NewsOrbit
హెల్త్

Kids care: ఎదిగే పిల్లలకు ఏ ఆహారం ఎంత వరకు ఉపయోగకరం..!!

Kids care: పసిపిల్లలకు ఆకలి వస్తే ఏడవడం తప్పా వాళ్లకు ఏమి తెలియదు. అయితే పిల్లలు ఏడుస్తున్నారు కదా అని ఏది పడితే అది పెట్టి కడుపు నిండిపోయింది కదా అని అనుకుంటే పొరపాటు పడినట్లే. అయితే నిజానికి పిల్లలకు పెట్టే ఆహారంలో అన్ని పోషకాలు సమపాళ్లలో ఉండేలా చూసుకోవాలి. మరి ముఖ్యంగా ఎదిగే పిల్లల విషయంలో మరిన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి.పిల్లలు ఆరోగ్యంగా,దృడంగా ఎదగాలంటే వాళ్ళకి మంచి ఆరోగ్యకరమైన ఆహారం అందించాలి. అప్పుడే పిల్లలు శారీరకంగా,మానసికంగా కూడా ఎదుగుతారు.అయితే కొందరు పిల్లలు ఏది పడితే అది తనరు. అది తినను… ఇది తినను అని మారం చేస్తూ ఏడుస్తూ ఉంటారు.అయితే పిల్లల ఇష్టాన్ని గ్రహించి వారికి నచ్చిన ఆహారాన్ని పిల్లలకు బుజ్జగించి మరి తినిపించాలి. మరి ఎదిగే పిల్లలకు ఎలాంటి ఆహరం పెడితో మంచిదో అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..!!

How useful is any food for growing children .. !!
How useful is any food for growing children .. !!

పిల్లలకు ఎలాంటి ఆహారం పెట్టాలంటే..?

పిల్లల ఎదుగుదలలో పెరుగు ముఖ్య పాత్ర పోషిస్తుందనే చెప్పాలి. పెరుగులో ఎన్నో రకాల విటమిన్స్‌, కాల్షియం, ప్రొబయోటిక్స్‌, ప్రొటీన్స్‌ ఉంటాయి. పిల్లలు కూడా పెరుగును చాలా ఇష్టంగా తింటూ ఉంటారు.పెరుగు తింటే జీర్ణక్రియ ప్రక్రియ కూడా మెరుగుపడుతుంది.ఎముకలను, దంతాలను బలంగా చేస్తుంది. పెరుగు తినని పిల్లలకు మజ్జిగ రూపంలో అయినా తాగిస్తే ఆరోగ్యానికి మంచిది.

ఈ కాంబినేషన్ అంటే పిల్లలకు భలే ఇష్టం :

పప్పు, నెయ్యి కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వేడి వేడి అన్నంలో పప్పు, నెయ్యి వేసి పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి.పప్రోటీన్స్,విటమిన్స్‌, మినరల్స్‌, కార్బోహైడ్రేట్స్‌ అన్ని కూడా సమకులంగా లభిస్తాయి ఈ పప్పు అన్నంలో.పిల్లలకు ఎప్పటికప్పుడు సీజనల్ గా దొరికే పండ్లను పెడుతూ ఉండాలి.చక్కెర లేకుండా తాజా పండ్లను రసాల రూపంలోగాని, మిల్క్ షేక్ రూపంలోనూ పిల్లలకు అందిస్తే మంచిది. వీటిల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియంట్స్‌ పిల్లల ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడతాయి.

ఈ రకమైన ఆహారం మాత్రం. పిల్లలకు తప్పనిసరిగా ఇవ్వాలిసిందే:

ఈ వేసవి కాలంలో పిల్లలకు కొబ్బరి నీళ్లు పట్టడం చాలా మంచిది. కొబ్బరి నీళ్లలో ఎన్నో పోషకాలు ఉంటాయి.ఇవి శరీరాన్ని డీహైడ్రేట్‌ కాకుండా కాపాడుతాయి. అలాగే పిల్లలకు నిమ్మరసం కూడా తాగిస్తూ ఉంటే చాలా మంచిది. నిమ్మకాయలో ఉండే సి విటమిన్ వలన పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది..పిల్లలకు వివిధ రకాల కూరగాయలు, పండ్లుతో సూప్‌లు చేసి తాగిస్తూ ఉండాలి. పిల్లలకు నచ్చని ఆహారాన్ని పెట్టే బదులు వారు ఇష్టంగా తినే ఆహారాన్నే రోజులో కొద్ది కొద్దిగా పెడుతూ ఉంటే పిల్లల ఎదుగుదల బాగుంటుంది. పిల్లలు ఎదిగే వయసులో చాకెట్ల్స్, ఐస్ క్రీమ్స్, జంక్ ఫుడ్, స్టోరేజ్ ఫుడ్ లను ఎక్కువగా అలవాటు చేయకుండా ఉంటే మంచిది..

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri