Victory Venkatesh: ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడి తనయుడు విక్టరీ వెంకటేష్ టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా అడుగు పెట్టాడు. ఒకప్పుడు స్టార్ హీరోల డేట్స్ దొరకకపోవడంతో రామానాయుడు ఎవరి డేట్స్ కోసం ఎదురు చూడటం ఎందుకని తన కొడుకునే హీరోగా సినిమాల్లో నటింప జేయాలనుకున్నాడు. అందుకే వెంకటేష్ ని హీరోగా తీసుకొని చాలా సినిమాలు చేశాడు. హీరోగా ఎంట్రీ ఇచ్చిన వెంకీ అద్భుతమైన నటనతో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఎప్పటికీ వయసుకు తగ్గ సినిమాల్లో నటిస్తూ సాటి స్టార్ హీరోలకు పోటీగా నిలుస్తున్నాడు.
Victory Venkatesh: ఫ్యామిలీ హీరో
వెంకటేష్ ఎక్కువగా ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలలో నటించాడు. వరుసగా ఫ్యామిలీ సినిమాల్లో నటిస్తూ వెంకటేష్ ఫ్యామిలీ హీరో అయిపోయాడు. అలా అని కేవలం ఫ్యామిలీ సినిమాలోనే నటించకుండా అన్ని రకాల పాత్రలలో నటించి ఈ హీరో అభిమానులను మెప్పించాడు. ప్రస్తుతం వెంకీ ‘నారప్ప’, ఎఫ్ 3 సినిమా హిట్లతో ఖుషిగా ఉన్నాడు. వెంకటేష్ సినిమాలతో పాటు టీవీ యాడ్స్‌లో కూడా నటిస్తూ భారీ మొత్తాన్ని తన ఖాతాలో వేసుకుంటున్నాడు.
ఆస్తి ఎంత అంటే
కాగా వెంకటేష్‌కి ఆస్తి ఎంత ఉందో తెలుసుకోవాలని కోరిక అభిమానులతో సినీ ప్రేక్షకులలో ఎక్కువగానే ఉంది. కాగా ఒక విశ్వసనీయ వర్గాల వెంకటేష్ సంపాదించిన ఆస్తులతో పాటు అతని తండ్రి రామానాయుడు సంపాదించిన ఆస్తులు కూడా వెంకటేష్‌కి వచ్చాయట. వెంకటేష్ అతని యంగ్ ఏజ్ నుండే హీరోగా నటిస్తున్నాడు. కాబట్టి అప్పటినుండి ఇప్పటివరకు చూసుకుంటే అతను కేవలం సినిమాల ద్వారానే రూ.2000 కోట్లు వరకూ సంపాదించాడట. ఇక రామానాయుడుకి సంబంధించి ఆస్తులు కొన్ని చెన్నైలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే అవి వెంకటేష్, సురేష్ బాబు పంచుకోలేదట.