NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Durgam Cheruvu Run: దుర్గం చెరువు రన్ ప్రారంభం.. పోటీల్లో పాల్గొన్న 4,500 మంది.. మారథాన్ వివరాలు!

Inorbit Durgam Cheruvu Run

ఇనార్బిట్ మాల్ అథారిటీ ఆధ్వర్యంలో ‘దుర్గం చెరువు రన్-2023’ ప్రారంభమైంది. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ విషయాన్ని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు శనివారమే ప్రకటన విడుదల చేశారు. దుర్గం చెరువు రన్‌లో భాగంగా సుమారు 4,500 మంది ఈ రన్నింగ్‌ పోటీల్లో పాల్గొన్నారు. 5కే, 10కే, 21కే రన్ ఈవెంట్స్ జరగనున్నాయి. ఈ మారథాన్‌లో గెలుపొందిన విజేతలను నగదు బహుమతితోపాటు ఎఐఎంఎస్ సర్టిఫికేట్ కూడా అందజేస్తారు.

Inorbit Durgam Cheruvu Run
Inorbit Durgam Cheruvu Run

మారథాన్ వివరాలు

5కే రన్: 5కే రన్ పరుగు పందెం ఇనార్బిట్ మాల్ నుంచి ప్రారంభమై, కేబుల్ బ్రిడ్జి, రోడ్ నెం.45, కేబుల్ బ్రిడ్జి నేరుగా.. ఐటీసీ కోహినూర్, నా హామ్ అబ్రా జంక్షన్, సి గేట్ జంక్షన్, రైట్ టర్న్, మైండ్ స్పేస్ లోపల ముగుస్తుంది.

10కే రన్: ఇనార్బిట్ మాల్ నుంచి ప్రారంభమై.. కేబుల్ బ్రిడ్జి మీదుగా రోడ్ నెం.45, కేబుల్ బ్రిడ్జి, ఐటీసీ కోహినూర్ లేన్, నాలెడ్జ్ సిటీ, టీ-హబ్, మైండ్ స్పేస్‌కు చేరుకుని రన్ ముగుస్తుంది.

21కే రన్: ఇనార్బిట్ మాల్ నుంచి ప్రారంభమై.. కేబుల్ బ్రిడ్జి, రోడ్ నం.45 ఫ్లై ఓవర్ నుంచి హైదరాబాద్ నగర పరిమితుల్లో ప్రవేశిస్తుంది. తిరిగి రోడ్ నంబర్ 45 ఫ్లై ఓవర్, కేబుల్ బ్రిడ్జి, ఐటీసీ కోహినూర్ సైడ్ లేన్, నాలెడ్జ్ సిటీ, టీ-హబ్ వీటి చుట్టు పక్కల ప్రాంతాల్లోనే తిరుగుతూ మైండ్ స్పెస్ లోపల ముగుస్తుంది.

Inorbit Durgam Cheruvu Run
Inorbit Durgam Cheruvu Run

ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

  • జూబ్లీహిల్స్ రోడ్ నం.45 నుంచి కేబుల్ బ్రిడ్జి మీదుగా బయోడైవర్సిటీ వెళ్లాలనుకునే వారు.. మాదాపూర్ పీఎస్, సీఓడీ జంక్షన్, సైబర్ టవర్స్, లెమన్ ట్రీ జంక్షన్, ఐకియా అండర్ పాస్ మీదుగా వెళ్లాలి.
  • కావూరి హిల్స్, సీఓడీ జంక్షన్ నుంచి దుర్గం చెరువు మీదుగా బయో డైవర్సిటీ జంక్షన్‌కు వెళ్లాలని అనుకునే వారు.. సైబర్ టవర్స్ జంక్షన్, లెమన్ ట్రీ జంక్షన్, ఐకియా అండర్ పాస్ నుంచి వెళ్లాలి.
  • ఐటీసీ కోహినూర్ రోడ్డు, సీ గేట్ రోడ్డు, ఐఓసీఎల్ రోడ్డు, మై హోం అబ్రా లేన్, స్కై వ్యూ లేన్, ఓరియన్ విల్లాస్ న్యూ రోడ్డును తెల్లవారుజామున 4 నుంచి 10 గంటల వరకు క్లోజ్ చేశారు.
  • ఈ రూట్లలో ఉదయం 11 గంటల వరకు హెవీ వెహికల్స్ ను నిషేధించారు.
Inorbit Durgam Cheruvu Run
Inorbit Durgam Cheruvu Run

దుర్గం చెరువు వంతెన

దుర్గం చెరువు వంతెన ఒక ఎక్స్ ట్రాడోస్ట్ కేబుల్ స్టేడ్ బ్రిడ్జి. ఇది తెలంగాణకే గర్వకారణం. ఈ వంతెన ఇనార్బిట్ మాల్ సమీపంలో ఉంది. బంజారా హిల్స్, జూబ్లీహిల్స్ లను ఫైనాన్షియల్ డిస్ట్రిక్స్ తో కలుపుతుంది. మాదాపూర్ ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ఈ వంతెన నిర్మాణం చేపట్టారు. 25 సెప్టెంబర్ 2020న రాష్ట్ర మంత్రి కేటీఆర్, క్యాబినేట్ మంత్రి జీ.కిషన్ రెడ్డి ఈ వంతెనను ప్రారంభించారు.

ఇనార్బిల్ మాల్స్

ఇనార్బిట్ మాల్స్ ను 2004లో మొట్టమొదటి మాల్‌ను ముంబైలోని మలాడ్‌లో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా వీటి బ్రాంచులు విస్తరించాయి. ఇనార్బిట్ మాల్స్ కస్టమర్లకు అద్భుతమైన షాపింగ్ అనుభవాన్ని అందిస్తాయి. రిటైల్, మార్కెటింగ్ రంగంలోనే కాకుండా.. ప్రజల్లో చైతన్యం పెంచే విధంగా ప్రతి ఏడాది రన్నింగ్ పోటీలను నిర్వహిస్తోంది.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju