NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Brother Anil Kumar: బ్రదర్ అనిల్ కీలక వ్యాఖ్యలు..! విశాఖలో క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో భేటీ..

Brother Anil Kumar: బ్రదర్ అనిల్ కుమార్.. క్రైస్తవ, బీసీ సంఘాల ప్రతినిధులతో  వరుస భేటీలు నిర్వహించడం ఏపి రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. గత నెలలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. రాజకీయ, కుటుంబ పరమైన విషయాలపై ఉండవల్లితో చర్చించినట్లు ఆయన ఆనాడు తెలిపారు. ఇటీవల విజయవాడలో క్రైస్తవ, బీసీ సంఘాల నేతలతో సమావేశం అయ్యారు. దీంతో ఏపిలో రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను ఆయన ఖండించారు. ఈ వ్యవహారం మరువకముందే నేడు విశాఖలోని ఓ హోటల్ లో క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టిన తరువాత..బ్రదర్ అనిల్ ఏపిలో తరచు పర్యటనలు చేస్తూ బీసీ, మైనార్టీ, క్రైస్తవ సంఘాల ప్రముఖులతో సమావేశాలు నిర్వహిస్తుండటంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.

Brother Anil Kumar key comments
Brother Anil Kumar key comments

Read More: Brother Anil: షర్మిల భర్త పొలిటికల్ పావులు..!? పార్టీ కాదు.., కానీ జగన్ కి వ్యతిరేక కూటమి..!?

Brother Anil Kumar: క్రైస్తవ సంఘాల ప్రతినిధులకు ఇబ్బందులు

ఇప్పటికే ఏపీ సీఎం వైఎస్ జగన్, ఆమె సోదరి వైఎస్ షర్మిల మధ్య గ్యాప్ ఏర్పడిందని ప్రచారం జరుగుతున్న తరుణంలో బ్రదర్ అనిల్ ఏపిలో పర్యటనలు చేస్తుండటంతో రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన చేస్తున్నారు అంటూ ఊహాగానాలు సాగుతున్నాయి. ఆయనను అభిమానించే వర్గాల వారు పార్టీ పెట్టాలని వత్తిడి చేస్తున్నారని సమాచారం. ఈ సందర్భంలో బ్రదర్ అనిల్ కీలక వ్యాఖ్యలు చేశారు. వివిధ సంఘాల ప్రతినిధులు తనతో వారి బాధలు చెప్పుకున్నారన్నారు. వారి సమస్యలను పట్టించుకునే వారు లేరని అన్నారు. వారి సమస్యలను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకువెళ్తానన్నారు.

పార్టీ పెట్టాలన్న డిమాండ్ ఉంది

జగన్ బిజీగా ఉండటం వల్ల రెండున్నరేళ్లుగా కలవలేదన్నారు. సమయం కుదిరినప్పుడు కచ్ఛితంగా కలుస్తానని తెలిపారు. తనను కలిసిన వాళ్లకు సాయం చేస్తానని హామీ ఇచ్చాననీ, మాట ఇస్తే కచ్ఛితంగా వెనక్కు తగ్గకుండా నిలబడతానని చెప్పారు. పార్టీ పెట్టాలని కూడా డిమాండ్ కూడా ఉందని తెలిపారు. తాను పార్టీ పెట్టకపోతే వాళ్లే పార్టీ పెడతామని అంటున్నారనీ, వాళ్లు పార్టీ పెడితే తాను మద్దతు ఇస్తానని తెలిపారు. సమయం వచ్చినప్పుడు ఏపిలో పార్టీపై స్పష్టత ఇస్తానని అన్నారు బ్రదర్ అనిల్.

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?