NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: ముకుందా మురారిలా పెళ్లి కార్డు కృష్ణకిచ్చిన భవాని.. మురారి పెళ్ళి ఆపెస్తాడా.?

Krishna Mukunda Murari Today Episode December 04 2023 Episode 331 Highlights

Krishna Mukunda Murari: మధు వాళ్లంతా ఇంట్లో మాట్లాడుకుంటూ ఉండగా, గౌతమ్ పెద్దత్తయ్య వచ్చారు అనగానే అంతా మౌనంగా ఉంటారు. మధు కార్డ్స్ అతను వచ్చాడా అని అంటుంది కోపంగా భవాని. మధు తోపాటు ఇంట్లో వాలందరు కచ్చితంగా ఏదో అయింది అని అనుకుంటారు. ఇక మధు ఆ పెళ్లి కార్డ్స్ అతనికి ఫోన్ చేస్తాడు. తను రాగానే అతనికి కూడా భవాని క్లాస్ పీకుతుంది. ముకుందని భవాని ఒక మంచి కార్డు సెలెక్ట్ చేయమని చెబుతుంది. ముకుందా ఒక కార్డు సెలెక్ట్ చేసి భవానికి ఇస్తుంది. ఆ కార్డు చూడమని భవాని రేవతికి ఇస్తుంది.

Krishna Mukunda Murari Today Episode December 04 2023 Episode 331 Highlights
Krishna Mukunda Murari Today Episode December 04 2023 Episode 331 Highlights

కృష్ణ రేవతి పిలిచి పక్కకి తీసుకెళ్తుంది. ఏసిపి సార్ కి గతం గుర్తుకు వస్తుంది అత్తయ్య అని అంటుంది. ఎలాగా అని అంటుంది రేవతి. ఇక కృష్ణ రెస్టారెంట్ లో జరిగిందంతా వివరంగా చెప్పి సంతోష పడుతుంది. మొన్న కూడా తనని సార్ అని ఏదో అబ్బాయి అని అన్నారు అనగానే.. సార్ అంటే నేను ఏసిపి సార్ అని అబ్బాయి అంటే ఏబిసిడిల అబ్బాయి అని పిలుస్తా కదా అవన్నీ ఇప్పుడు మీ అబ్బాయికి గుర్తుకు వస్తున్నాయి అని కృష్ణ సంబరపడుతూ చెబుతుంది. అక్క వాళ్ళు శ్రీనివాసన్ ఇంటికి వెళ్ళేటప్పుడు సంతోషంగా ఉన్నారు. కానీ వచ్చేటప్పుడు మొహాలు మాడిపోయాయా అని కృష్ణ అంటుంది అవును రేవతి అనగానే.. వాళ్ళ కంటే నేనే శ్రీనివాసన్ బాబాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాను అని అక్కడ జరిగిందంతా చెబుతుంది కృష్ణ. దేవుడా మురారికి పెళ్లి జరగకముందే గతం గుర్తుకు వచ్చేలా చేయమని రేవతి మనసులో వేడుకుంటుంది.

Krishna Mukunda Murari Today Episode December 04 2023 Episode 331 Highlights
Krishna Mukunda Murari Today Episode December 04 2023 Episode 331 Highlights

మురారి భవాని గది దగ్గరకు వచ్చి రావాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండగా అక్కడే నిలబడిపోయావ్ ఏంటి నాన్న లోపలికి రా అని భవాని అంటుంది నా జీవితంలో కూడా నేను ఎక్కడ నిలబడ్డానో కూడా నాకు అర్థం కావడం లేదు అని, ఎవరో కుక్కను పెంచుకొని నచ్చక వీధిలో వదిలేస్తే ఇంకెవరో పెంచుకోవడానికి తీసుకు వెళ్ళినట్టు.. ఎవరో నన్ను హాస్పిటల్లో జాయిన్ చేస్తే మీరు నన్ను పెంచుకుంటున్నట్లు ఉంది అని మురారి తన మనసులోని వేదనను భవాని ముందు వ్యక్తం చేస్తాడు. మురారి ఆర్ యు ఆల్ రైట్ అని భవాని అనగానే లేదు నేను నార్మల్ గా లేను అని మురారి భవానితో కరాకండిగా చెబుతాడు. మురారి భవానీని నేను ఎవరిని ఇంతకుముందు ఏం చేసే వాడిని అని నిలదీస్తాడు.

Krishna Mukunda Murari Today Episode December 04 2023 Episode 331 Highlights
Krishna Mukunda Murari Today Episode December 04 2023 Episode 331 Highlights

ఇప్పుడు మురారికి నువ్వు ఏసిపి సార్ అని చెబితే తనకి గతం గుర్తుకు వచ్చి కృష్ణకు దగ్గర అయిపోతాడు అని భవాని మనసులో అనుకుంటుంది. అందుకే దేవుడికి క్షమాపణలు చెప్పి మరో అబద్ధం చెబుతుంది భవాని నువ్వు గతంలో మన బిజినెస్ లు చూసుకునేవాడివి చాలా బిజీగా ఉండే వాడివి అని చెబుతుంది. నీకు ఇలా అయింది అని తెలిసిన ఆయన ఇక్కడికి రాలేనంత బిజీగా ప్రాజెక్టు వర్క్ లో ఉన్నారు అని భవాని అంటుంది. నీ పరిస్థితి గురించి ఎప్పుడూ డాక్టర్ తో మాట్లాడాను మురారి అని భవాని చెప్పగానే.. కృష్ణవేణి నీ
తో మాట్లాడారా అని అంటే.. లేదు ఇంకా పెద్ద డాక్టర్ తో మాట్లాడాను అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. వాటి గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉంటే గతం గుర్తుకు వస్తుంది అని చెప్పారు. ఇంకొద్ది రోజుల్లో నీ పెళ్లి జరగబోతోంది. అది జరిగితే అన్ని సెట్ అయిపోతాయి అని భవాని అంటుంది.

Krishna Mukunda Murari Today Episode December 04 2023 Episode 331 Highlights
Krishna Mukunda Murari Today Episode December 04 2023 Episode 331 Highlights

మురారి కృష్ణ దగ్గరకి వచ్చి నేను నా మనసుకి అనిపించిన ప్రశ్న ఒకటి అడుగుతాను. మీరు ఏం అనుకోకండి అని.. మురారి నేను ఇక్కడ ఉన్నప్పుడు ఓకే, మరి నేను లేనప్పుడు నేను మీకు గుర్తుకు వస్తానా, అసలు మీరు నన్ను తలుచుకుంటారా, నా గురించి మీరు ఆలోచిస్తారా అని అడుగుతాడు. ఇక వెంటనే మురారి అక్కడి నుంచి వెళ్ళిపోబోతాడు. సార్ ఉండండి అని కృష్ణ అంటుంది. నేను ఇలా ప్రశ్నలు వేసి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాను కానీ నేను మాత్రం ఒకటి చెబుతాను. నేను అక్కడ ఉన్న ఎక్కడ ఉన్నా మీరే నాకు పదేపదే గుర్తుకు వస్తారు. నా మనసు మీకోసం ఆరాటపడుతూ ఉంటుంది. ఇలా చెప్పడం కూడా తప్పే, ఉండండి సార్ తప్పు కాదు. మిమ్మల్ని మీ గురించి ఆలోచించుకోకుండా నేను ఎలా ఉంటాను సార్. నాకు ఈ జీవితాన్ని ఇచ్చింది మీరే. ఎక్కడో అడవిలో గడ్డి పువ్వులా ఉన్న నేను అద్భుతమైన పుష్పంగా మార్చింది మీరు.

Krishna Mukunda Murari Today Episode December 04 2023 Episode 331 Highlights
Krishna Mukunda Murari Today Episode December 04 2023 Episode 331 Highlights

నన్ను డాక్టర్ చేశారు. ఈ సంఘంలో నాకు ఒక విలువని తెచ్చారు. ఇంతకంటే ఒక మనిషికి ఏం కావాలి, ఇంత చేసిన మనిషిని ఏమంటారో తెలుసా సార్ దేవుడు అంటారు. మీరే నా దేవుడు. ఇందాక నేను ఎందుకు మాట్లాడలేదు అంటే నాకు సంతోషంలో మాటలు రావు సార్. అందుకే నన్ను అందరూ తింగరి అని పిలుస్తారు. తింగరి నా నేను ఈ మాట గతంలో ఎవరినో ఎక్కువ సార్లు పిలిచాను అని మురారి అంటాడు. సూపర్ సార్ అని కృష్ణ మనసులో అనుకుంటుంది.

రేపటి ఎపిసోడ్ లో భవాని పెళ్లి కార్డు తీసుకొని ఇంటికి వస్తుంది కూర్చుండి మేడం అని కృష్ణ అంటుంది. మేము కూర్చోవడానికి రావడం లేదు. వచ్చే శుక్రవారం మా మురారి కి ముకుంద కి పెళ్లి. మొదటి శుభలేఖ నీకే ఇస్తున్నాం అని భవాని అంటుంది. మురారి మాత్రం మనసులో ఏదో తప్పు చేస్తున్నామన్న భావన కలుగుతుంది నాకు అని అనుకుంటాడు. అదేంటో మురారి తెలుసుకుంటాడా.. ఈ పెళ్లిని మురారి ఆపేస్తాడా లేదా అనేది చూడాలి.

Related posts

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

Brahmamudi May 13 Episode 408:అత్తగారికి సవాల్ స్వీకరించిన కావ్య.. బ్యాగ్ సద్దేసిన రాహుల్.. మామ గారికి నిజం చెప్పిన కావ్య.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Karthika Deepam 2 May 13th 2024 Episode: బావ కోసం జ్యోత్స్న ఆరాటం.. దీపకి అండగా ఉంటానంటూ మాట ఇచ్చిన కార్తీక్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema May 13 Episode 622:కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ ఫ్యామిలీ.. కృష్ణ ప్లాన్ సక్సెస్ నడిరోడ్డు మీదకి విక్కి.. కృష్ణకు అరవింద సలహా..

bharani jella

Krishna Mukunda Murari May 13 Episode 468:ముకుంద అనుమానం.. నిజం చెప్పిన మురారి..సరోగసి మదర్ ముకుందని తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది?

bharani jella

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri

Zara Hatke Zera Bachke OTT: ప్రేక్షకుల ఎదురుచూపుకు పులిస్టాప్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న లవ్ స్టోరీ..!

Saranya Koduri

The Goat Life OTT: మరింత ఆలస్యం అవ్వనున్న పృధ్విరాజ్ ” ది గోట్ లైఫ్ “.. రిలీజ్ అప్పుడే..!

Saranya Koduri

Vidya Vasula Aham OTT: డైరెక్ట్ ఓటీటీ ఎటాక్ చేయనున్న విద్యా వాసుల అహం మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: కాంట్రవర్సీకి చిక్కుకున్న ఆవేశం మూవీ.. భాషను హేళన చేశారంటూ ఫైర్..!

Saranya Koduri

Jyoti Roy: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగతి మేడమ్ బాయ్ ఫ్రెండ్ వీడియో.. ఈ బ్యూటీ ని టార్గెట్ చేసింది ఎవరంటే..?

Saranya Koduri

Pallavi Prashant: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి రహస్యాలు.. రైతు పేరుతో లక్షలు సంపాదిస్తున్నాడుగా..!

Saranya Koduri