NewsOrbit
జాతీయం న్యూస్

అబార్షన్ల విషయంలో సుప్రీం కోర్టు సంచలన తీర్పు

అబార్షన్ల అంశంపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పెళ్లి కాని యువతులు కూడా అబార్షన్లు చేయించుకోవచ్చని తెలిపింది. చట్టపరంగా మహిళలందరికీ సురక్షితంగా అబార్షన్ చేయించుకునే హక్కు ఉందని స్పష్టం చేస్తూ.. ఇందులో వివాహితులు, అవివాహితులు అనే తేడా చూపించడం రాజ్యాంగ విరుద్దమని పేర్కొంది. భర్త బలవంతం చేసినా అత్యాచారం కిందకే వస్తుందనీ, వైవాహిక అత్యాాచారంగా దానిని పేర్కొనాల్సి ఉంటుందని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. వివాహం కాలేదన్న పేరుతో అబార్షన్ ను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని పేర్కొంది. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) కి సంబంధించిన ఓ కేసు విచారణలో భాగంగా జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఎంటీపీ చట్ట ప్రకారం అవివాహిత మహిళ కూడా అబార్షన్ చేయించుకోవచ్చని తెలిపింది. అవాంఛిత గర్బాన్ని తొలగించే హక్కు మహిళలకు ఉందని పేర్కొంది.

supreme court

 

ఎంటీపీ చట్టం నిబంధనల ప్రకారం పెళ్లయినా, కాకపోయినా గర్భం దాల్చిన 24 వారాల వరకూ అబార్షన్ చేయించుకునే హక్కు మహిళలకు ఉందని తెలిపింది. ఈ విషయంలో వివాహితులు, అవివాహితులు అన్న వివక్ష చూపించడం నేరమని, రాజ్యాంగం ఎదుట అది నిలువజాలదని స్పష్టం చేసింది. పెళ్లి అయిన వారికి 24 వారాల లోపు అబార్షన్ కు అనుమతిస్తూ అవివాహితులను అనుమతించకపోవడం సరికాదని చెప్పింది. ప్రస్తుతం కాలం మారింది, చట్టం స్థిరంగా ఉండకూడదు, సామాజిక వాస్తవాలకు అనుగుణంగా నిబంధనలు మారుతుంటాయని కోర్టు స్పష్టం చేసింది.

Related posts

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju