NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Munugode Results: కొనసాగుతున్న మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు .. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీఆర్ఎస్ ఆధిక్యత

munugode Bypoll

Munugode Results:  ప్రధాన రాజకీయ పక్షాలు అన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మునుగోడు ఉప ఎన్నికల ఫలితం మరి కొద్ది గంటల్లో తేలనుంది. నల్లగొండ జిల్లా కేంద్రంలోని అర్జాల బావి వద్ద గోడౌన్ లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. పరిశీలకులు, ఏజంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ ను తెరిచి ఈవిఎంలను బయటకు తీసుకువచ్చారు. కౌంటింగ్ ప్రక్రియకు 21 టేబుళ్లు ఏర్పాటు చేశారు.

munugode Bypoll
munugode Bypoll

మొత్తం 15 రౌండ్ లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. 1,2,3 రౌండ్ లలో చౌటుప్పల్ మండల ఓట్ల లెక్కింపు జరుగుుతంది. 4,5,6 రౌండ్ లలో సంస్థాన్ నారాయణపురం మండల ఓట్లు, 7,8 రౌండ్ లలో మునుగోడు మండల ఓట్ల లెక్కింపు, 9,10 రౌండ్ లలో చండూరు మండల ఓట్లు లెక్కింపు ఫలితం వెలువడుతుంది. 11 నుండి 15 రౌండ్ లలో మర్రిగుడ, నారపల్లి, గట్టుప్పల్ మండలాల ఓట్ల లెక్కింపు ఫలితం వెలువడనుంది. తొలుత 686 పోస్టల్ బ్యాలెట్లను లెక్కించగా టీఆర్ఎస్ అధికత్యత సాధించింది. టీఆర్ఎస్ కు 228 ఓట్లు రాగా , బీజేపీ అభ్యర్ధికి 224 ఓట్లు,బీఎస్ పికి పది ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్ కు నాలుగు ఓట్ల ఆధిక్యత లభించింది.

టీఆర్ఎస్ అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకరరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి రెడ్డి, బీజేపీ అభ్యర్ధిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహా ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్ధులు మొత్తం 47 మంది ఎన్నికల బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నెల 3వ తేదీన పోలింగ్ జరిగింది. మొత్తం 2,41,805 మంది ఓటర్లకు గానూ 2,25,192 మంది (93.13శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారు.

 

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju