NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

పవన్ కళ్యాణ్ కు మంత్రి ఆర్కే రోజా సవాల్ .. పవన్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్

రాబోయే ఎన్నికల్లో వైసీపీకి వచ్చే సీట్లు ఇన్నే అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేయడంపై ఏపి పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా స్పందించి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యేగా గెలవలేని పవన్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. సినిమా పిచ్చి ఉన్న వాళ్లే పవన్ మీటింగ్ లకు వస్తున్నారని అన్నారు. సింగిల్ గా పోటీ చేసే దమ్ము పవన్ కు లేదని విమర్శించారు. పవన్ కు రాష్ట్రంలోని 175 స్థానాల్లో పోటీ చేసే దమ్మే లేదని అన్నారు. అన్ని స్థానాల్లో నిలబెట్టేందుకు అభ్యర్ధులే జనసేనకు లేరు కానీ అసెంబ్లీలో జెండా ఎగురవేస్తారంట అంటూ ఎద్దేవా చేశారు. ముందు సర్పంచ్ గా గెలవండి, ఆ తర్వాత ఎమ్మెల్యే గురించి ఆలోచించాలని హితవు పలికారు. పవన్ సర్వే చూస్తే నవ్వు వస్తుందని ఆమె అన్నారు.

AP Minister RK Roja

 

తెలుగు సినిమా పరిశ్రమ కూడా పవన్ ను చూసి నవ్వుకుంటుందని చెప్పారు. రాష్ట్రాన్ని నాశనం చేసింది పవన్, చంద్రబాబు కాదా అని రోజా ప్రశ్నించారు. పవన్ పార్టీ పెట్టింది ప్రజల కోసం కాదనీ, చంద్రబాబు కోసమని రోజా విమర్శించారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ను వదిలివేసి పారిపోయి వచ్చిన చంద్రబాబును పవన్ ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు. పవన్ డైలాగులు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. విభజన చట్టంలో ఏపి ఆస్తులపై పవన్ ఎందుకు మాట్లాడటం లేదని రోజా ప్రశ్నించారు. ప్యాకేజీలు తీసుకుని వేరే పార్టీకి ఓటు వేయమని చెబుతున్నారని విమర్శించారు. ఎన్టీఆర్, చిరంజీవి పార్టీ పెట్టి సింగిల్ గా పోటీ చేస్తే , పవన్ మాత్రం 2014 లో ప్యాకేజీ కి ఆశపడ్డారని ఆరోపించారు. ప్యాకేజీ కోసమే పవన్ విమర్శలు చేస్తున్నారని అన్నారు.

ఏపి ప్రజలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి మద్దతుగా ఉన్నారనీ, అందుకు స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే ఉదాహరణ అని పేర్కొన్నారు. లోకేష్ తన అజ్ఞానాన్ని మరో సారి ఈ రోజు కూడా బయట పెట్టుకున్నారని అన్నారు. రైతు వ్యతిరేకి చంద్రబాబు కాదా అని రోజా విమర్శించారు. రైతుల కోసం ఏమి చేశారన్నది లోకేష్ చంద్రబాబును అడగాలన్నారు. జగన్ రైతులకు అన్ని రకాలుగా అండగా నిలుస్తున్నారని రోజా తెలిపారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు రైతులకు చేసింది శూన్యమని అన్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా కరవు వస్తుందని అదే జగన్ అధికారంలో ఉన్న ప్రతి ఏడాది వర్షాలు సమృద్దిగా కురుస్తాయని అన్నారు మంత్రి రోజా.

వైసీపీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు .. బస్సు యాత్ర వాయిదా .. ఎందుకంటే..?

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N