NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

YSRCP: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధి ద్రౌపది ముర్ముకే వైసీపీ మద్దతు .. ఇదీ ప్రూఫ్..

YSRCP: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్టీఏ అభ్యర్ధి గెలుపునకు తటస్థంగా ఉన్న వైసీపీ, బీజూ జనతాదళ్ (బీజేడీ) పార్టీలే కీలకమన్న సంగతి తెలిసిందే. ఈ రెండు పార్టీల మద్దతు ఇస్తే ఎన్డీఏ అభ్యర్ధి గెలుపు ఖాయం. నిన్న మొన్నటి వరకూ రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ స్టాండ్ ఏమిటి.. కేంద్రంలోని బీజేపీకి మద్దతు ఇస్తుందా లేదా అన్నది క్లారిటీ లేదు. పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి నిర్ణయం తీసుకుంటారని ఆ పార్టీ ఎంపీలు పేర్కొంటూ వచ్చారు. అయితే నిన్న అధికార ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధిగా మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము పేరును బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

YSRCP support decided in presidential poll
YSRCP support decided in presidential poll

YSRCP: ద్రౌపది ముర్మును కలిసి అభినందనలు తెలిపిన విజయసాయి

ఒడిషాకు ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రకటించడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ హర్షం వ్యక్తం చేశారు. దీంతో రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేడీ స్టాండ్ స్పష్టం అయ్యింది. స్వరాష్ట్రానికి చెందిన ద్రౌపది ముర్ము ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ది కావడంతో బీజేడీ మద్దతు ఖాయమైంది. ఇదే క్రమంలో ఏపీలోని వైసీపీ మద్దతుపైనా ఒక క్లారిటీ వచ్చేసింది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి నేడు ద్రౌపది ముర్మను కలిసి అభినందనలు తెలియజేశారు. వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశాలతోనే విజయసాయి రెడ్డి ఆమెను కలిసి ఉంటారు. సో..బీజేపీ ప్రకటించిన ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధికి వైసీపీ మద్దతు ఖాయమైనట్లు దీన్ని బట్టి అర్ధం అవుతోంది. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధిత్వం విషయంలో చత్తీస్‌ఘడ్ గవర్నర్ అనసూయ ఉయికీ పేరును బీజేపీ పరిశీలిస్తున్న సమయంలో మూడు రోజుల క్రితం విజయసాయిరెడ్డి చత్తీస్‌ఘడ్ వెళ్లి రాజ్‌భవన్ లో ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి జ్ఞాపికను అందజేసి వచ్చారు. దాంతోనే ఎన్డీఏ అభ్యర్ధికి వైసీపీ మద్దతు అని ఒక క్లారిటీ వచ్చేసినట్లు అయ్యింది.

YSRCP: వైసీపీ ఓటు విలువ 45,957

అయితే బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీలో మొత్తం 20 మంది పేర్లపై చర్చలు జరిపిన తరువాత తొలి సారిగా గిరిజన మహిళకు అవకాశం ఇవ్వాలని భావించి ద్రౌపది ముర్ము పేరును ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి.. ద్రౌపది ముర్మును కలిసి జ్ఞాపికను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీకి 22 మంది ఎంపీలు, 9 మంది రాజ్యసభ సభ్యులు, 151 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రాష్ట్రపతి ఎన్నికలకు రాష్ట్రం నుండి మొత్తం 53,513 ఓట్ల విలువ ఉండగా, వైసీపీకి ఉన్న సంఖ్యాబలం కారణంగా 45,957 ఓట్ల బలం ఉంది.

 

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju