NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila: వైఎస్ షర్మిల ఆమరణ దీక్ష భగ్నం .. అర్దరాత్రి బలవంతంగా అపోలో ఆసుపత్రికి తరలించిన పోలీసులు

YS Sharmila:  వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. షర్మిల ఆరోగ్యం క్షీణించడంతో అర్దరాత్రి ఆమెను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని జూబ్లిహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు. తన పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్ షర్మిల రెండు రోజులుగా లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో ఆమరణ దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. షర్మిల దీక్షకు ఆమె తల్లి వైఎస్ విజయమ్మ మద్దతు తెలియజేస్తూ సంఘీభావంగా దీక్షలో కూర్చున్నారు. నిన్న ఉదయం, సాయంత్రం అపోలో ఆసుపత్రి వైద్యులు దీక్షా శిబిరానికి చేరుకుని షర్మిల ఆరోగ్య పరిస్థితిపై పరీక్షలు జరిపారు. తక్షణం ఆసుపత్రిలో చేర్పించి వైద్య సేవలు అందించకపోతే డిహైడ్రేషన్ ప్రభావం కిడ్నీలపై పడుతుందని హెచ్చరించారు.

YSRTP Chief YS Sharmila Hunger Strike broken by Police

 

తన పాదయాత్రకు అనుమతి ఇచ్చే వరకూ దీక్ష కొనసాగిస్తానని షర్మిల తేగేసి చెప్పారు. పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చినా ప్రభుత్వం మాత్రం అనుమతి ఇవ్వడం లేదని మండిపడ్డారు. శుక్రవారం తమ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు శనివారం కూడా విడుదల చేయలేదనీ, పాత కేసులను తవ్వి రిమాండ్ కు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. తమ పార్టీ కార్యాలయం చుట్టూ ఏర్పాటు చేసిన కర్ఫ్యూని ఎత్తివేసి, తమ పార్టీ కార్యకర్తలను విడుదల చేసే వరకూ దీక్ష విరమించేది లేదని షర్మిల దీక్ష భగ్నంకు ముందు తెలిపారు.

కాగా షర్మిల ఆరోగ్య పరిస్థితి విషమించడంతో పోలీసులు అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో అక్కడకు చేరుకుని అదుపులోకి తీసుకుని అపోలో ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు సెలైన్ బాటిల్ పెట్టి వైద్య సేవలు అందిస్తున్నారు. లోటస్ పాండ్ సమీపంలో బారికేడ్లు ఏర్పాటు భారీగా పోలీసులు మోహరించారు.

Related posts

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju