NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: ఆ ఎమ్మెల్యేలకు మరో సారి తలంటిన సీఎం వైఎస్ జగన్ .. గడపగడపకు కార్యక్రమంలో కాస్త సీరియస్ గా.. అభ్యర్ధిత్వాలు ఖరారు ఎప్పుడంటే..?

YS Jagan:  ఏపి ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి శుక్రవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై వర్క్ షాప్ నిర్వహించారు. ఈ వర్క్ షాప్ లో ఎమ్మెల్యేలు, వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షుడు, రీజనల్ కో ఆర్డినేటర్ లు హజరైయ్యారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన సంక్షేమ పథకాల పట్ల ప్రతి ఇంటికీ జరిగిన మేలును వివరించడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశాల మేరకు ఈ ఏడాది మే 11న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించారు.

YS JAGAN

 

ఈ కార్యక్రమాన్ని మెజార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు విజయవంతంగా నిర్వహిస్తుండగా, కొందరు మాత్రం మొక్కుబడిగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ప్రతి నెలా నిర్వహిస్తున్న సమీక్షలో ఈ కార్యక్రమంలో ఎవరెవరి ఫెర్పార్మెన్స్ ఎలా ఉందో వివరిస్తూ మెరుగుపర్చుకోవాలని ఆదేశిస్తూ వస్తున్నారు సీఎం వైఎస్ జగన్. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సమర్దవంతంగా నిర్వహిస్తూ ప్రజల్లో తిరిగే నాయకులకే రాబోయే ఎన్నికల్లో టికెట్ లు కేటాయించడం జరుగుతుందని, సర్వే రిపోర్టులో నెగిటివ్ గా ఉంటే టికెట్లు ఇచ్చే ప్రసక్తే లేదనీ, ఇందులో ఎటువంటి మొహమాటాలకు తావులేదని కూడా సీఎం జగన్ చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇవేళ నిర్వహించిన వర్క్ షాపులో ఎమ్మెల్యేల పనితీరుపై చేసిన సర్వే నివేదికను స్వయంగా సీఎం జగన్ వెల్లడించారు.

Gadapa Gadapaku Mana Prabhutvam Workshop

 

దాదాపు 32 మంది ఎమ్మెల్యేలు గడపగడపకు కార్యక్రమంలో వెనుకంజలో ఉన్నట్లుగా సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి తెలిపారు. నివేదికలో వెనుకబడిన 32 మంది ఎమ్మెల్యేలు తమ పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారుట. మళ్లీ గడపగడపకు వర్క్ షాప్ వచ్చే ఏడాది మార్చి నెలలో నిర్వహించబోతున్నట్లుగా స్పష్టం చేస్తూ.. ఆ సమయానికి వీరంతా పని తీరు మెరుగుపర్చుకోవాలని సూచించారుట. ఒక వేళ పని తీరు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్ కేటాయించే ప్రసక్తే లేదని జగన్ స్పష్టం చేశారుట. ఇదే క్రమంలో కీలక ప్రకటన కూడా జగన్ చేశారు. వచ్చే వర్క్ షాపులోనే పార్టీ అభ్యర్ధుల జాబితాను కూడా వెల్లడించనున్నట్లు తెలియజేశారుట.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju