MP Vijaya Sai: సీబీఐ డైరెక్టర్ ‌సుబోధ్ కుమార్ జైశ్వాల్ కు ఎంపి రఘురామపై ఫిర్యాదు..! మేటర్ ఏమిటంటే..?

Share

MP Vijaya Sai: వైసీపీకి, ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి రెబల్ ఎంపి రఘురామకృష్ణం రాజు కొరకని కొయ్యగా మారిన సంగతి తెలిసిందే. ఏపి ప్రభుత్వ విధానాలపై సీఎం జగన్మోహనరెడ్డిపై రఘురామ కృష్ణంరాజు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ కూడా తెలంగాణ హైకోర్టులో రఘురామ పిటిషన్ కూడా దాఖలు చేశారు. మరో పక్క రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలంటూ పలు మార్లు వైసీపీ ఎంపీలు స్పీకర్ ఓంబిర్లాకు ఫిర్యాదు చేశారు. అయితే స్పీకర్ ఆయనపై ఇంత వరకూ చర్యలు తీసుకోలేదు. వైసీపీ ఫిర్యాదుపై రఘురామకృష్ణం రాజు కు స్పీకర్ నోటీసు ఇచ్చారు. దానిపై రఘురామ రిప్లై ఇచ్చారు.

MP Vijaya Sai letter to CBI JD

MP Vijaya Sai: బీజేపీ అండదండలు ఉండటంతో

ఇటీవల ఈ వ్యవహారాన్ని ప్రివిలేజ్ కమిటీకి స్పీకర్ రిఫర్ చేశారు. అయితే రఘురామకు కేంద్రంలోని బీజేపీ అండదండలు ఉండటంతోనే ఆయనపై చర్యలు తీసుకోవడం లేదన్న మాట వినబడుతోంది. ఈ తరుణంలోనే తాను ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నానంటూ గత నెల రఘురామకృష్ణంరాజు ప్రకటించారు. తనపై అనర్హత వేటు వేయించలేము అని వైసీపీ పెద్దలు ఒప్పుకుంటే తక్షణమే రాజీనామా చేస్తానంటూ రఘురామ సవాల్ కూడా విసిరారు. వైసీపీ ప్రభుత్వాన్ని నిత్యం విమర్శిస్తున్న రఘురామ కృష్ణంరాజును ఇరుకున పెట్టేందుకు వైసీపీ శత విధాలుగా ప్రయత్నిస్తూనే ఉంది. ఈ తరుణంలోనే కొద్ది నెలల క్రితం ఏపీ సీఐడి ఆయనను రాజద్రోహం తదితర సెక్షన్ల కింద అరెస్టు చేసింది. ఆ తరువాత ఆయన బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే.

 

సీబీఐ డైరెక్టర్ సుభోధ్ కుమార్ జైస్వాల్ కు లేఖ

ఇప్పుడు విజయసాయి రెడ్డి తాజాగా రఘురామ కృష్ణంరాజుపై సీబీఐకి పిర్యాదు చేశారు. సీబీఐ డైరెక్టర్ సుభోధ్ కుమార్ జైస్వాల్ కు విజయసాయి రెడ్డి లేఖ రాశారు. రఘురామ కృష్ణంరాజుకు చెందిన ఇండ్ భారత్ పవర్ ఇన్ ఫ్రా లిమిటెడ్ లో జరిగిన అక్రమాలపై త్వరితగతిన విచారణ చేపట్టాలని లేఖలో విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అంతే కాకుండా రఘురామ కృష్ణంరాజు కంపెనీ దోచేసిన ప్రజల సొమ్మును రికవరీ చేయాలని కూడా విజయసాయి రెడ్డి కోరారు.


Share

Recent Posts

గుండెకు హత్తుకునే సినిమాలు చేయాలి అంటున్న బండ్ల గణేష్..!!

మహమ్మారి కరోనా వైరస్ వచ్చాక ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ వైరస్ దాటికి అనేక రంగాలు కుదేలు అయిపోయాయి. ముఖ్యంగా సినిమా రంగం…

30 mins ago

నేను గొర్రెల మంద టైప్ కాదు జబర్దస్త్ షోపై అనసూయ వైరల్ కామెంట్స్..!!

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…

1 hour ago

వరంగల్ “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో హీరో విజయ్ దేవరకొండపై పొగడ్తల వర్షం కురిపించిన పూరి..!!

ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…

2 hours ago

“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో మైక్ టైసన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన పూరి..!!

"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…

3 hours ago

హీరోయిన్ల‌కే అసూయ పుట్టిస్తున్న బ‌న్నీ స‌తీమ‌ణి.. లెటేస్ట్ పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

అల్లు వారి కోడ‌లు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌న్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…

4 hours ago

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం .. తెలుగు రాష్ట్రాల్లో ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్

దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు…

5 hours ago