అంటూ మౌనంగా వెళ్లిపోతుంది.

కాఫీ రుచిని కనిపెట్టిన సౌందర్య,ఆనందరావులు దీపను పట్టుకుంటారా..?

ఇంతలో సౌందర్య, ఆనందరావు తిరిగి హోటల్‌కి వచ్చి ఓనర్ తో ఇక్కడ కాఫీ కలిపింది ఎవరో చెబుతారా అని అడగగానే ఆ ఓనర్‌కి దీప గతంలో నా గురించి ఎవరికీ చెప్పొద్దూ అన్నా మాటలు గుర్తుచేసుకుని ‘సాంబయ్య మేడమ్’ అని అబద్ధం చెబుతాడు.మరో పక్క కార్తీక్ ఆశ్రమంలో కూరగాయలు అమ్మే అతని దగ్గరకు వెళ్లి నాకో సాయం చేయాలని అక్కడికి వచ్చిన ఇద్దరు దంపతుల వివరాలు కావాలి అంటాడు. ‘అలా చెప్పకూడదు సారి సార్ అంటాడుమరోపక్క దీప బాబును తలుచుకుని ఏమి చేయాలో తెలియక ఒంటరిగా ఇంట్లో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగిసింది…

Related posts

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju

Video Morphing Case: అమిత్ షా డీప్ షేక్ వీడియో కేసు.. గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు ..సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు

sharma somaraju

Supreme Court: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ ..ఎన్జీటీ తీర్పును యథాతధంగా అమలు చేయాలంటూ ఆదేశం

sharma somaraju

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి టాలీవుడ్ స్టార్ హీరో స‌తీమ‌ణి.. హీరోయిన్‌గా కూడా చేసింది.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Priyadarshi Pulikonda: హీరోగా దూసుకుపోతున్న క‌మెడియ‌న్ ప్రియదర్శి.. చేతిలో ఏకంగా అన్ని సినిమాలా..?

kavya N