NewsOrbit
Entertainment News Telugu TV Serials

Naga Panchami : జ్వాలా పాయసంలో విషయం కలిపి అందరినీ చంపేస్తుందని భయపడుతున్న చిత్ర..

Naga Panchami Today Episode December 23 2023 Episode 234 Highlights

Naga Panchami :  పంచమి మేఘనన్ని తీసుకొని వస్తుంది. ఈ అమ్మాయి ఎవరు అని వాళ్ళ అత్తయ్య అడుగుతుంది. ఈ అమ్మాయి పేరు మేఘన నా చిన్ననాటి స్నేహితురాలు అని పరిచయం చేస్తుంది వాళ్ళందరికీ. నా పేరు మేఘన ఆంటీ పదిమంది ఉన్న ఇంట్లో కొన్నాళ్లు గడపాలనేది నా కోరిక అందుకే మీ ఇంటికి వచ్చాను అని మేఘన అంటుంది. అదేం కోరిక అని చిత్ర అంటుంది. తనకు ఎవరూ లేరు అత్తయ్య చాలామంది ఉన్న ఇంట్లో కొన్ని రోజులు గడపాలి అన్నది తన ఆశ కొద్ది రోజులు ఉండి వెళ్ళిపోతుంది ఏమీ అనకండి తనని అని పంచమి అంటుంది.  ఇది చూడడానికి ఉమ్మడి కుటుంబం మాత్రమే ఎవరికి వారే యమునా తీరు అన్నట్టుగా ఇంట్లో ఎవరి కష్టాలు వాళ్ళవి ఎవరు ఉంటారో ఎప్పుడు పోతారో తెలియదు ఎక్కువగా ఊహించుకోకు మేఘన నువ్వు ఎన్నాళ్ళు ఉంటావో ఏమో ఇంట్లో పరిస్థితి తెలిస్తే భయపడి పోతావు అని జ్వాల అంటుంది. పంచమి ఇంటికి వచ్చిన గెస్ట్ ని ఇంతసేపు నిలబెట్టి మాట్లాడడం మంచిది కాదు లోపలికి తీసుకువెళ్ళు అని మోక్ష అంటాడు.

Naga Panchami Today Episode December 23 2023 Episode 234 Highlights
Naga Panchami Today Episode December 23 2023 Episode 234 Highlights

మోక్ష ఒప్పుకున్నాక ఇక మాట్లాడేది ఏముంది పంచమి లోపలికి తీసుకువెళ్ళు మీ ఫ్రెండ్ ని అని వైదేహి అంటుంది. అమ్మాయి అంటే అలా అనుకోగా ఉండాలి చూడడానికి ఎంత ముచ్చటగా ఉంది ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తుంది అని మీనాక్షి అంటుంది. అవునమ్మా పంచమి స్నేహితురాలు అంటే అలాగే ఉంటుంది పంచమి ఎంత అనుకోగా ఉంటుందో తను కూడా అంతే అనుకోగా అందంగా మాట్లాడుతుంది ఆడపిల్లలంటే అలా ఉండాలి అని శబరి అంటుంది. బామ్మ చెప్పేది మీకే అని తరుణ్ అంటాడు. అక్క మనము ఆడపిల్లల కనిపించట్లేమా వీళ్ళకి అని చిత్ర అంటుంది.వాళ్ల మొహాలు చిత్ర ఎప్పుడు రెండు జడలు వేసుకొని తల నిండా పూలు పెట్టుకొని తిరుగుతూ ఉండాలి మనకలాంటివేమి ఉండవు కదా నువ్వు రా అని చిత్రని తీసుకొని వెళుతుంది జ్వాలా. కట్ చేస్తే,

Naga Panchami Today Episode December 23 2023 Episode 234 Highlights
Naga Panchami Today Episode December 23 2023 Episode 234 Highlights

మేఘన ఈ రూమ్ లో ఇంతకుముందు ఒక రాక్షసి ఉండేది కొద్దిసేపు ఆగు ఈ సామాన్లని తీసేసి ఇస్తాను ఇకమీదట నుంచి ఈ రూమ్ లో నువ్వు ఉండు అని పంచమి అంటుంది. నీకెందుకు యువరాణి  శ్రమ నేను ఈ సామాన్లన్నీ తీసి సర్దుకుంటాను అని మేఘన అంటుంది. మళ్లీ మళ్లీ అదే అడుగుతున్నానని ఏమీ అనుకోకు మేఘన కానీ నాగమణిని తీసుకువచ్చి మోక్ష బాబును కాపాడేగలుగుతామంటావా ఒకవేళ నాగులోకం వెళ్లి తర్వాత నేను తిరిగి రాకపోతే ఎలా మోక్ష ని నా చేతులారా నేనే చంపుకున్నట్టు అవుతుంది ఫణీంద్ర నన్ను మోసం చేయట్లేదు కదా అని పంచమి అంటుంది. నీకు మరో మార్గం లేదు కదా యువరాణి నమ్మి తీరాలి ఎవరో ఒకరిని ముక్కోటి ఏకాదశి ఎన్ని రోజులు కూడా లేదు నీ ప్రయత్నం నువ్వు చెయ్యి  అని మేఘన అంటుంది. మోక్షనీ కాటు వేసిన తరువాత నాగమణి తీసుకువచ్చి కాపాడలేకపోతే మోక్ష ని నమ్మించి మోసం చేసినట్టు అవుతుంది అని పంచమి అంటుంది.

Naga Panchami Today Episode December 23 2023 Episode 234 Highlights
Naga Panchami Today Episode December 23 2023 Episode 234 Highlights

అలా ఏమీ జరగదు యువరాణి నీకోసం యువరాజు సహాయం చేస్తానన్నాడు నువ్వు తనకి మాట ఇచ్చావు నువ్వు నాగ లోకం వెళ్లి నాగమణిని తీసుకువచ్చేదాకా మోక్ష శరీరాన్ని శిధిలం కాకుండా కాపాడే బాధ్యత నాది నువ్వు ఏలాంటి ఆందోళనకు గురికాకు యువరాణి అంతకంటే ముందు మోక్ష కి ఈ విషయం చెప్పి అన్నిటికీ సిద్ధపరచు అని మేఘన అంటుంది. ఇంతలో ఫణీంద్ర అక్కడికి వచ్చి అదే జరుగుతుంది యువరాణి నువ్వు మోక్షని కాటు వేసిన తర్వాత నేను నాగలోకానికి తీసుకు వెళ్తాను నిన్ను అక్కడే శాశ్వతంగా ఉంచి నాకు భార్యను చేసుకొని మనిద్దరం ఆనందంగా ఉంటాము నువ్వు ఎప్పటికీ భూలోకానికి తిరిగి రావు అని ఫణీంద్ర అనుకుంటాడు. నేను దైవాన్ని నమ్ముకున్న దాన్ని మేఘన ఆ దైవం ఏం చేస్తే దానికి కట్టుబడి ఉంటాను కానీ నా ప్రయత్నం నేను చేస్తాను ఏం చేసినా ఆ శివయ్య ఆజ్ఞ అనుకుంటాను అని పంచమి అంటుంది. నువ్వు నాగలోకనికి వెళ్లి నాగమణిని తెచ్చి మోక్షని కాపాడుకునే ప్రయత్నం చేస్తావు కానీ ఆ నాగమణి నేను తీసుకునే మా అన్నను బ్రతికించుకొని నిన్ను నాకు పనిమనిషిని చేసుకొని మోక్షని నా సొంతం చేసుకుంటాను అని మేఘన మనసులో అనుకుంటుంది. సరే యువరాణి నువ్వు వెళ్లి మోక్షాన్ని ఒప్పించే ప్రయత్నం చేయి అని మేఘన అంటుంది. కట్ చేస్తే,

Naga Panchami Today Episode December 23 2023 Episode 234 Highlights
Naga Panchami Today Episode December 23 2023 Episode 234 Highlights

జ్వాలా పాయసం చేసి అందులో ఏదో విషయం కలిపి ఇంటిల్లిపాదించి చిత్రకు ఇస్తున్నట్టు కలగని అమ్మో నాకు వద్దు పాయసం అని దిక్కున లేచి కూర్చుంటుంది. తీరా చూస్తే అక్కడ జ్వాలా కనిపించదు గబగబా కిచెన్ వైపు వెళ్లి చూసేసరికి అక్కడ పాయసం వండుతూ కనిపిస్తుంది జ్వాలా అక్క ఏం చేస్తున్నావ్ అని అడుగుతుంది చిత్ర. పాయసం వండుతున్నాను చిత్రా నేనే లేపుదాం అనుకున్నాను నువ్వే వచ్చేసావా రా అందరికీ పాయసం వండుతున్నాను ఈ పాయసం తాగి ఎలా ఉందో చెప్పు ఇందులో ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ వేసాను ఈ పాయసం సూపర్ గా ఉంటుంది చిత్రా అని జ్వాల చిత్రాకి పాయసం పోసి ఇస్తుంది. అమ్మో ఇది అందరితో పాటు నన్ను కూడా వేసేసేలా ఉంది దీన్ని నమ్మకూడదు అని అక్క నువ్వు నాకంటే పెద్ద దానివి  నేను షుగర్ పేషెంట్ నువు సగం గ్లాసు తాగి ఇవ్వక నేను తాగేస్తాను అని చిత్ర అంటుంది. అర్థమైంది చిత్ర నేను ఇందులో విషయం కలిపి మిమ్మల్ని అందరిని చంపాలనుకుంటున్నానని నువ్వు అనుమాన పడుతున్నావు కదా అని గ్లాసులో  పాయసం మొత్తం తాగేస్తుంది ఇప్పుడేమంటావు చిత్రా నన్ను అనుమానించి ఇంట్లో వాళ్ళ అందరితో పాటు నువ్వు కూడా కలిసిపోయావు అని జ్వాల అంటుంది.

Naga Panchami Today Episode December 23 2023 Episode 234 Highlights
Naga Panchami Today Episode December 23 2023 Episode 234 Highlights

అక్క వాళ్ళ లిస్టులో నన్ను వేయకు ఏదో తెలియక చేశాను నాకు వచ్చే ఆస్తిలో నీకు సగం వంట ఇస్తాను అక్క నన్ను వదిలేయ్ అని చిత్ర అంటుంది. సరేలే చిత్ర అంటూ జ్వాలా వెళ్లిపోతుంది. గ్లాసుడు పాయసం చేసి నన్ను భయపెట్టి సగం ఆస్తి కొట్టేసింది దీని మీద ఒక కన్నేసి ఉంచాలి అని చిత్ర అనుకుంటుంది. కట్ చేస్తే, వైదేహి హాల్లో నిలబడుతుంది. పంచమి తనను చూసి నేలకు తలకాయ వేసి అక్కడ నిలబడుతుంది. నా కళ్ళలోకి సూటిగా చూడలేక పోతున్నావు అంటే నువ్వు మాకు అబద్ధం చెప్తున్నావ్ మృత్యుంజయ మహా యాగం చేసిన తర్వాత మోక్షకి ఎటువంటి ప్రాణగండా లేవని మేము అనుకుంటున్నాము కానీ అదంతా అబద్ధం అని వైదేహి అంటుంది..

Related posts

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N