NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తుపై సుప్రీం లో విచారణ .. సీబీఐ, ఏపి సర్కార్ కు నోటీసులు

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (వివేకా) దారుణ హత్య జరిగి మూడేళ్లు అయ్యింది. హైకోర్టు ఆదేశాలతో సీబీఐ దర్యాప్తు బాధ్యతలు నిర్వహిస్తున్నా పూర్తి స్థాయిలో నిందితుల అరెస్టు జరగలేదు. హత్యలో నేరుగా భాగస్వాములైన వారిని అరెస్టు చేసినట్లుగా సీబీఐ పేర్కొంటున్నా వివేకా హత్య కేసులో కుట్రదారులను అరెస్టు చేయలేదు. దర్యాప్తులో ప్రగతి లోపించిన నేపథ్యంలో వివేకా కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వివేకా హత్య కేసు విచారణ ను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్ పై సోమవారం సుప్రీం కోర్టు విచారణ జరిపింది. సీబీఐ అధికారుల విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదనీ, సాక్షులను బెదిరిస్తున్నారంటూ సునీతా రెడ్డి గతంలోనే సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తదుపరి విచారణ .. ఏపి హైకోర్టు పరిధిలో కాకుండా, తెలంగాణ హైకోర్టు పరిదిలో జరపాలని ఆమె కోరారు.

YS Viveka Murder Case

 

ఈ పిటిషన్ పై జస్టిస్ ఎమ్మార్ షా, జస్టిస్ కృష్ణ మురారిల నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం నేడు విచారణ జరపగా, సునీతారెడ్డి తరపున న్యాయవాది సిద్ధార్ధ లూత్రా వాదనలు వినిపించారు. వివేకా హత్య కేసు విచారణ ఎలాంటి పురోగతికి నోచుకోని పరిస్థితి ఏర్పడిందని కోర్టుకు వివరించారు. విచారణకు తోడ్పాటు అందించాలని ఏపి హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటిక దిగువ స్థాయి పోలీసులు యంత్రాంగం కానీ, ప్రభుత్వ అధికార వర్గాలు కానీ సహకరించడం లేదని తెలిపారు. నిందితులు ఒక్కొక్కరు బెయిల్ పై బయటకు వస్తూ సాక్షులను బెదిరిస్తున్నారని వివరించారు. పిటిషనర్ తరపు వాదనలు విన్న ధర్మాసనం .. సీబీఐకి, ఏపి సర్కార్ కు నోటీసులు జారీ చేసింది. కేసుకు సంబంధించి వివరాలు తెలియజేయాలని నోటీసులో ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 14వ తేదీకి వాయిదా వేసింది.

వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం ..! సుప్రీం కోర్టును ఆశ్రయించిన సీబీఐ ..ఎందుకంటే..?

Related posts

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?