NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: మురారికి గతం గుర్తొచ్చిన ముకుందతోనే మురారి పెళ్లన్న భవాని.. కృష్ణ ప్లాన్ ఏంటంటే.?

Krishna Mukunda Murari Today Episode December 14  2023 Episode 340 Highlights

Krishna Mukunda Murari: మురారి ముకుందా చేత గుడిలో పంతులుగారు పూజ చేయిస్తూ ఉంటారు. ముకుందా మురారి ఇద్దరు కలిసి పూజ చేయడం ఇష్టం లేని నందిని అక్కడి నుంచి మెల్లగా తప్పించుకొని వస్తుంది. ఆ తర్వాత మధు కూడా వచ్చేస్తాడు. కృష్ణ దగ్గరకు వచ్చి నందు మధు ఇద్దరూ మాట్లాడుతూ ఉంటారు. మరోవైపు పంతులు గారు ముకుంద వయసు ఉన్న ఒక అమ్మాయి చేత వాళ్ళిద్దరికీ కంకణాలు కట్టించమని చెబుతాను. అప్పుడు నందిని ఉంది కదా అని నందిని పిలుచుకు రమ్మని ప్రసాద్ ని పంపిస్తాడు. కృష్ణ, నందు, మధు ల దగ్గరికి ప్రసాద్ వచ్చి అమ్మ నందిని అంటూ లోపల జరిగిన సన్నివేశాన్ని ఎక్స్ప్లైన్ చేసి.. నీకు కడుపులో నొప్పిగా ఉందని ఇప్పుడే వెళ్లిపోయావని చెప్పి, కృష్ణని లోపలికి తీసుకెళ్లమంటావా లేదా నువ్వు వస్తావా అని ప్రసాద్ అంటాడు. ఆ మాటకి మధు ఆశ్చర్యపోయి నువ్వు సూపర్ నాన్న ఇకనుంచి నువ్వు ఇలాగే రెచ్చిపో అని అంటాడు మధు.

Krishna Mukunda Murari Today Episode December 14  2023 Episode 340 Highlights
Krishna Mukunda Murari Today Episode December 14  2023 Episode 340 Highlights

ఇక ప్రసాద్ దగ్గర ఉండి మరీ కృష్ణ ని లోపలికి తీసుకువెళ్తాడు. కృష్ణని అక్కడ చూడగానే మురారి సంతోషిస్తాడు. భవానీ మాత్రం తన చేత కట్టించకూడదని తను ఎందుకు మరో అమ్మాయిని తీసుకురండి అని అంటుండగా.. అప్పుడు పంతులుగారు ఇప్పటికే సమయం దాటిపోతుంది అని అంటాడు. ఏమైంది పెద్దమ్మ కృష్ణవేణి గారు వద్దా అని అంటే.. అబ్బే అలాంటిది ఏం లేదు నాన్న అని అంటుంది. అక్కడ ఉన్న కంకణాలను తీసుకొని ముందుగా మురారి కి కడుతుంది కృష్ణ. మురారి చేతికి కృష్ణ కంకణం కడుతూ ఉండగా గతంలో వాళ్ళిద్దరూ కలిసి పూజ చేసే ముందు తనకి కంకణం ఎవరో కడుతున్నారు అని గుర్తుకు వస్తుంది. కృష్ణ కంకణం కడుతుండగానే మురారికి ఏదో తెలియని భావన కృష్ణ పై ఏర్పడుతుంది. ముకుందా చేతికి కూడా కృష్ణ కంకణం కడుతుంది.

Krishna Mukunda Murari Today Episode December 14  2023 Episode 340 Highlights
Krishna Mukunda Murari Today Episode December 14  2023 Episode 340 Highlights

కంకణం కట్టానని మురిసిపోకు కృష్ణ అని మురారిని ఉద్దేశించి అంటుండగా.. నువ్వు పూజ పైన కాన్సన్ట్రేట్ చేయమని కృష్ణ ముకుందతో అంటుంది. ఇక కంకణాలు కట్టిన తరువాత కృష్ణ వచ్చే పక్కన నిలబడగానే భవాని కళ్ళతో వెళ్లిపోమని సైగ చేస్తుంది. ఇక కృష్ణ నాకు పని ఉంది అని చెప్పి అక్కడ నుంచి వచ్చేస్తుంది. కానీ కృష్ణ కంకణం కట్టిన కాడి నుంచి మురారి లో ఫీలింగ్స్ చేంజ్ అవుతాయి. తనకి కృష్ణకి ఏదో తెలియని సంబంధం ఉందని మురారి ఆలోచిస్తూనే ఉంటాడు. మురారి ఆర్ యు ఓకే అంటే ఐ యాం నాట్ ఓకే ముకుందా అని మురారి అంటాడు. ఇక మొత్తానికి పూజ ముగిస్తుంది ఆ తర్వాత దీపాలు వదలాలి పదండి అని వాళ్లందర్నీ భవాని పంపిస్తుంది.

Krishna Mukunda Murari Today Episode December 14  2023 Episode 340 Highlights
Krishna Mukunda Murari Today Episode December 14  2023 Episode 340 Highlights

కృష్ణ సంతోషంగా వచ్చి నందు మధు ఇద్దరికి థాంక్యూ చెబుతూ ఉంటుంది. ఇక వాళ్లంతా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు వాళ్లని అలా చూసి ఇదంతా నా కోడలి కృష్ణ ప్లాన్ అని భవాని అర్థం చేసుకుంటుంది ముకుంద మాత్రం కృష్ణుని అక్కడ చూసి కోపం తెచ్చుకుంటుంది ఇక నందిని వైపు చూసి నీకు కడుపులో నొప్పి అని అన్నారు అంటే ఇప్పుడే కొద్దిగా తగ్గినట్టు ఉంది అని నందిని కవర్ చేసుకుంటుంది. ఇక పదండి అందరూ కోనేటి దగ్గరికి వెళ్దాం దీపాలు వదిలే సమయం అయింది అని రేవతి అంటుంది. అందరూ దీపాలు పట్టుకుని కోనేటి దగ్గరకు వెళ్తారు.

Krishna Mukunda Murari Today Episode December 14  2023 Episode 340 Highlights
Krishna Mukunda Murari Today Episode December 14  2023 Episode 340 Highlights

కృష్ణ నేను నీకు ఏమి అన్యాయం చేశానని ఇంత చేస్తున్నావు అని ముకుందా కోనేట్లో దీపాలు వదులుతూ కృష్ణ ని అడుగుతుంది. కృష్ణ సమాధానం చెప్పే లోపే అనుకోకుండా కృష్ణ నీళ్లలో పడిపోతుంది. కృష్ణ నీళ్లలో నుంచి పైకి లేస్తూ ఏసిపి సార్ ఏసిపి సార్ అని పెద్ద పెద్దగా అరుస్తుంది. కృష్ణ కృష్ణ ఏమైంది అంటూ మధు ప్రసాద్ గౌతమ్ అందరూ అక్కడికి వెళుతూ ఉంటారు. ఏసిపి సార్ అనే పదం మురారి వినగానే కృష్ణకి తనకి యాక్సిడెంట్ అయిన సన్నివేశం మురారి కి గుర్తుకు వస్తుంది అప్పుడు మురారి కృష్ణ అని పెద్దగా అరుస్తాడు. అంతేకాకుండా పరిగెత్తుకుంటూ వెళ్లి నీళ్లలో దూకి కృష్ణను కాపాడుతాడు. మూర్తి కృష్ణ అనే పిలవగానే భవాని షాక్ అవుతుంది. మురారి కి గతం గుర్తొచేసిందేమోనని భవాని ముకుందా కంగారు పడతారు. కృష్ణుని పైకి తీసుకువచ్చి కృష్ణ లెగు లెగు అని అంటుండగా కృష్ణ ఎంతసేపటికి లెగవదు మురారి కృష్ణ లెగు అంటుండగా కృష్ణ లెగుస్తుంది అప్పటికి కూడా సర్ సర్ అని అంటుండగా సార్ కాదు మీ ఏసీబీ సార్ అని మురారి అంటాడు. నాకు గతం గుర్తుకు వచ్చేసింది కృష్ణ అని మురారి అంటాడు. నిజంగా మురారికి గతం గుర్తుకు వచ్చింది అని చెబుతాడు. ఆ తర్వాత మురారి ఇంట్లో వాళ్లందర్నీ పలకరిస్తాడు మీరందరూ నాకు గుర్తే ఉన్నారు అని చెబుతాడు ఈ సన్నివేశాన్ని చూసి ముకుందా షాక్ అవుతుంది.

Krishna Mukunda Murari Today Episode December 14  2023 Episode 340 Highlights
Krishna Mukunda Murari Today Episode December 14  2023 Episode 340 Highlights

ఇక అందరూ కలిసి ఇంటికి వెళ్తారు భవాని బయటే కృష్ణను ఈ ఒక్క రోజులో ఉండమని చెబుతుంది అదేంటి పెద్దమ్మ అని అంటే ఎసిపిసే ఈ ఒక్కరోజే కదా ఏం పర్లేదు మీరు వెళ్ళండి అని అంటుంది. అంతలో కోపంగా గదిలోకి వెళ్ళిన ముకుందా స్లీపింగ్ టాబ్లెట్స్ మింగేస్తుంది ఇక అదే విషయాన్ని భవానికి వచ్చి చెప్పగా కృష్ణా పరుగు పరుగున లోపలికి వెళ్తుంది పక్కనే ఉన్న స్లీపింగ్ టాబ్లెట్స్ చూసి ఇదంతా కావాలనే చేసిందని కృష్ణ గౌతమ్ అనుకుంటారు ఇక వెంటనే కృష్ణ గౌతమ్ చెప్పిన మెడికల్ ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చి త్వరగా తీసుకురమ్మని చెబుతుంది రేపటి ఎపిసోడ్ లో భవాని ఆ పిచ్చిది నీకోసమే ఇలా చేస్తుంది గతంలో మీరిద్దరూ ప్రేమించుకున్న మాట వాస్తవమా కాదా ఇప్పుడు నేను మీ ఇద్దరికీ పెళ్లి చేసి తీరుతాను అని భవాని అంటుంది. ఇక కృష్ణ ఏం ప్లాన్ చేసి ఈ పెళ్లి అపుతుందో.. మురారి ఏం చేస్తాడో చూడాలి.

Related posts

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Ashika Gopal: ఆన్ స్క్రీన్ లో పద్ధతి కి చీర కట్టినట్టు.. ఆఫ్ స్క్రీన్ లో బికినీతో రచ్చ.. త్రినయని సీరియల్ నటిపై ట్రోల్స్..!

Saranya Koduri

Janaki kalaganaledu: మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన సీరియల్ కపుల్ విష్ణు – సిద్దు.. ఆనందంలో మునిగి తేలుతున్న అభిమానులు..!

Saranya Koduri

Pavitra Jayaram: నా తల్లిప్రాణాలు తీసింది వాళ్లే.. నిజాలను బయటపెట్టిన సీరియల్ యాక్ట్రెస్ పవిత్ర కూతురు..!

Saranya Koduri

Trinayani: ఒక్కసారి నన్ను మావా అని పిలవవే.. త్రినయని నటి మరణం అనంతరం ఎమోషనల్ ట్వీట్ పెట్టిన భర్త..!

Saranya Koduri

Sirisha: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బర్రెలక్క వీడియో.. చనిపోవాలనిపిస్తుంది అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

Brahmamudi May 13 Episode 408:అత్తగారికి సవాల్ స్వీకరించిన కావ్య.. బ్యాగ్ సద్దేసిన రాహుల్.. మామ గారికి నిజం చెప్పిన కావ్య.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Karthika Deepam 2 May 13th 2024 Episode: బావ కోసం జ్యోత్స్న ఆరాటం.. దీపకి అండగా ఉంటానంటూ మాట ఇచ్చిన కార్తీక్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema May 13 Episode 622:కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ ఫ్యామిలీ.. కృష్ణ ప్లాన్ సక్సెస్ నడిరోడ్డు మీదకి విక్కి.. కృష్ణకు అరవింద సలహా..

bharani jella

Krishna Mukunda Murari May 13 Episode 468:ముకుంద అనుమానం.. నిజం చెప్పిన మురారి..సరోగసి మదర్ ముకుందని తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది?

bharani jella

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri