NewsOrbit
ట్రెండింగ్

Akshay Kumar: గుట్కా యాడ్ విషయంలో దెబ్బకు దిగొచ్చిన అక్షయ్ కుమార్..!!

Akshay Kumar: బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరు అక్షయ్ కుమార్. ముగ్గురు ఖాన్ ల సినిమాలకి మంచి పోటీ ఇచ్చే హీరో. అన్ని రకాల సినిమాలు చేస్తూ తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న అక్షయ్ కుమార్…యాడ్ రంగంలో కూడా తిరుగులేని రికార్డు ఉంది. చాలా ప్రముఖ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ వచ్చారు. ఇదిలా ఉంటే ఇటీవల ఓ ప్రముఖ పొగాకు కంపెనీకి చెందిన గుట్కా యాడ్ చేయడం జరిగింది. ఈ యాడ్ లో అక్షయ్ కుమార్ తో పాటు అజయ్ దేవగన్, షారుక్ ఖాన్ కూడా నటించారు. ఈ క్రమంలో ఈ యాడ్ కి సంబంధించి అజయ్ దేవగన్, షారుక్ ఖాన్ లపై రాణి విమర్శలు అక్షయ్ కుమార్ పై రావడం సంచలనంగా మారింది. కారణం చూస్తే  2018 సంవత్సరంలో ఓ మీడియా సమావేశంలో అక్షయ్ మాట్లాడుతూ.. పొగాకు కంపెనీలకు సంబంధించిన వాళ్లు తన దగ్గరకు యాడ్ చేయాలని.. ప్రొడక్ట్ నీ ప్రమోట్ చేయాలని వచ్చారు.. భారీగా రెమ్యునరేషన్ ఆఫర్ చేశారు. కానీ  తిరస్కరించా.. అని మీడియా సమక్షంలో అప్పట్లో తెలియజేశారు. స్వచ్ఛభారత్ అనే ప్రభుత్వ కార్యక్రమానికి సంబంధించిన వీడియో సమావేశంలో అక్షయ్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేయడం మాత్రమే కాదు… గుట్కా యాడ్ చేసే హీరోలను అనుకరించ కూడదు అని కూడా తెలిపారు. Akshay Kumar apologises for endorsing an elaichi brand; 'With all humility, I step back' | Hindi Movie News - Times of India

కాగా గుట్కా..యాడ్ లని వ్యతిరేకిస్తూ గొప్పగా అప్పట్లో చెప్పినా అక్షయ్ కుమార్ నాలుగు సంవత్సరాల లోనే ప్రముఖ పొగాకు కంపెనీ “విమల్ ఎలైచి” తో చేతులు కలిపి ఇప్పుడు గూట్కా యాడ్ చేయటంతో సోషల్ మీడియాలో నెటిజన్ ల నుండి తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. పైగా పొగాకు కంపెనీలను ప్రమోట్ చేసే హీరోలుగా ముద్ర ఉన్న వారితోనే యాడ్ చేయటంతో అక్షయ్ కుమార్ సొంత అభిమానుల నుండి కూడా వ్యతిరేకత వచ్చింది. సోషల్ మీడియాలో గత కొద్దీ రోజుల నుండి భారీ ఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో తాజాగా బయట నుండి వస్తున్న ఒత్తిడికి వ్యతిరేకత.. దెబ్బకు అక్షయ్ కుమార్ అభిమానులకు, శ్రేయోభిలాషులకు క్షమాపణలు చెబుతూ.. లెటర్ రిలీజ్ చేశాడు.

Akshay Kumar steps back as Vimal ambassador after backlash, will donate ad fee - Hindustan Times

దయచేసి నన్ను క్షమించండి. ముఖ్యంగా నా అభిమానులు మరియు శ్రేయోభిలాషులకు క్షమాపణలు చెప్పాలని అనుకుంటున్నాను. పొగాకు కంపెనీ కి సంబంధించిన యాడ్ విషయంలో గత కొన్ని రోజులుగా మీ నుండి నాపై  వస్తున్న స్పందన తీవ్రంగా కలచివేసింది. అయితే ఇక్కడ నేను టొబాకో ప్రోడక్ట్ నీ సపోర్ట్ చేయటం లేదు. కేవలం యాడ్ వల్ల వచ్చిన డబ్బుతో ఒక విలువైన కారణానికి ఖర్చు పెట్టాలని నిర్ణయించుకున్నా. కానీ వస్తున్న వ్యతిరేకత బట్టి విమల్ ఏలైచి తో ఉన్న ఒప్పందం చట్టపరంగా.. కాంట్రాక్ట్ పరంగా కొనసాగించాలి. కానీ భవిష్యత్తులో మాత్రం.. ఇటువంటి విషయాలలో ఎంపిక చేయటంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను అని మీ అందరికీ మాట ఇస్తున్నాను. Akshay Kumar steps back as Vimal ambassador after backlash, will donate ad fee - Hindustan Times

ఇదే సమయంలో.. గతంలో చూపిన ప్రేమ మరియు అభిమానం మళ్లీ చూపాలని కోరుతున్నాను. చాలా వినయంతో అభ్యర్దిస్తున్నాను. మిమ్మల్ని బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి అంటూ అక్షయ్ కుమార్ క్షమాపణలు చెబుతూ అభిమానులకు లెటర్ రాయడం జరిగింది. దీంతో ఈ లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం విమల్ ఏలైచీ కంపెనీతో ఒప్పందం ప్రకారం.. యాడ్ ప్రసారమవుతుంది. అయితే ఇందుకుగాను వచ్చిన రెమ్యూనరేషన్ ఒక విలువైన కారణానికి అందించాలని నిర్ణయించుకున్నట్లు అక్షయ్ కుమార్ తెలియజేయడంతో.. సోషల్ మీడియాలో కొద్దిగా వాతావరణం చల్లబడింది.

Related posts

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N