NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Congress: కాంగ్రెసులో ఉడకని ప్రశాంత్ కిశోర్ పప్పులు!అంతా నా ఇష్టం అన్న వ్యూహకర్త!కుదరదు పొమ్మన్న అధినేత!

Congress : డిక్కీ బలిసిన కోడి చికెన్ షాపు ఎదుట కొచ్చి తొడగొట్టినట్టు,హేబిడ్డా.. ఇది నా అడ్డా అన్నట్లు వ్యవహరించిన కారణంగానే వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను శతాబ్దాల ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ తెలివిగా,మర్యాదపూర్వకంగా ఆదిలోనే
వదిలించుకుందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.2014 లో నరేంద్ర మోడీని,తదుపరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి,నితీశ్ కుమార్,మమతా బెనర్జీ తదితరులను గెలిపించిన ఘన చరిత్ర కలిగిన పి.కె కాంగ్రెస్ తోనే గేమ్స్ ఆడబోయి బొక్కబోర్లాపడ్డారని వారు చెబుతున్నారు.

 Congress : మై వే ఆర్ హైవే అన్న వ్యవహారశైలి!

కాకలుదీరిన మహా నేతలే కాంగ్రెస్ ను తమ దారిలోకి తెచ్చుకోలేకపోయారని,అలాంటిది ప్రశాంత్ కిశోర్ మై వే ఆర్ హైవే అన్నట్లు ప్రవర్తించి దెబ్బ తిన్నాడన్నారు.2024లో పార్టీ గెలుపు కోసం ప్రశాంత్ కిషోర్ ఒక రూట్ మ్యాప్ తయారు చేసి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి అందించారు.అయితే అందులోని ప్రధాన అంశాలు కొన్ని పార్టీ హైకమాండ్ కేకాక సీనియర్ నేతలకు కూడా నచ్చలేదు.

నడ్డా ఫార్ములాను ప్రతిపాదించిన పీకే!

ప్రస్తుతం భారతీయ జనతాపార్టీ ఏవిధంగానైతే నడ్డా ను అధ్యక్షుడిగా పెట్టుకొని నరేంద్ర మోడీ, అమిత్ షాలు సర్వాధికారాలు వెలగబెడుతున్న విధంగానే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నాన్ గాంధీని పెట్టి సోనియా, ప్రియాంక,రాహుల్ గాంధీలు తెరవెనుక నుండి చక్రం తిప్పాలని పీకే చేసిన ప్రతిపాదన ఎవ్వరికీ నచ్చలేదు.కాంగ్రెస్ అంటే గాంధీ లదే అయినప్పుడు వారు అధ్యక్షస్థానంలో లేకపోవటం సరికాదని అభ్యంతరాలు వెల్లువెత్తాయి.ఆ తర్వాత పీకే సరిదిద్దుకొని ప్రియాంక గాంధీ వైపు మొగ్గు చూపినప్పటికీ అప్పటికే డ్యామేజీ జరిగిపోయింది.

పీకే గొంతెమ్మ కోర్కెలు!

అదే గాక భవిష్యత్తులో ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ టిక్కెట్లు ఇచ్చే అధికారాన్ని పీకే కోరుకున్నారు.అంతకు మించి సోనియా గాంధీ వద్దకు తనకు నేరుగా ప్రవేశం ఉండాలని,మధ్యలో ఏ సీనియర్లు ఉండరాదని ప్రశాంత్ కిషోర్ షరతు పెట్టారు.కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఎన్నికల్లో కెసిఆర్, జగన్,మమతా బెనర్జీలతో ఎన్నికల పొత్తు పెట్టుకోవటం బెటర్ అని ఆయన సూచించారు.అంతేగాక తాను 2024 పార్లమెంట్ ఎన్నికలకు మాత్రమే వ్యూహకర్తగా పని చేస్తానని,ఈ మధ్యలో జరిగే ఎన్నికలతో తనకు సంబంధం లేదని ఆయన తేల్చిచెప్పారు.

కాంగ్రెస్ నేతలకు ఎక్కడో కాలింది!

పీకే ప్రతిపాదనలను, షరతులను కాంగ్రెస్ కోర్ టీం లోతుగా అధ్యయనం చేసింది.వాటన్నిటి బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకోవడానికి ప్రశాంత్ కిషోర్ పన్నాగం పన్నాడని వారో అభిప్రాయానికి వచ్చారు.అంతేగాక ఇప్పటికే తన పాత క్లయింట్స్ అయిన వివిధ రాష్ర్టాల సీఎంలకు కూడా లబ్ధిచేకూరే విధంగా ప్రశాంత్ వ్యవహరిస్తున్నారని వారికి అనుమానం కలిగింది.

దెబ్బేసింది తెలంగాణ కాంగ్రెస్ నేతలే!

ఇదిలా జరుగుతుండగానే పీకే తెలంగాణ సిఎం కెసిఆర్ ను కలుసుకొని 2023 ఈ ఎన్నికల వ్యూహ రచనపై చర్చలు జరిపారు.ఆయనకు చెందినదిగా భావిస్తున్న ఐప్యాక్ తో టీఆర్ఎస్ ఒప్పందం కూడా చేసుకుంది.ఈ విషయాన్ని తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు తమ అధిష్టానానికి చేరవేశారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కు పనిచేస్తూ తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా వ్యవహరించటం ఏమిటని తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేతలు అధిష్టానవర్గాన్ని అలర్ట్ చేశారు.ఐప్యాక్ తో తనకు సంబంధం లేదన్నట్టు ప్రశాంత్ కిషోర్ చెబుతున్నప్పటికీ అది ఆయన జేబు సంస్థే అన్నది అందరికీ తెలుసు.ఆ సంస్థ టీఆర్ఎస్ తో ఒప్పందం కుదుర్చుకోవడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా పరిగణించింది.

చివరాఖరకు ప్రశాంత్ కిషోర్ అవుట్!

ఇవన్నీ సోనియా గాంధీ దృష్టికి వెళ్లడంతో ఆమె తమ పార్టీ సీనియర్ నేతలతో ఈ విషయాలన్నీ చర్చించారు.వారంతా కూడా ప్రశాంత్ కిషోర్ వ్యవహారశైలిపై అభ్యంతరాలు తెలిపారు.కొన్ని రకాల అనుమానాలు వ్యక్తం చేశారు.దీంతో ప్రశాంత్ కిషోర్ ను పార్టీ సాధికారిత కమిటీలో ఉండవలసిందిగా సోనియాగాంధీ సూచించారు.అయితే కాంగ్రెసులో తాను ఆశించింది దక్కకపోవడంతో ప్రశాంత్ కిషోర్ ఆ పార్టీలో చేరడం లేదని తేల్చేశారు.ఇందుకు రకరకాల కారణాలు ఆయన చెప్పినప్పటికీ కాంగ్రెసులో ప్రశాంత్ కిశోర్ పప్పులు ఉడకలేదన్నది నిర్వివాదాంశం.

Related posts

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N