NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila: సోనియమ్మ అమ్ములపొదిలోకి చేరిన నాటి జగనన్న వదిలిన బాణం..?

YS Sharmila: జగనన్న వదిలిన బాణంగా గతంలో తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ జగన్ కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల..అనంతరం కుటుంబంలో ఏర్పడిన విభేధాల నేపథ్యంలో తన రాజకీయ ప్రస్థానాన్ని తెలంగాణలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైఎస్ఆర్ టీపీ) గా రాజకీయ పార్టీ పెట్టి కేసిఆర్ సర్కార్ పై వివిధ రూపాల్లో పోరాటాలు సాగిస్తూ వచ్చారు. అయితే వైఎస్ఆర్ టీపీకి తెలంగాణలో అనుకున్న రీతిలో ఆదరణ లభించకపోవడం, ఒక వేళ స్వతంత్రంగా పోటీ చేస్తే కాంగ్రెస్ ఓట్ల చీలిక ప్రభావంతో అది అంతిమంగా కేసిఆర్ సర్కార్ కే మేలు చేసేదిగా ఉండటంతో తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు సిద్దమైయ్యారు.

వైఎస్ షర్మిల కుటుంబానికి సన్నిహితుడైన కర్ణాకట పీసీసీ అధ్యక్షుడు, అక్కడి డిప్యూటి సీఎం డీకే శివకుమార్ దౌత్యంతో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సుముఖత వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఇప్పటికే పలు దఫాలు చర్చలు జరిగాయి. ఇంతకు ముందు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తో సమావేశమైన వైఎస్ షర్మిల .. ఈవేళ ఉదయం ఢిల్లీలో సోనియాతో సమావేశమైయ్యారు. షర్మిల వెంట ఆమె భర్త బ్రదర్ అనిల్ కూడా పాల్గొన్నారు.  దాదాపు గంటన్నరపాటు బ్రేక్ ఫాస్ట్ సమావేశం జరిగింది. ప్రధానంగా ఈ సమావేశంలో పార్టీని విలీనం చేయడం వల్ల ఎలాంటి హామీ వస్తుంది..? ప్రాధాన్యం ఏమిటి..? షర్మిల సేవలను ఏరకంగా వాడుకుంటారు..? అనే దానిపై చర్చలు జరిగినట్లు తెలుస్తొంది.

వివిధ అంశాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో తాజా రాజకీయాలపై చర్చలు జరిగినట్లు తెలుస్తొంది. షర్మిల తన రాజకీయం మొత్తం తెలంగాణలో కొనసాగించాలని భావిస్తుండగా, ఆమె సేవలను తెలంగాణతో పాటు ఏపీలోనూ వినియోగించుకోవాలని పార్టీ అధిష్టానం యోచన చేస్తొంది. పాలేరు నుండి పోటీ చేయాలని షర్మిల అనుకుంటుండగా, ఆమెకు కర్ణాటక నుండి రాజ్యసభ కు పంపుతామని అఫర్ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది.

సోనియాతో సమావేశం ముగిసిన తర్వాత షర్మిల మీడియాతో మాట్లాడారు. సోనియా, రాహుల్ గాంధీ తో మంచి సమావేశం జరిగిందని, నిర్మాణాత్మక చర్చలు జరిగాయని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు మేలు చేసే దిశగా రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిరంతరం పని చేస్తుందని అన్నారు. కేసిఆర్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైందన్నారు. సోనియాతో ఫైనల్ చర్చలు జరిగిన నేపథ్యంలో పార్టీ విలీనంపై రెండు మూడు రోజుల్లోనే అధికారిక ప్రకటన వెలువడనుందని భావిస్తున్నారు. అయితే షర్మిల సేవలను ఆంధ్రప్రదేశ్ లేక తెలంగాణ కు వాడుకుంటారా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

BRS: కెసిఆర్ ఇంటి ముందర సర్పంచ్ నవ్య ధర్నా ? ఉలిక్కిపడ్డ తెలంగాణా !

Related posts

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?

పార్ల‌మెంటు ఎన్నిక‌ల సాక్షిగా కేసీఆర్‌ను ఇరుకున పెట్టిన శంకరమ్మ…?

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

sharma somaraju

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

sharma somaraju

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

sharma somaraju