NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపిలోని ప్రతి జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా రైతులకు మేలు – సీఎం జగన్

రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయడం ద్వారా ఓ వైపు రైతులు మేలు జరగడమే కాక దాదాపు 33వేలకుపైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి తెలిపారు. పల్నాడు జిల్లాలోని వంకాయలపాడు లో రూ.200 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఐటీసీ గ్లోబల్ స్పెసెస్ యూనిట్ ను శుక్రవారం సీఎం జగన్ ప్రారంభించారు.

AP CM YS Jagan

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ .. ప్రతి ఏటా ఈ యూనిట్ లో 20 మెట్రిక్ టన్నుల మిర్చి, సుగంధ ద్రవ్యాల ప్రాసెస్ జరుగుతుందన్నారు. ఈ యూనిట్ వల్ల వేల మంది రైతులకు మేలు జరుగుతుందన్నారు. గ్లోబల్ స్పైసెస్ యూనిట్ ద్వారా 1500 మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నామని చెప్పారు. రెండవ దశ పూర్తి అయితే అతి పెద్ద స్పైసెస్ ప్రాసెసింగ్ యూనిట్ మన దగ్గరే ఉంటుందన్నారు. 24 నెలల్లో ఈ యూనిట్ ను పూర్తి చేశారని చెప్పారు. ఈ సందర్భంగా ఐటీసీ సంస్థకు అభినందనలు తెలియజేశారు. మున్ముందు రాష్ట్రానికి మరిన్ని స్పెసిస్ కంపెనీలు రావాలని ఆశిస్తున్నామన్నారు.

AP CM YS Jagan

 

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మూడేళ్లుగా దేశంలోనే ఏపి నెంబర్ వన్ స్థానంలో ఉందని సీఎం పేర్కొన్నారు. రూ.3450 కోట్లతో ప్రతి జిల్లాలోనూ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయబోతున్నామని, ఈ యూనిట్ల ద్వారా 33వేల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. మొదటి దశ కింద రూ.1250 కోట్లతో పది యూనిట్లకు డిసెంబర్, జనవరి నెలల్లో శంకుస్థాపన చేస్తామని తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు రైతులకు వరంగా మారనున్నాయని అన్నారు. వీటి వల్ల రైతుల పంటకు గిట్టుబాటు దక్కుతుందని తెలిపారు. అనంతరం సీఎం జగన్ గుంటూరు జిల్లా వైద్య కళాశాలకు చేరుకుని అక్కడ ప్లాటినం జూబ్లీ పైలాన్ ను ఆవిష్కరించారు.

Breaking: ఎన్ కౌంటర్ లో జేఈఎం ఉగ్రవాది హతం

Related posts

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N