NewsOrbit
సినిమా

Karthika Deepam: నిరూపమ్ ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందా…. హిమకు వేరే వాళ్ళతో పెళ్లి చేయనున్న సౌందర్య.!

Karthika Deepam:బుల్లితెర ప్రేక్షకులును ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగుతూ వెళ్తుంది. గత ఎపిసోడ్ లో నిరూపమ్, జ్వాలను కలిసి రెస్టారెంట్ కి వెళదాం రా అని అంటాడు. ఇక ప్రేమ్ ఏమో హిమకు తన ప్రేమ విషయం చెప్పాలి అని తనని కలుస్తాడు. ఈరోజు ఎపిసోడ్ హిమ, ప్రేమ్‌లతో మొదలవుతుంది. ఎలా చెప్పాలి అని ప్రేమ్ తనలో తాను అనుకుంటాడు.. బావ ఏం అడుగుతాడు అని హిమ తనలో తాను కంగారు పడుతుంది.సర్లే గాని హిమ నిరుపమ్‌తో ఎంగేజ్మెంట్ ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నావ్ అని ప్రేమ్ అడుగుతాడు.. బావ ఈ విషయాన్ని ఇంతటితోనే వదిలేద్దాం అని హిమ అంటుంది.అలా కాదు హిమ నీకు ఇష్టం లేకపోతే ముందే చెప్పాలి కదా అని ప్రశ్నల వర్షం కురిపిస్తాడు.ఇక హిమ బావ నీకు దండం పెడతాను.. ఇకపై ఈ విషయం గురించి నన్నేం అడగొద్దు అంటుంది.అలా అంటావేంటి హిమ అని ప్రేమ్ అంటే..ఇది నువ్వే అడుగుతున్నావా? లేదా మా నానమ్మ అడుగిస్తోందా అని హిమ వెళ్లిపోతుంది.

karthika deepam latest episode
karthika deepam latest episode

హిమ మనసులో తానే ఉన్నా అనుకుంటున్న ప్రేమ్ :

ఇక ప్రేమ్ మాత్రం హిమ నిరుపమ్‌ను వద్దంటే నన్ను కోరుకుంటోందా? ఒకవేళ అదే నిజమైతే.. ఆ విషయం నాతో చెప్పాలి కదా? హిమ నీ మనసులో ఏముందో నాకెలా తెలుస్తుంది అని ప్రేమ్ ఆలోచిస్తుంటాడు. ఇక తర్వాత సీన్ శోభా మీద సీన్ ఓపెన్ అవుతుంది.ఎవరో శాంతాభాయ్ అనే ఆమెకు. ఫోన్ చేసి ఉన్నపలంగా ఇళ్లు ఖాళీ చేసేయ్ అంటుంది శోభ.నేను ఒక ఏరియా చెబుతాను.. అక్కడ అద్దెకు దిగి నేనేం చెబుతానో అది చేయ్ అని శోభా అంటుంది. ఇప్పుడున్న ఇళ్లు బాగానే ఉంది కదా? ఎందుకు ఖాళీ చేయాలి అని శాంతా భాయ్ అడుగుతుంది.ప్రశ్నలు అడగకుండా చెప్పింది చెయ్ అని శోభా ఆర్డర్ వేస్తుంది.తరువాత మై డియర్ ఆటో జ్వాలా.. ఇప్పుడు నేను వేసే అడుగు నువ్ కల్లో కూడా అనుకోలేవు.. నిరుపమ్‌కి నీ మీద కోపం కాదు ద్వేషం కలిగేలా చేస్తాను అంటుంది.

karthika deepam latest episode
karthika deepam latest episode

హిమను రెచ్చగొట్టడానికి జ్వాలకు దగ్గర అవుతున్న నిరూపమ్ :

సీన్ కట్ చేస్తే హోటల్‌లో జ్వాల, నిరుపమ్‌లు ఉంటారు.ఎమన్నా తింటావా అని జ్వాలను అడిగితే వద్దులే తింగరి వచ్చాక చూద్దాం.. అని జ్వాల అంటుంది. ‘శౌర్య, బావ ఇంత క్లోజ్‌గా ఉన్న సమయంలో నేను వెళ్తే ఎలా.. నేను అసూయ పడుతున్నాను అని బావ అనుకుంటాడేమో నాకేం చేయాలో తోచడం లేదు అనుకుంటూనే రెస్టారెంట్ కి వెళ్తుంది..హిమ ముందు జ్వాలాతో క్లోజ్‌గా ఉంటే..కచ్చితంగా హిమకు కోపం వస్తుంది అని నిరుపమ్ జ్వాలతో క్లోజ్‌గా ఉంటాడు. వాళ్ళను చూసిన హిమ మీ ఇద్దరూ కలిశాక నన్నేందుకు రమ్మన్నారు అని కోపంగా అడుగుతుంది హిమ. ఇక ఆ మాటకు హిమకు అసూయ మొదలైందని నిరూపమ్ అనుకుంటాడు.సరే గాని ఏం తిందాం.. అని నిరుపమ్ అడిగితే.. మీరేం తింటే అదే తింటాను అని జ్వాల చెబుతుంది. ఐస్ క్రీం తిందామా?.. అని నిరుపమ్ అంటే నాకు ఐస్ క్రీం అంటే చాలా ఇష్టం మీకెలా తెలుసు అని జ్వాల అంటుంది. నీకేం కావాలి హిమ..అని నిరుపమ్ అంటాడు. ఐస్ క్రీం చల్లగా ఉంటుంది.. వేడిగా సూప్ తీసుకు రమ్మను..వేడి వేడిగా కాలిపోతుండాలి.. అని హిమ అంటుంది.

karthika deepam latest episode
karthika deepam latest episode

హిమకు నిజంగానే నిరూపమ్ మీద కోపం వస్తుందా..?

హిమ కోపంతో రగిలిపోతోన్నట్టుంది అని నిరుపమ్ అనుకుంటాడు. సారి శౌర్య మీ ఇద్దరూ కలవడానికి కోపం నటిస్తున్నాను నువ్ కోరుకున్నట్టు బావకు నీకు పెళ్లి జరిపించే పూచీ నాది అని అనుకుంటుంది హిమ మనసులో.జ్వాల నీ మాట తీరు నాకు ఇష్టం..అని నిరుపమ్ కావాలని పొగుడుతాడు. నన్ను ఉడికించాలని నువ్ శౌర్యను పొగుడుతున్నావా? బావ.. పాపం శౌర్యకు ఈ విషయం తెలియదు.. అని హిమ లోలోపల అనుకుంటుంది. జ్వాల ఇంకో విషయం.. నీ మనసులో ఏం దాచుకోవు.. ఏముంటే అదే చెబుతావ్.. కానీ ఏంటో కొందరు తమ మనసులో ఏమున్నా చెప్పరు.. అని పరోక్షంగా హిమ మీద నిరుపమ్ కౌంటర్లు వేస్తాడు.అలాంటి వాళ్లను నాకు చూపించండి నేను వాళ్లకు క్లాసులు చెబుతాను అని జ్వాల అంటుంది.ఇక నిరూపమ్ కాసేపటికి నేను వెళ్తాను అని అంటే అలా అని అనకూడదు వెళ్లొస్తాను అనాలి డాక్టర్ సాబ్ అని జ్వాల చెబుతుంది. అయినా చెప్పకుండా వెళ్లడాలు ఈ మధ్య చాలా మందికి అలవాటైంది.. అని నిరూపమ్. బాధతో అని వెళ్లిపోతాడు.

జ్వాల ప్రేమ విషయం నిరూపమ్ కు తెలుస్తుందా..?

ఇక జ్వాల నిరూపమ్. వెళ్ళిపోయాక చూశావా? తింగరి.. డాక్టర్ సాబ్ నాతో ఎంత క్లోజ్‌గా మాట్లాడుతున్నాడో అని జ్వాల తనలో తాను మురిసిపోతోంది. అయ్యో శౌర్య నీకెలా చెప్పాలి.. బావ నా మీద కోపాన్ని చూపిస్తున్నాడు. నీతో మాట్లాడేవన్నీ నిజం కాదు అని హిమ తన మనసులో అనుకుంటుంది. అయినాగాని డాక్టర్ సాబ్ మీదున్న ప్రేమను చెబుతానంటే ఎందుకు వద్దంటున్నావ్.. అని జ్వాల అడుగుతుంది. ఇంతలో నిరుపమ్ అక్కడకు రావడంతో జ్వాల, హిమ ఇద్దరు షాక్ అవుతారు.ఏంటి జ్వాలా ఏదో అంటున్నావ్ అని అని నిరుపమ్ అంటే…నేనేం అన్నాను.. ఉన్నదే అంటున్నాను అని జ్వాల కంగారు పడుతుంది.ఏమన్నవో నాకు వినపడలేదు లే.బిల్ నువ్ కడతావేమో అని నేను వచ్చాను అని జ్వాలకు బై చెప్పి అని నిరుపమ్ వెళ్లిపోతుంటాడు. సరే బై డాక్టర్ సాబ్ అని జ్వాల కూడా అంటుంది..హిమ మాత్రం జ్వాలతో నువ్ ఐ లవ్యూ చెప్పేది ఒ గొప్ప రోజులా ఉండాలి కదా? ఆ గొప్ప రోజు కూడా ఏదైనా స్పెషల్ డే ఉండేలా చూసుకోవాలి అప్పుడు చెప్పు నీ ప్రేమ విషయం అంటుంది.

హిమకు పెళ్లి చేసే ఆలోచనలో సౌందర్య, ఆనందరావు దంపతులు :

సీన్ కట్ చేస్తే జరిగిన విషయాలు తలుచుకుని ఆనంద్ రావు బాధ పడుతూ ఉంటాడు.హిమ పెళ్లితో అయినా ఈ ఇంట్లో సందడి వస్తుందని అనుకున్నా హిమ పెళ్లి వద్దంటూ మన పరువుతీసింది అని అంటాడు. నిరుపమ్‌ని ఓదార్చేందుకు ధైర్యం రావడం లేదు అనుకుంటారు ఇద్దరు..ఇంతలో హిమ వస్తుంది. రా హిమ రా…నీ పెళ్లి చేయాలని అనుకుంటున్నాం.. అని ఆనంద్ రావు అంటాడు. దానికి ఎందుకు చెప్తున్నారు మీరు.ఇక ఇప్పుడు మనం చూసిన సంబంధం చేసుకోవడం తప్పా మరో ఆప్షన్ లేదు. దాని పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు.. అని సౌందర్య అంటుంది.నానమ్మ ఈ పెళ్లి ఎందుకు వద్దన్నానో మీకు చెప్పలేను. చెబితే మీరు అర్థం చేసుకోలేరు.. శౌర్య కోసమే చేశాను అని తెలిసినప్పుడు ఆనంద పడతారు.. అని హిమ తనలో తాను అనుకుంటుంది. శౌర్య వస్తేనే పెళ్లి చేసుకుంటాను అనే మాట ఇప్పుడు కుదరదు అంటుంది సౌందర్య.నువ్వు పెళ్లి చేసుకోక తప్పదు అంటుంది. హిమ ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Related posts

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N