NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Govt: గ్రామ పంచాయతీలకు మరో సారి బిగ్ షాక్ ఇచ్చిన జగన్ సర్కార్..??

AP Govt: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల ఖాతాల్లో నిధులు రాత్రికి రాత్రే మాయం అయి పోయాయి. గతంలో 14,15వ ఆర్ధిక సంఘం నిధులు రూ.7,660 కోట్లు విద్యుత్ బకాయిలకు తీసుకున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం నుండి విడుదల అయిన నిధులను గ్రామ పంచాయతీలకు తెలియకుండా ప్రభుత్వం తీసేసుకోవడంపై రాష్ట్ర వ్యాప్తంగా చాలా గ్రామాల సర్పంచ్ లు ఆందోళన చేశారు. ఈ విషయం కేంద్ర ప్రభుత్వం వరకూ వెళ్లడంతో కేంద్ర ప్రభుత్వ నిధుల కోసం ప్రత్యేకంగా పంచాయతీలు బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయాలని ఆదేశించింది. ఆ మేరకు అధికారులు కేంద్ర ప్రభుత్వ నిధుల కోసం ప్రత్యేకంగా అకౌంట్లు ఓపెన్ చేశారు.

AP Govt big shock to Grama panchayats
AP Govt big shock to Grama panchayats

AP Govt: సర్పంచ్ లు దిగ్భాంతి

అయితే ఇప్పుడు పంచాయతీల జనరల్ ఫండ్స్ కూడా జీరో బ్యాలెన్స్ చూపడంతో సర్పంచ్ లు దిగ్భాంతి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే జనరల్ ఫండ్స్ ను కూడా తీసేసుకుందని కొందరు సర్పంచ్ లు అనుమానం వ్యక్తం చేస్తుండగా, కార్యదర్శులు మాత్రం సాంకేతిక లోపం కారణం అయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇయర్ ఎండింగ్ కావడం వల్ల సాంకేతిక సమస్యతో బ్యాలెన్స్ జీరో చూపిస్తోందని, ఒకటి రెండు రోజుల్లో ఈ సమస్య పరిష్కారం అవుతుందని కొందరు కార్యదర్శులు ఆశాభావంతో ఉన్నారు.

 

రాష్ట్రంలోని 12,918 గ్రామ పంచాయతీల్లోని నిధులను రాష్ట్ర ప్రభుత్వం కాజేసిందని ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ ముందుగా ఆరోపించారు. గ్రామ పంచాయతీలకు చెప్పకుండా రాత్రికి రాత్రే నిధులు తీసుకున్నారని ఆయన మండిపడ్డారు. గతంలో 14,15 ఆర్ధిక సంఘం నిధులు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ జనరల్ ఫండ్స్ కూడా కాజేసిందని అన్నారు. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల సర్పంచ్ లు అందరూ పంచాయతీ ఖాతాలను చెక్ చేసుకోవాలని ఆయన సూచించారు.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju