NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

NCP: పార్టీ శ్రేణుల ఒత్తిడితో పునరాలోచనలో ఎన్సీపీ నేత శరద్ పవార్

NCP: ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తీసుకున్న కీలక నిర్ణయం మహారాష్ట్ర వ్యాప్తంగా పార్టీలో తీవ్ర ప్రకంపనలు రేపింది. పవార్ రాజీనామా ఉపసంహరించుకోవాలంటూ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. పలువురు నేతలు రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో పవార్ తన నిర్ణయంపై పునరాలోచనకు అంగీకరించారు. తనకు కొంత వ్యవధి ఇవ్వాలని, ఇందుకు రెండు, మూడు రోజులు అవసరం అవుతుందని పవార్ చెప్పినట్లు ఆయన మేనల్లుడు, ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఇవేళ సాయంత్రం మీడియాకు తెలిపారు. పవార్ కుమార్తె సుప్రియా సులే, అజిత్ పవార్ తదితర నాయకులు శరద్ పవార్ తో భేటీ అయ్యారు. వీరంతా పవార్ తో మాట్లాడటంతో తన నిర్ణయంపై ఆయన పునరాలోచనకు అంగీకరించారు.

sharad pawar

 

“నేను నా వరకూ నిర్ణయం తీసుకున్నాను. అయితే మీ అందరి కారణంగా నా నిర్ణయాన్ని పునరాలోచన చేస్తాను. నాకు రెండు మూడు రోజులు సయమం కావాలి. అది కూడా కార్యకర్తలు అందరూ ఇళ్లకు వెళ్లిపోతే ఆలోచిస్తాను. కొందరు పార్టీ పదవులకు కూడా రాజీనామా చేస్తున్నారు. వెంటనే దీనిని ఆపేయాలి” అని పవార్ తమకు చెప్పినట్లు అజిత్ పవార్ మీడియాకు తెలిపారు. పవార్ నిర్ణయంతో పార్టీ కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారని, పార్టీ అధ్యక్షుడుగా పవార్ ఉంటూనే ఆయన కింద వర్కింగ్ ప్రెసిడెంట్ ను నియమించుకోవాలని తాము పెద్దాయన కు సూచించినట్లు అజిత్ పవార్ చెప్పారు. తమ మాటలను సావధానంగా పవార్ విన్నారనీ, నిరసన తెలుపుతున్న కార్యకర్తలతో మొదట మాట్లాడి ఆ తర్వాతే ఇక్కడకు తిరిగి రావాలని ఆయన సూచించారని తెలిపారు. 83 సంవత్సరాల పవార్ తన వయోభారాన్ని ప్రస్తావిస్తూ తన రాజీనామా నిర్ణయాన్ని ఈ ఉదయం ప్రకటించిన సంగతి తెలిసిందే.

Rahul Gandhi: గుజరాత్ హైకోర్టులోనూ రాహుల్ కు దక్కని ఊరట .. పరువు నష్టం కేసులో స్టేకు నిరాకరణ

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju