NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

TS EAMCET Results 2023: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల .. టాపర్స్ వీరే

Telangana EAMCET Results 2023 live updates check details here

TS EAMCET Results 2023: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇవేళ ఫలితాలను విడుదల చేశారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, వైద్య విభాగాలకు సంబంధించి ఫలితాల వివరాలను మంత్రి వెల్లడించారు. పరీక్ష రాసిన వారిలో ఇంజనీరింగ్ లో 80 శాతం, అగ్రికల్చర్ లో 86 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి తెలిపారు. అలాగే రెండు కేటగిరిల్లో ఏపికి చెందిన విద్యార్ధులే టాప్ ఫైవ్ ర్యాంకులు సాధించడం విశేషం. ఇంజనీరింగ్ పరీక్షలో 79 శాతం బాలురు. 85 శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి చెప్పారు. అనిరుథ్ అనే విద్యార్ధి మొదటి ర్యాంక్ సాధించినట్లు ప్రకటించారు.

Telangana EAMCET Results 2023 live updates check details here
Telangana EAMCET Results 2023 live updates check details here

 

అగ్రికల్చర్ పరీక్షల్లో 84 శాతం బాలురు, 87 శాతం బాలికలు క్వాలిఫై అయ్యారని తెలిపారు. అగ్రికల్చర్ అండ్ మెడికల్ కేటగిరిలో టాప్ ఫైవ్ ర్యాంకుల్లో నలుగురు ఏపీకి చెందిన వాళ్లే కావడం విశేషం. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన బూరుగుపల్లి సత్య రాజ జశ్వంత్ టాపర్ గా నిలిచాడు. ఇంజనీరింగ్ విభాగంలో విశాఖకు చెందిన సానపాల అనిరుధ్ టాపర్ గా నిలిచాడు. మే 10,11 వ తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్ పరీక్షను, మే 12 నుండి 15వరకు ఆరు విడతల్లో ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షలు నిర్వహించారు. ఇంజనీరింగ్ పరీక్షలకు 1,95,275 మంది, అగ్రికల్చర్ పరీక్షలకు 1,06,514 మంది విద్యార్ధులు హజరైయ్యారు. జూన్ లో ఇంజనీరింగ్ ప్రవేశాలకు కౌన్సిలింగ్ ఉండే అవకాశం ఉంది. ఇక ఎంసెట్ ఫలితాలను eamcet.tsche.ac.in లో చెక్ చేసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్య ప్రభుత్వ కార్యదర్శి కరుణ, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి పాల్గొన్నారు.

*ఇంజనీరింగ్ లో మొదటి అయిదు ర్యాంక్ లు సాధించిన వారు.. శనపాల అనిరుధ్, యకంటిపల్లి మునీందర్ రెడ్డి, చల్లా ఉమేష్ వరుణ్, అభినిత్ మంజేటి, ప్రమోద్ కుమార్

*అగ్రికల్చర్, మెడిసిన్ లో మొదటి అయిదు ర్యాంక్ లు సాధించిన వారు .. బూరుగుపల్లి సత్య, ఎన్ వెంకట తేజ, సఫల్ లక్ష్మి, కార్తికేయ రెడ్డి, బి వరుణ్ చక్రవర్తి

YS Viveka Case: అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ .. సర్వత్రా ఉత్కంఠ

 

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju