NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పై మాజీ మంత్రి పేర్ని సెటైర్లు

ఏపిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు మూహూర్తం ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. ఈ నెల 14వ తేదీ నుండి పవన్ యాత్ర అన్నవరం పుణ్యక్షేత్రం నుండి ప్రారంభం అవుతోంది. పవన్ కళ్యాణ్ మొదటి దశ ప్రచార వివరాలను ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. పవన్ కళ్యాణ్ వారాహి వాహనంతో ప్రచారం చేయడంపై ఈరోజు జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మంగళగిరి పార్టీ కార్యాలయంలో గోదావరి జిల్లాల నేతలతో సమావేశమైయ్యారు. త్వరలో ప్రారంభం కానున్న పవన్ కళ్యాణ్ యాత్రపై సమావేశంలో చర్చించారు. ఈ నెల 14వ తేదీ నుండి వారాహి పై పవన్ ప్రచార యాత్ర ప్రారంభం అవుతుందనీ, తొలి విడత తూర్పు గోదావరి జిల్లా అన్నవరం క్షేత్రంలో ప్రారంభమై భీమవరం వరకూ కొనసాగుతుందని తెలిపారు. ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, ముమ్మడివరం, రాజోలు, పి గన్నవరం, నరసాపురం నియోజకవర్గాల్లో యాత్ర జరుగుతుందని నాదెండ్ల మనోహర్ చెప్పారు.

Perni Nani Slams Pawan Kalyan Varahi TourPerni Nani Slams Pawan Kalyan Varahi Tour

 

పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఖరారు అయినట్లు ప్రకటన రావడంతోనే అధికార వైసీపీ నుండి విమర్శల పర్వం మొదలైంది. షూటింగ్ లు లేకే పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు సిద్దమైయ్యారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని విమర్శించారు. వారాహి మీద పవన్ ది టూర్ ప్యాకేజీనా అని అడిగారు. వారాహికి ఇన్ని రోజులు ఎందుకు బ్రేక్ ఇచ్చారని ప్రశ్నించారు. దసరా పోయింది.. సంక్రాంతి వెళ్లింది.. ఉగాది వెళ్లిన ఇన్నాళ్లకు యాత్ర గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు.

అన్నవరం, భీమవరం కన్నా చంద్రవరం యాత్ర అని మొదలు పెడితే బాగుంటుందని వ్యంగ్యంగా విమర్శించారు. సినిమా ప్రారంభోత్సవం రోజున ఇలానే తెగ హడావుడి ఉంటుందన్నారు.  మువీ అద్భుతంగా ఉంటుందని చెబుతారనీ ఆ తర్వాత దాని ఊసే ఉండదని అన్నారు. పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి కూడా అలాగే ఉందన్నారు పేర్ని నాని. మంత్రి అంబటి రాంబాబు కూడా పవన్ కళ్యాణ్ యాత్రపై స్పందించారు. అసలు ఇప్పటి వరకూ పవన్ కళ్యాణ్ యాత్ర ఎందుకు ప్రారంభం కాలేదని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ను నమ్మి జన సైనికులు మోస పోతారని, జాగ్రత్త అంటూ సూచించారు.

Pawan Kalyan: ఏపిలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు మూహూర్తం ఫిక్స్.. ఎప్పటి నుండి అంటే..?

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?