NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YSRCP: ఇద్దరూ అధికార పార్టీ ఎంపీలే..! ఒకరిపై మరొకరు సీబీఐకి ఫిర్యాదులు..!!

YSRCP: ఇద్దరు అధికార పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులు ఒకరిపై మరొకరు సీబీఐకి ఫిర్యాదులు చేసుకోవడం ఏపి రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు, ఆ పార్టీ నేతల పచ్చగడ్డి వేస్తే భగ్గు మనే పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. రఘురామ కృష్ణంరాజు పై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎంపీలు గతంలోనే స్పీకర్ ఓంబిర్లాకు ఫిర్యాదు చేసినా ఇంత వరకూ ఆయనపై చర్యలు తీసుకోలేదు. రఘురామకృష్ణం రాజు నిత్యం ప్రభుత్వ విధానాలను, సీఎం జగన్మోహనరెడ్డి చర్యలను విమర్శిస్తూనే ఉన్నారు.

YSRCP MPs letters to CBI Director
YSRCP MPs letters to CBI Director

Read More: MP Vijaya Sai: సీబీఐ డైరెక్టర్ ‌సుబోధ్ కుమార్ జైశ్వాల్ కు ఎంపి రఘురామపై ఫిర్యాదు..! మేటర్ ఏమిటంటే..?

YSRCP: రఘురామ కృష్ణంరాజుపై విజయసాయిరెడ్డి సీబీఐకి లేఖ

ఈ నేపథ్యంలో రీసెంట్ గా రఘురామ కృష్ణంరాజుపై రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సీబీఐకి లేఖ రాశారు. రఘురామ కృష్ణంరాజుకు చెందిన ఇండ్ భారత్ పవర్ ఇన్ ఫ్రా లిమిటెడ్ లో జరిగిన అక్రమాలపై త్వరితగతిన విచారణ చేపట్టాలని సీబీఐ డైరెక్టర్ సుభోద్ కుమార్ జైశ్వాల్ కు ఫిర్యాదు చేశారు. దీనికి కౌంటర్ గా రఘురామకృష్ణం రాజు కూడా విజయసాయి రెడ్డిపై సీబీఐ డైరెక్టర్ కు మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు విషయంపై ఫిర్యాదు చేస్తూ ఈ కేసులో విజయసాయిరెడ్డిని విచారించాలని కోరారు.

YSRCP: విజయసాయిరెడ్డిని విచారించాలి

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని సీబీఐ డైరెక్టర్ సుభోద్ కుమార్ జైశ్వాల్ కు లేఖ రాశారు రఘురామ కృష్ణంరాజు, మాజీ మంత్రి పరిటాల రవీంద్ర కేసులోని నిందితుల తరహాలోనే ఈ కేసులోనూ నిందితుల్ని అంతమొందించే కుట్ర జరుగుతోందని రఘురామ తన లేఖలో అనుమానాలు వ్యక్తం చేశారు. జైలులో, జైలు బయట ఉన్న నిందితులు, సాక్షులకు రక్షణ కల్పించాలని సీబీఐ డైరెక్టర్ ను కోరారు. ఈ కేసులో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని విచారించాలని రఘురామ సీబీఐకి రాసిన లేఖలో కోరారు. ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి.. వివేకా హత్యకు రూ.40 కోట్ల సుపారీ లావాదేవీలు జరిగినట్లు చెప్పడంతో పాటు పలువురు ప్రముఖుల పేర్లు కూడా వెల్లడించారని కావున వారికి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇలా ఒకరిపై మరొకరు సీబీఐకి ఫిర్యాదులు చేసుకోవడంతో ఈ అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.

Related posts

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

sharma somaraju

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

sharma somaraju

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

sharma somaraju

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను వ్యతిరేకించిన ఈడీ .. తీర్పు రిజర్వు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

sharma somaraju

Russia: భారత్ కు రష్యా మద్దతు .. పన్నూ కేసులో ఆమెరికా ఆరోపణలను తోసిపుచ్చిన రష్యా

sharma somaraju

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Indian Student Missing: అమెరికాలో మరో తెలుగు విద్యార్ధి అదృశ్యం .. ఆందోళనలో కుటుంబ సభ్యులు

sharma somaraju