NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Viveka Murder Case: వివేకా హత్య కేసులో విచారణను మళ్లీ ప్రారంభించిన సీబీఐ

Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ మళ్లీ ప్రారంభమైంది. గత కొద్ది రోజులుగా సైలెంట్ అయిపోయిన సీబీఐ అధికారులు మళ్లీ విచారణను ప్రారంబించారు. సీబీఐ అధికారులపైనే ఆరోపణలు చేయడం, అధికారిపై కేసు నమోదు చేయడం, సీబీఐ అధికారుల కారు డ్రైవర్ ను బెదిరించడం వంటి సంఘటనల నేపథ్యంలో గత కొంత కాలంగా సీబీఐ విచారణ నిలిచిపోయింది. తాజాగా పులివెందుల ఆర్ అండ్ బీ అతిధి గృహంలో అనుమానితులను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

CBI Investigation Viveka Murder Case
CBI Investigation Viveka Murder Case

Viveka Murder Case: ఇనయతుల్లాను ప్రశ్నిస్తున్న సీబీఐ

వివేకా ఇంట్లో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేసిన ఇనయతుల్లాను అధికారులు విచారణ చేస్తున్నారు. ఇంతకు ముందు కూడా ఇనయతుల్లాను సీబీఐ అధికారులు పలు మార్లు విచారించారు. వివేకా హత్య జరిగిన రోజు ఆయన బెడ్ రూమ్ తో పాటు, బాత్ రూమ్ లో పడి ఉన్న మృతదేహాన్ని ఇనయతుల్లానే తన సెల్ ఫోన్ ద్వారా ఫోటోలు, వీడియోలు తీశారు. ఇనయతుల్లా నుండి కీలక సమాచారాన్ని రాబట్టేందుకు సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

 

మరో పక్క వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన డ్రైవర్ దస్తగిరి..వైసీపీ నేతలపై ఆరోపణలు చేస్తున్నాడు. కేసులో అప్రూవర్ గా మారినందున తనను అంతం చేయడానికి పులివెందులకు చెందిన వైసీపీ నాయకులు కుట్ర చేస్తున్నారని దస్తగిరి ఆరోపించారు. తాండూరు మండలానికి చెందిన పెద్ద గోపాల్ అనే వ్యక్తి గత కొద్ది రోజుల నుండి తనతో, తన కుటుంబ సభ్యులతో గొడవ పడుతూ రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పారు.

తన సోదరుడు మస్తాన్ తో గొడవ పడి తనను ఇష్టానుసారంగా తిట్టడంతో పోలీస్ స్టేషన్ కు వెళ్లాననీ, పోలీసుల ఎదురుగానే తనను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటంతో తాను అతనిపై చేయి చేసుకున్నానని దస్తగిరి తెలిపారు. దీన్ని కారణంగా చూపి పోలీసులు తనపై కేసు నమోదు చేశారన్నారు. తనపై జరుగుతున్న కుట్ర విషయాలను సీబీఐ అధికారి రాంసింగ్ దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు దస్తగిరి. తన ప్రాణాలకు ఏదైనా హాని జరిగితే వైసీపీ నేతలదే బాధ్యత అని దస్తగిరి అంటున్నాడు

Related posts

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri