NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఇప్పుడూ చెబుతున్నా విశాఖలో ఒకే ఫ్లాట్ ఉంది .. రామోజీ రాతలపై విజయసాయిరెడ్డి ఫైర్

టీడీపీ, దాని అనుకూల మీడియాపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్రంగా ఫైర్ అయ్యారు. విశాఖకు పరిపాలనా రాజధాని రాకూడదని కొందరు కుట్రలు చేస్తున్నారనీ, ఆ క్రమంలోనే ఈనాడు సహా ఆ కుల మీడియాలో తప్పుడు, అవాస్థవ కథనాలు ప్రచురిస్తున్నాయని మండిపడ్డారు. మంగళవారం విశాఖలో మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డి ఇటీవల ఈనాడులో వచ్చిన కథనాలపై తీవ్ర స్థాయిలో స్పందించారు. రామో(జీ) అన్నమే తింటున్నారా అని ప్రశ్నించారు. గతంలో చెప్పాను, ఇప్పుడు చెబుతున్నా విశాఖ సీతమ్మధారలో తనకు ఒక ప్లాట్ మాత్రమే ఉందని అన్నారు. కుమార్తె, అల్లుడు సంస్థలు కొనుగోలు చేసిన ఆస్తులు తనకు ఎలా ఆపాదిస్తారని ప్రశ్నించారు. తన అల్లుడుకు చెందిన ఫార్మకంపెనీలో దేశంలోనే టాప్ ఫై లో ఉందనీ, వారికి నూరు దేశాల్లో ఆఫీసులు ఉన్నాయన్నారు. భాగస్వాములను ముంచి పైకి వచ్చిన ఫ్యామిలీ వాళ్లది కాదనీ, అనేక వ్యాపారాలను నిర్వహిస్తున్నారని చెప్పారు. వివాహం అయిన కుమార్తె ఆస్తులు తండ్రికి సంబంధం ఉండదు అన్న కనీస పరిజ్ఞానం కూడా లేకుండా రాతలు రాస్తున్నారంటే ఏమనాలని అన్నారు.

 

Vijaya sai Reddy

 

ఉత్తరాంధ్రకు పరిపాలనా రాజధాని రాకూడదు అన్న కుట్రతోనే చంద్రబాబు, ఆయన కులమీడియా విషం చిమ్ముతుందని విమర్శించారు. విశాఖలో భూములు కుంభకోణం అంటూ పతాక శీర్ధికల్లో తెలుగు దేశం పార్టీ కుల పత్రికలు, ఛానళ్లు ప్రసారం చేశాయని దుయ్యబట్టారు. ఇప్పటికే దసపల్లా భూములకు సంబంధించి ప్లాట్ ల యజమానులు, బిల్డర్ లు వివరణ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. సుప్రీం కోర్టు కూడా ఈ భూములు ప్రైవేటు వ్యక్తులకు చెందినవేనని చెప్పిందనీ, కోర్టు ఆదేశాలనే ప్రభుత్వం అమలు చేసిందని తెలిపారు. ప్రభుత్వం చర్యలతో 400 కుుటుంబాలు లబ్దిపొందాయన్నారు. అక్కడ ఇళ్లు కట్టుకుని ఉన్నవారికి ప్రయోజనం చేకూరిందని తెలిపారు. 64 మంది ప్లాట్ల ఓనర్లలో 54 మంది ఒక సామాజిక వర్గానికి చెందిన వారని అన్నారు.

ఉత్తరాంధ్రలో కాపులు, యాదవ, ఇతర బీసీ వర్గాలు ఎక్కువగా ఉంటే విశాఖలో ఆస్తులు మాత్రం 75 శాతంపైగా చంద్రబాబు సామాజికవర్గం వారివేనని పేర్కొన్నారు. తాను ఆస్తులపై సీబీఐ, ఈడీ విచారణకు సిద్దమనీ, రామోజీ, చంద్రబాబు సిద్దమేనా అని ప్రశ్నించారు విజయసాయిరెడ్డి. విచారణ జరిగితే ఎవరు జైలుకు వెళతారో తెలుస్తుందని అన్నారు. మీడియా రంగంలోకి తాను వస్తున్నా, చూసుకుందాం అంటూ రామోజీకి సవాల్ విసిరారు విజయసాయిరెడ్డి.

Breaking: సుప్రీం కోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్

Related posts

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju