NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YS Viveka Case: అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ .. సర్వత్రా ఉత్కంఠ

Share

YS Viveka Case:  మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇవేళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనున్నది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ జరిపి తీర్పు ఇవ్వనున్నది. ఇంతకు ముందు ఏప్రిల్ నెలలో అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ రోజు వారి విచారణకు హజరు కావాలని ఆదేశించారు. రాత పూర్వకంగా ప్రశ్నావళి ఇవ్వాలని సీబీఐకి సూచించారు. ఏప్రిల్ 25వ తేదీ వరకూ అరెస్టు చేయవద్దంటూ ఆదేశాలు ఇచ్చారు.

ys Viveka Murder Case Telangana High court

 

ఈ ఉత్తర్వులపై సునీతా రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించగా హైకోర్టు ఉత్తర్వులను రద్దు చేసి తాజాగా విచారణ చేపట్టాలని ఏప్రిల్ 24న ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తర్వాత ఏప్రిల్ 27న, 28 తేదీల్లో విచారణ చేపట్టినప్పటికీ వాదనలు పూర్త కాకపోవడంతో ముందస్తు బెయిల్ పిటిషన్ పై జూన్ 5వ తేదీకి వాయిదా వేశారు. ఇదే సమయంలో విచారణకు హజరు కావాలంటూ సీబీఐ నోటీసులు జారీ చేయడంతో అవినాష్ రెడ్డి మరో సారి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై మంగళవారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు .. ముందస్తు బెయిల్ పై తాము జోక్యం చేసుకోలేమని, తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టిన ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో వెకేషన్ బెంచ్ నేడు విచారణ చేపట్టనున్నది.

రీసెంట్ గా మూడు సార్లు సీబీఐ విచారణకు పిలిచినా అవినాష్ రెడ్డి గైర్హజరు అయ్యారు. తొలుత ముందస్తు కార్యక్రమాలు ఉన్నాయనీ, ఆ తర్వాత తల్లి అనారోగ్యం కారణంగా విచారణ హజరు కాలేకపోతున్నట్లు తెలిపారు. విచారణకు వారం సమయం కావాలని కోరారు. ఆ తర్వాత సుప్రీం కోర్టులో తన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణలో ఉండటం, తన తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నందున విచారణకు సమయం కావాలంటూ సీబీఐ కి అవినాష్ రెడ్డి లేఖ రాశారు. ఈ నెల విచారణకు హజరు కాకపోవడంతో సీబీఐ అరెస్టు చేస్తుందంటూ వార్తలు రావడంతో అవినాష్ రెడ్డి తల్లి చికిత్స పొందుతున్న కర్నూలులోని ఆసుపత్రి వద్ద పెద్ద ఎత్తున అవినాష్ రెడ్డి అనుచరులు చేరుకున్నారు. ఆ నేపథ్యంలో కర్నూలుకు వెళ్లిన సీబీఐ అధికారులు వెనుతిరిగారు. అవినాష్ రెడ్డి కూడా తల్లి  చికిత్స పొందుతున్న ఆసుపత్రి వద్దనే ఉన్నారు.

అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు వెకేషన్ బెంచ్ లో ఇవేళ విచారణ జరగనుండగా, మరో పక్క కర్నూలులో ఆసుపత్రి వద్ద అవినాష్ రెడ్డి అనుచరుల సీబీఐకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సీబీఐకి మానవత్వం లేదా అని అవినాష్ రెడ్డి అనుచరులు ప్రశ్నిస్తున్నారు. అసుపత్రిలో తల్లి చికిత్స పొందుతుంటే అరెస్టు చేయాలని చూడటం ఏమిటంటూ మండిపడుతున్నారు. అయితే అవినాష్ రెడ్డి సీబీఐకి 27వ తేదీ తర్వాత విచారణకు హజరు అవుతానని తెలియజేస్తూనే ముందస్తు బెయిల్ కోసం కోర్టులను ఆశ్రయిస్తుండటంతో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో అవినాష్ రెడ్డి తండ్రి, అతని అనుచరులను సీబీఐ అరెస్టు చేయడంతో అవినాష్ రెడ్డి ని కూడా అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వినబడుతున్నాయి. తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ ఇచ్చే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది.

YS Jagan: ప్రధాని మోడీకి షాక్ ఇస్తూ 19 పార్టీలు కీలక ప్రకటన .. మద్దతుగా ఏపీ సీఎం జగన్ ట్వీట్


Share

Related posts

టీడీపీలో నెంబర్ 2 ఇప్పుడు ఉమానేనా?

sekhar

Gold Seized : కస్టమ్స్ అధికారుల కళ్లు మూయలేరుగా…శంషాబాద్ ఎయిర్ పోర్టులో 60లక్షల విలువైన బంగారం పట్టివేత

bharani jella

Top maoist leader RK: మావోయిస్టు అగ్రనేత ఆర్కే మృతి..! దృవీకరించిన చత్తీస్ గడ్ పోలీసులు..!!

somaraju sharma