NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi December 25 2023 Episode 288: మెహందీ ఫంక్షన్ లో ట్విస్ట్.. స్వప్న కావ్య, పద్ధు కి చిక్కిన అరుణ్ తప్పించుకోనున్నాడా ?

Brahmamudi Today Episode December 25 2023 Episode 288 Highlights

Brahmamudi December 25 2023 Episode 288: నువ్వు నేను ప్రేమ బ్రహ్మముడి సీరియల్స్ మెగా ఎపిసోడ్ కొనసాగుతుంది. మూడు రోజులు పెళ్లి ఘనంగా చేయాలని, దుగ్గిరాల కుటుంబం, అనామిక కుటుంబం కనకం కుటుంబం అందరూ రిసార్ట్ లో, పెళ్లి వేడుకల్లో, సందడి చేస్తూ ఉంటారు. కళ్యాణ్ పెళ్లి ఆపడానికి రుద్రాణి రాహుల్ అరుణ్ తో కలిసి ప్లాన్ వేస్తుంటారు. విక్కీ పద్మావతిని విడగొట్టడానికి కృష్ణ ఒక అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. పెళ్లికి ఇష్టం లేకపోయినా వచ్చిన అప్పు తను బాధపడుతూ పెళ్లిలో అందరి ముందు నటిస్తూ ఉంటుంది. స్వప్న అరుణ్ ఫోన్ చేసిన విషయం కావ్యకి చెప్పడంతో కావ్య పద్దు హెల్ప్ తీసుకొని ఎలాగైనా అరుణ్ని పట్టుకోవాలి అని అనుకుంటుంది. రాహుల్ దగ్గర అరుణ్ అబద్ధం చెప్తాడు. స్వప్న కావ్యాలు తనని చూసిన విషయం రాహుల్ దగ్గర దాస్తాడు అరుణ్.

Brahmamudi Today Episode December 25 2023 Episode 288 Highlights
Brahmamudi Today Episode December 25 2023 Episode 288 Highlights

Guppedantha Manasu December 23 2023 Episode 954: శైలేంద్ర పంపిన రౌడీలు వసుధారను చంపుతారా లేదా.

ఈరోజు మెగా ఎపిసోడ్ లో, నారాయణ,సుభాష్, ఆర్య, ప్రకాశం తెచ్చే మందు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అసలు ఈ ప్రకాశం మందు గురించి గుర్తుందో లేదో తీసుకు రమ్మని చెప్పాను కానీ ఇంత వాడికి రాలేదు అని నారాయణ సుభాష్ తో అంటాడు. మీరేం కంగారు పడకండి అన్నయ్య వాడికి ఏది గుర్తున్నా లేకపోయినా మందు విషయం మాత్రం గుర్తుంటుంది అని, సుభాష్ అంటాడు. గుర్తుంటే చెప్పి చాలా సేపు అయింది ఇంతవరకు రాలేదేంటి అని అంటాడు నారాయణ అప్పుడే అక్కడికి ప్రకాశం వచ్చేసాను ఎంట్రీ ఇస్తాడు. మందు బాటిల్ ఏది అని అంటే అందరికీ కనిపించేటట్టు తీసుకొస్తానా ఏంటి అని అంటాడు మరి కనిపించకుండా అయినా తీసుకొచ్చావా అంటే తీసుకొచ్చాను కానీ మధ్యలో ఎక్కడో పెట్టేసాను ఎక్కడ పెట్టానో గుర్తు రావట్లేదు అని అంటాడు. దాంతో అందరికీ ప్రకాశం మీద కోపం వస్తుంది. ఇప్పుడు మళ్లీ మనం మందు కోసం ఎక్కడికని వెళ్లాలి అని అందరూ డిసప్పాయింట్ అయ్యే అక్కడే, ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే సుభాష్ కి అపర్ణ కాల్ చేసి మెహందీ ఫంక్షన్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయి తొందరగా రమ్మని చెప్తుంది. నారాయణతో సుభాష్ అపర్ణ పిలుస్తుంది అన్నయ్య మనందరం మెహందీ ఫంక్షన్ దగ్గరికి రమ్మంటుంది వెళ్దాం పదండి అని అంటారు. చేసేదేం లేక అందరూ నిరుత్సాహంగా అక్కడి నుంచి మెహందీ ఫంక్షన్ దగ్గరికి వెళ్తారు.

Brahmamudi December 23 2023 Episode 286: అనామిక తండ్రితో అప్పు గొడవ.. స్వప్న కావ్యాలకు పద్మావతి హెల్ప్… ఒకటైన రాబందులు..?

Brahmamudi Today Episode December 25 2023 Episode 288 Highlights
Brahmamudi Today Episode December 25 2023 Episode 288 Highlights

ఇక అపర్ణ పిలిచిందని అందరూ మెహందీ ఫంక్షన్ దగ్గరికి వెళ్తే అపర్ణ ఈ మగవాళ్ళంతా ఏదో ప్లాన్ చేసినట్టున్నారు ధాన్యలక్ష్మి అని అంటుంది. సుభాష్ అలాంటిదేం లేదు అని అంటాడు. అపర్ణ ఎవరిని అడిగితే నిజం బయటపడుతుంది అని ఆలోచించి ప్రకాశం నువ్వైనా నిజం చెప్పు మీరంతా ఏదో ప్లాన్ చేశారు కదా అదేంటో చెప్పు అని అంటుంది. ప్రకాశం అయోమయంగా అటూ ఇటూ చూస్తూ వదిన ఒకటైతే తీసుకొచ్చాను అది ఎక్కడో పెట్టాను అని అంటాడు ఇక ఆవరణకి మందు సిట్టింగ్ గురించి ఎక్కడ తెలిసిపోతుందో అని నారాయణ సుభాష్ కంగారు పడుతూ ఉంటారు. ఎక్కడ పెట్టారు అని అంటున్నారు బుర్ర ఏంటి అని అంటుంది ధాన్యలక్ష్మి. అప్పుడే అక్కడికి వచ్చిన సీతారామయ్య ఇందిరా దేవి పెళ్లి కొడుకు పెళ్లికూతురు ఇంకా రాలేదా అని అడుగుతారు. ఇంకా రాలేదా అత్తయ్య అని అపర్ణ చెప్తూ ఉండగా కుచల ఎంట్రీ ఇస్తుంది. ఇంతకీ నా భార్య రాలేదు ఏంటి అని అంటాడు నారాయణ, ఊరుకోనారు నా అందానికి దిష్టి తగులుతుంది అని అంటుంది కుచల. దీని అందమంటారా ఇంత మందాన మేకప్ వేసుకొని వస్తే, ఫోటో తీసి ఇంటి ముందు పెడితే జీవితాంతం దిష్టిబొమ్మతో పనిలేదు అని అంటాడు నారాయణ అందరు సరదాగా నవ్వుకుంటూ ఉంటారు. చూశారా అత్తయ్య ఎలా పొగుడుతున్నాడో నారు అని అంటుంది కుజుల దీని పొగడ్త అంటారా మీ ఊర్లో అని అంటాడు నారాయణ. అప్పుడే రాజ్ కావ్య విక్కీ పద్మావతి వస్తారు. ప్రకాశంతో నారాయణ నీ కొడుకు, ఎక్కడ వీళ్ళందరూ వచ్చేసారు అని అంటాడు. నాలాగే రావడం మర్చిపోయాడెమో, అని అంటాడు నారాయణ మీ జబ్బు కళ్యాన్ కి అంటుకోలేదులెండి అని అంటుంది ధన్యలక్ష్మి. అప్పుడే అక్కడికి అనామిక కళ్యాణ్ ఎంట్రీ ఇస్తూ మా పేర్లు వినబడుతున్నాయి ఏంటి అని అంటారు. అమ్మయ్య పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వచ్చేసారు ఇక తొందరగా పని కానిస్తే మేము వెళ్ళిపోతాం అంటాడు నారాయణ వెంటనే ఎక్కడికి అని అడుగుతుంది కుచల. కంగారుపడి నారాయణ ఎక్కడికి లేదు తొందరగా ఫంక్షన్ అయిపోగొట్టాలని అని అంటాడు. వెంటనే సుభాష్ కవర్ చేస్తూ పక్కకు వెళ్దామని అలా అన్నాడు అన్నయ్య అని అంటాడు పక్కకి ఎందుకు వెళ్లాలి అంటుంది అపర్ణ. ఆడవాళ్ళ ఫంక్షన్ లో మగవాళ్ళు ఎంతసేపని ఉంటారు అని అంటాడు సుభాష్ అసలు మెహందీ పెట్టాల్సిందే మీరు బావగారు అని అంటుంది ధాన్యలక్ష్మి. ఆ మాటలకి సుభాష్, షాక్ అయ్యా ఆశ్చర్యంగా చూస్తూ ఏంటి అని అంటాడు. నారాయణ ఊరుకోమ్మ,మేమెంది మెహందీ పెట్టేది, నేను పెడితే ఆంధ్రప్రదేశ్ పటము వాడు పెడితే అమెరికా పటాలు మీ చేతుల్లో వస్తాయి అని అంటాడు నారాయణ. ఆ మాటలు అందరూ నవ్వుకుంటూ ఉంటారు ఇంతలో ఇందిరా దేవి భర్తలే భార్యలకు మెహందీ పెట్టాలని అనామిక వాళ్ళ ఇంటి సాంప్రదాయం కాబట్టి తప్పదు పెట్టాల్సిందే అని అంటుంది ఇందిరాదేవి. చేసేదిలేక అందరూ అలా భార్యలకు మెహందీ పెట్టడానికి కూర్చుంటారు. రాజ్ విక్కీ ఇద్దరు కావాలని మెహందీ పెట్టకుండా తప్పించుకుందాం అని ఫోన్ వస్తున్నట్లు బయటికి వెళ్తారు. పద్దు కావ్య ఇద్దరు వీళ్ళు కావాలనే తప్పించుకుంటున్నారు నువ్వు నా భర్త దగ్గరికి వెళ్లి రమ్మని చెప్పు నేను నీ భర్త దగ్గరికి వెళ్లి తీసుకు వస్తాను అని ఒకరికొకరు అనుకోని, రాజ్ విక్కిలను తీసుకురావడానికి వెళ్తారు.

Naga Panchami : జ్వాలా పాయసంలో విషయం కలిపి అందరినీ చంపేస్తుందని భయపడుతున్న చిత్ర..

Brahmamudi Today Episode December 25 2023 Episode 288 Highlights
Brahmamudi Today Episode December 25 2023 Episode 288 Highlights

ఇక పద్దు రాజు దగ్గరికి వెళ్లి బావగారు రండి మెహందీ పెట్టాలి కదా అని అడుగుతుంది రాజ్ పద్దు ని పట్టించుకోకుండా ఫోన్ మాట్లాడుతున్నట్టు బిల్డప్ ఇస్తాడు. కొంతసేపటికి రాజ్ ఇక ఈ పద్దు కూడా కావ్య లాగే వదిలిపెట్టేటట్లు లేదు వెళ్లాల్సిందే అనుకొని పద వెళ్దాం అని మెహంది పెట్టడానికి వస్తాడు. ఇక కావ్య కూడా విక్కీ దగ్గరికి వెళ్లి రండి పద్దు మీకోసం ఎదురు చూస్తుంది కదా మెహందీ పెట్టడానికి అని అడుగుతుంది వేరే వాళ్ళతో మాట్లాడుతున్నట్టు నటిస్తాడు. తర్వాత, కవిని చూసి అయ్యో మీరు వచ్చి చాలా సేపు అయినట్టుంది అని అంటాడు విక్కీ.మీరు చాలా హైట్ ఉన్నారు కదా నేను చాలా పొట్టి కదా అందుకని మీకు నేను కనిపించలేదు ఏమో బావగారు రండి వెళ్దాం అని అంటుంది కావ్య. ఈ పద్ధులాగే కావ్య కూడా జిడ్డు అనుకుంటాను ఇప్పుడు కచ్చితంగా వెళ్లి లేదా అక్క ఊరుకునేటట్లు లేదు ఏం చేస్తాం అని విక్కీ కూడా కావ్య వెనకాలే వెళ్తాడు మెహందీ పెట్టడానికి, మొత్తానికి అనుకున్నట్టు కావ్య పద్దు ఇద్దరూ రాజ్ వికీలని మెహంది పెట్టడానికి తీసుకువస్తారు. ఇష్టం లేకపోయినా ఇద్దరు మెహందీ పెట్టడానికి కూర్చుంటారు. ఇక కళ్యాణ్ అనామికకు మెహందీ పెట్టడానికి రెడీ అవుతాడు వెంటనే కుచల నేను మేకప్ వేసుకున్నంత అందంగా రావాలి అని అంటుంది వద్దు బాబు అంత చండాలంగా వస్తే ఆ అమ్మాయి ఫీల్ అవుతుంది చక్కగా పెట్టు అని అంటాడు నారాయణ. అనామిక చాలా సంతోషపడుతూ ఉంటుంది అనామికం చూసి వాళ్ళ పేరెంట్స్ కూడా సంతోష పడుతూ ఉంటారు.

Nuvvu Nenu Prema:పద్మావతి బాటలో విక్కీ నడవనున్నాడా? కృష్ణ చేసిన పనికి పద్మావతి దోషి కానుందా?

Brahmamudi Today Episode December 25 2023 Episode 288 Highlights
Brahmamudi Today Episode December 25 2023 Episode 288 Highlights

ఇక కావాలని సుభాష్ మనం ఇక నుంచి తప్పించుకోవాలంటే వీళ్ళకి మెహందీ పెట్టాలి. కాబట్టి మనం ఇక్కడ ఉన్న స్టిక్కర్ లని వాళ్ళ చేతికి అంటించేసి తొందరగా పని పూర్తి చేసి బయటికి వెళ్లాలి అనుకుంటారు. వెంటనే అపర్ణని కూర్చోమని చెప్పి సుభాష్ మెహందీ స్టికర్ నీ తన చేతికి అటించి మెహందీ పెట్టేసినట్టు చెప్తాడు ఏంటండీ ఇలా ఏ డిజైన్ పెడితే ఆ డిజైన్ పెట్టేసేస్తున్నారు. నాకు అసలే నచ్చట్లేదు అని అంటుంది అపర్ణ నువ్వు కాసేపు ఊరుకో ఇది బాగుంటుంది కదా అని సుభాష్ అంటాడు ఆ నారాయణ కూడా కుచలకి అలానే పెడుతూ ఉంటాడు ఇక ఆర్య కూడా అనుకి, మెహందీ పెట్టకుండా స్టిక్కర్ అతికించి ఇక మెహందీ పెట్టడం అయిపోయింది అని సుభాష్ లేస్తాడు. ఈ పేపర్ మెహందీ పెట్టడం వల్ల మనకి టైం చాలా కలిసి వచ్చింది అని అనుకుంటూ ఉంటారు. వెంటనే నారాయణ, ఆర్య,ప్రకాశం, కూడా అలానే లేచి వెళ్లిపోతారు. అను వారిని ఎక్కడికి వెళ్తున్నారు అండి అందరూ అని అడుగుతుంది వచ్చిన తర్వాత చెప్తాను. అని అక్కడి నుంచి నలుగురు వెళ్లిపోతారు.

Brahmamudi Today Episode December 25 2023 Episode 288 Highlights
Brahmamudi Today Episode December 25 2023 Episode 288 Highlights

ఇక కళ్యాణ్ అనామికకు మెహందీ పెడుతూ అందరూ వచ్చారు కానీ అప్పు కనిపించట్లేదు ఏంటి అని అంటాడు ఆ మాటలకి అప్పులకు చాలా కోపం వస్తుంది అనామిక ఆ పేరెంట్స్ కూడా చాలా ఫీల్ అవుతారు కానీ కళ్యాణ్ మాత్రం చాలా సేపు అప్పు ఎక్కడ అని అడుగుతూ ఉంటాడు ఇక కనకం బాబు తనకి తలనొప్పిగా ఉందని పడుకుంది రూమ్లో అని చెబుతుంది అలా పడుకుంటే ఎలా ఆంటీ తోడు పెళ్లి కొడుకుల నా వెంటే ఉండమని చెప్పాను కదా అని అప్పు కి ఫోన్ చేస్తాడు కళ్యాణ్. ఫోన్ లిఫ్ట్ చేసి అప్పు ఏంటి ఇక్కడికి రాలేదు అని అడుగుతాడు నాకు, తలనొప్పిగా ఉంది అని అంటుంది అప్పు. ఇవన్నీ నా దగ్గర చెప్పొద్దు. నీకు మొదటే చెప్పాను కదా ప్రతిదానికి నువ్వు నా పక్కన ఉండాలి నా పెళ్లి జరిగే వరకు నువ్వు నన్ను వదిలిపెట్టొద్దని అలాంటిది ఇప్పుడు నువ్వు రాకపోతే ఈ మెహందీ ఫంక్షన్ కూడా ఆపేస్తాను అని అంటాడు ఆ మాటలకి అనామికకు చాలా కోపం వస్తుంది కంట్రోల్ చేసుకొని సైలెంట్ గా ఉంటుంది అని భయపడి లేదు నాకు నిజంగానే తలనొప్పిగా ఉంది రా బై నువ్వు కానీ చేసేయని అంటుంది. కానీ కళ్యాణ్ వినిపించుకోకుండా నువ్వు ఇక్కడికి రా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇక చేసేదేం లేక అప్పు మెహందీ ఫంక్షన్ దగ్గరికి వెళ్తుంది. కనకం మన అమ్మాయి కళ్యాణ్ బాబుని ఎంత దూరం పెట్టాలనుకున్నా కళ్యాణ్ బాబు మన అమ్మాయి, ని బాధ పెట్టడానికి పిలుస్తున్నట్టు ఉన్నాడండి అని అంటుంది కొన్నిసార్లు మనం ఏం చేయలేము కనకమ్ అని అంటాడు కృష్ణమూర్తి. ఇక బాధగా పేస్ పెట్టి అక్కడికి వస్తుంది. అప్పుడు చూడగానే కనకం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అనామిక కి మెహందీ పెట్టడం కంప్లీట్ అవ్వగానే అప్పు నువ్వు కూడా రా నీకు కూడా పెడతాను అని అంటాడు. నాకు అలాంటివన్నీ నచ్చవు రా బై నువ్వు కానీ చేసే అని ఇందిరా దేవి అని వెనకాల అప్పు నిలబడి ఉంటుంది. ఏం పర్లేదు అప్పు మెహందీ ఫంక్షన్ అంటే అందరూ పెట్టుకోవాలి. నువ్వు ఒక్కదానివే పెట్టుకోకుండా ఎందుకురా అని బలవంతం చేస్తాడు కళ్యాణ్ ఇక ఇందిరా దేవి పర్లేదు వెళ్ళమ్మా మెహందీ పెడతా అంటున్నాడు కదా పెట్టించుకో అని అంటుంది. అప్పు కళ్యాణ్ దగ్గరికి వెళ్లి మెహందీ పెట్టించుకుంటూ ఉంటుంది పక్కనే అనామిక కూడా కూర్చొని ఉంటుంది అనామిక అప్పు ని చూసి చాలా కోపంగా కంట్రోల్ చేసుకుంటూ చాలా అసహ్యంగా ఫేస్ పెట్టి అప్పువైపే చూస్తూ ఉంటుంది అక్కడ సీను అంతా అర్థమైపోతుందిఅప్పుకి తనకి నచ్చట్లేదని కానీ కళ్యాణ్ ఒప్పుకోడు చేసేదేం లేక కళ్యాణ్ చేత మెహందీ పెట్టించుకుంటూ ఉంటుంది కళ్యాణ్ మాత్రం చాలా సంతోషంగా అప్పుకి మెహందీ పెడుతూ ఇంతమంది మెహందీ పెట్టుకుంటూ సంతోషంగా ఉంటే నువ్వేంటి బ్రో రూమ్లో ఉంటాను అని అంటావు నా పెళ్ళంటే ఎలా ఉండాలి నువ్వు ఇంత డల్ గా ఉంటే ఎలాగు అని అప్పుతో మాట్లాడుతూ మెహందీ పెట్టేస్తాడు మెహందీ మొత్తం పెట్టిన తర్వాత నీ చేయి చూపించానామిక అని అంటాడు ఏం అక్కర్లేదు అని అంటుంది. మెహందీ లో ట్విస్ట్ ఇచ్చినట్టు కళ్యాణ్ అనామిక నీకన్నా అప్పుకే డిజైన్ బాగా వచ్చింది అని అంటాడు. ఆ మాటకి, అనామికకి చాలా కోపం వచ్చి అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతుంది. ఇక అందరూ షాక్ అవుతారు.వెంటనే అప్పు ఏందిరా బై నువ్వు చేసిన పని నువ్వు నాకు జస్ట్ ఫ్రెండ్ కి మాత్రమే తనకి కాబోయే భర్త వి తనదే డిజైన్ బాగుందని చెప్పాలి కదా నా డిజైన్ బాగుందని చెప్తే తను ఫీల్ అవుతుంది కదా అది కూడా తెలియదా నీకు అని అందరిలోనే కళ్యాణ్తో అంటుంది అప్పు ఆ మాటలకి కళ్యాణ్ ఉన్నదే కదా నేను చెప్పింది అయినా తను ఏం ఫీల్ అవ్వదు తన గురించి నాకు తెలుసులే తనని ఎలా కూల్ చేయాలో నాకు తెలుసు కానీ నేను చెప్పింది అయితే నిజమే నీకే బాగా వచ్చింది డిజైన్ అనామిక కన్నా అని చెప్తాడు కళ్యాణ్. అనామిక పేరెంట్స్ అప్పుని చూసి బాగా కోపంతో రగిలిపోతూ ఉంటారు.

ఇక రుద్రాణి రాహుల్ ఇద్దరు ఒకపక్కనుంచోని ఈ, పెళ్లి ఆపడానికి ప్లాన్ వేస్తూ ఉంటారు అప్పుడే అక్కడికి వచ్చిన కృష్ణా వాళ్ళని చూసి ఇలా అందరూ సంతోషంగా ఉంటే చాలా బాగుంది కదా అని అంటాడు. వెంటనే రాహుల్ మీరేంటి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లో రేలంగి మావయ్య లాగా మనుషులు మంచితనం అని మాట్లాడుతున్నారు అని అంటాడు. లేకపోతే ఎలా మాట్లాడాలి, ఇలాంటి అవకాశం కోసమే కదా చాలాసేపటి నుంచి మనం ఎదురు చూస్తుంది. అందరూ ఒకచోట చేరిన తర్వాత ఆరుని పిలిపించాలని మనం అనుకున్నాం కదా మరి ఇంక నువ్వు దేనికోసం ఎదురు చూస్తున్నావు. మనం చేస్తున్న పని అందరికీ వినిపించేలా ఎందుకు అరుస్తున్నారు అని అంటుంది రుద్రాణి. నా సంగతి తర్వాత, ముందు అరుణ్ణి పిలిపించండి అని అంటాడు కృష్ణ పిలవాల నాకు తెలీదా మా అన్నయ్య వాళ్ళు సడన్గా ఎక్కడికో వెళ్లారు. వాళ్లు లేకుండా పిలిస్తే ఎలాగా అని ఆలోచిస్తున్నాను. మనం చేస్తుంది ఏమన్నా పేరంటామా? ముత్తయిదులు వస్తే గాని జరగదు అనుకోవడానికి, ఆరు నుంచి గొడవ మొదలు పెడితే ఆ వేడి రిసార్ట్ మొత్తం పాకుతుంది మీ అన్నయ్య వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే పరిగెత్తుకుంటూ వస్తారు. ముందు ఆలోచించడం ఆపే అరుణ్ణి పిలవండి అని అంటాడు కృష్ణ. సరే అని రాహుల్ అరుణ్ కి ఫోన్ చెయ్ అని అంటుంది రుద్రాణి. ఫోన్ లిఫ్ట్ చేసి ఆరు చెప్పండి సార్ అని అంటాడు. మీ ఫోన్ కోసం ఎదురుచూస్తున్నాను వచ్చేసేన అని అంటాడు వచ్చేసేయ్ కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో నేనేం చెప్పాను అది మాత్రమే మాట్లాడు మీ సొంత బుర్రవాడి మా ప్లాన్ ని చెడగొట్ట మాకు అని రాహుల్ అరుణ్ తో చెప్తాడు. మీరు చెప్పినట్టుగానే అక్కడికి వచ్చి స్వప్న కడుపులో పెరుగుతున్న బిడ్డకు నేనే తండ్రిని మాత్రమే చెప్తాను. ఆ తర్వాత మొత్తం మీరే చూసుకుంటారు కదా అని అంటాడు. అంతే, మేమే చూసుకుంటాం అని అంటాడు రాహుల్ సరే వస్తున్నాను సార్ అని ఫోన్ పెట్టేస్తాడు వస్తున్నాడు మమ్మీ అని చెప్తాడు రాహుల్ ఇప్పుడు చెప్తాను ఈ స్వప్న సంగతి. అని రుద్రాణి అనుకుంటుండగాని అక్కడికి ఇందిరాదేవి వచ్చి ఏంటి మీరందరూ ఇక్కడ ఉన్నారు. పదండి అక్కడ మెహందీ ఫంక్షన్ జరుగుతుంది అని బలవంతంగా తీసుకు వెళుతుంది.

ఇక రాజ్ కావ్యకి మెహందీ పెడుతూ నువ్వు కావాలనే పద్ధతిని పంపించావు కదా అని అంటాడు. మీకు మాత్రమే తెలివుందనుకుంటున్నారా అని అంటుంది. నీకు తెలివి కాదే అని అంటాడు రాజ్ అందరూ మీలాగా ఉండరు లేండి అని అంటుంది కావ్య, విక్కీ కూడా పద్మావతి తో ఏంటి అందరి ముందు నటిస్తున్నావా అని అంటాడు. కాదు ఎందుకు పంపించావు నన్ను తీసుకురావడానికి అని అంటాడు. భార్య చేతికి భర్త మెహందీ పెట్టాలి అన్నప్పుడు మీరే కదా నాకు మెహందీ పెట్టాల్సింది. మీరేమో నేను పిలిస్తే రారు అందుకే కావ్యని పంపించాను అని అంటుంది పద్దు. తనని పంపిస్తే నేను మెహందీ పెట్టేస్తానా అని అంటాడు. అయితే ఇప్పుడు మెహందీ పెట్టరన్నమాట అని అంటుంది. రాజ్ కూడా కావ్య తో నువ్వు చెప్తే నేను మెహందీ పెట్టను అని అంటాడు. వెంటనే పద్దు కావ్య ఇద్దరు అమ్మమ్మ అని ఒకేసారి పిలుస్తారు. ఇందిరా దేవి ఏమైందమ్మా ఇద్దరూ అలా పిలిచారు అని అంటుంది మా ఆయన నా చేతికి మెహందీ పెట్టట్లేదు అని పద్దు చెప్తుంది వెంటనే కావ్య కూడా అవును అని అంటుంది. ఆ మాటలకు రాజ్ నేను తనకొక డిజైన్ పెడదామంటే తను వేరే డిజైన్ అడుగుతుంది నాకు అది చేతకాదు కదా అమ్మమ్మ అని అంటాడు. ఏదో ఒక డిజైన్ పెట్టించుకోండి అమ్మ అని అంటుంది రా దేవి సరే అంటారు పద్దు,కావ్య. ఇక అమ్మమ్మ ముందు ఇరికించావు కదా, నీ సంగతి తర్వాత చెప్తాను అని అనుకుంటారు. ఇక ఇద్దరూ మెహందీ పెట్టడం స్టార్ట్ చేస్తారు. మెహందీ పెట్టేటప్పుడు పద్దు విక్కీ తో, మీకు నేనంటే చాలా ఇష్టం కానీ అది మనసులోనే దాచుకున్నారు ఈ చేతిని ఎప్పటికీ వదలదు సారు అని అనుకుంటుంది. కావ్య కూడా రాజ్ వైపు చూస్తూ నేనంటే మీకు ప్రేమ ఉంది కానీ ఆ ప్రేమని మీరు బయట పెట్టట్లేదు. ఎలాగైనా మీ ప్రేమ నేను బయట పెట్టిస్తాను అని అనుకుంటుంది. స్వప్న కూడా రాహుల్ మెహందీ పెడుతూ ఉంటాడు స్వప్న చాలా సంతోషిస్తుంది రాహుల్ అరుణ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అరుణ్ అదే టయానికి అక్కడికి వస్తూ ఉంటాడు మొదట, పద్దు చూస్తుంది. వెంటనే ఆ విషయాన్ని స్వప్నకి చెప్పాలి అని, కావ్య కావ్య కి కూడా చెప్పాలి అని ఇద్దరు వైపు చూస్తుంది ఇద్దరు మొదట పద్దు వైపు చూడరు. అరుణ్ దగ్గరికి వచ్చేస్తూ ఉంటాడు పద్ధతి టెన్షన్ గా ఉంటుంది కావ్యకి విషయం చెప్పాలని సైగ చేస్తుంది. కావి కూడా అరుణ్ రావడం గమనిస్తుంది ఇక ఇద్దరూ కలిసి స్వప్నకి చెబుదామనుకుంటారు స్వప్న అప్పటికే అరుణ్ చూసి టెన్షన్ పడుతుంది. ఇక ముగ్గురు ఇక్కడి నుంచి వెళ్లి అరుణ్ణి పట్టుకోవాలి అనుకుంటారు కానీ వాళ్ళ భర్తలు మెహందీ పెడుతూ ఉంటారు ఎలా తప్పించుకోవాలి అని ఒకళ్ళకొకళ్ళు మనసులో ఆలోచిస్తూ ఉంటారు. మెహందీ పెట్టడం అయిపోయిందా అండి అని అంటుంది కావ్య. అయిపోవచ్చింది అని అంటాడు రాజ్. పద్దు కూడా విక్కీ తో మెహందీ పెట్టడం అయిపోయింది ఇంక చాలండి అని అంటుంది. ఇంతలో అరుణ అక్కడి నుంచి మాయమవుతాడు ఇక అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని స్వప్న పద్దు కావ్య అరుణ్ ఎక్కడికో వెళ్ళాడు అని అనుకుంటారు. కానీ పట్టుకోవాలని అని అనుకొని ముగ్గురు ఇక మెహందీ పెట్టడం కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడే వస్తాము అని బయటకు వెళ్తారు. ఎక్కడికి అని ఇందిరా దేవి అడిగితే ఇప్పుడే వస్తా మా అమ్మమ్మ గారు అని చెప్పి ముగ్గురు పక్కకు వెళ్తారు.

ఇక అరుణ్ కరెక్ట్ గా మెహందీ ఫంక్షన్ దగ్గరికి వచ్చే టయానికి అరుణ్ణి ఒక తాగుబోతు పక్కకు తీసుకువెళ్లి బాగా కొడుతూ ఉంటాడు ఎందుకు కొడుతున్నావ్ రా అని అడుగుతాడు తాగుబోతుని, అరుణ్, నాకు అగ్గి పెట్టి ఇస్తానని చెప్పి నువ్వు ఇవ్వకుండా మోసం చేసి అవి ఇప్పుడు నాకు అగ్గిపెట్టె కావాలి అని అంతకుముందు నువ్వే కదా అగ్గిపెట్టి ఇస్తానని చెప్పావు అని అరుణ్ణి చూసి ఎవరో అనుకొని తాగుబోతు కొడుతూ ఉంటాడు. నీకు నాకు సంబంధం ఏంట్రా అయినా నన్నెందుకు కొడుతున్నావు నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు అని అరుణ అరుస్తూ ఉంటాడు. ఇక వాడి బాధ భరించలేక ఇప్పుడు నువ్వు నన్ను వదిలేస్తే నేను వెళ్ళిపోతాను అని అంటాడు. ఎక్కడికి వెళ్లి పోతావు అని తాగుబోతు అడిగితే చచ్చిపోతాను రా అని అంటాడు. అవసరం లేదు మేమే చంపేస్తామని ముగ్గురు అక్కడికి ఎంట్రీ ఇస్తారు కావ్య, స్వప్న, పద్దు. వాళ్ళ ముగ్గురిని చూసి అరుణ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. వామ్మో వీళ్ళ ముగ్గురి వచ్చారు ఏంటి అని మనసులో అనుకోని తప్పించుకోవాలని ట్రై చేస్తారు కానీ ముగ్గురు కలిసి ఆరున్ ని పట్టుకుంటారు. వాళ్ల నుంచి పారిపోవడానికి అరుణ్ చాలా ట్రై చేస్తాడు. ఇక కరెక్ట్ గా అరుణ్ తప్పించుకోబోయే టయానికి వెనకనుంచి వచ్చి కనకం కర్రతో అరుణ్ తల మీద కొడుతుంది, అరుణ్ పడిపోతాడు. పద్దు, స్వప్న, కావ్య షాక్ అవుతారు.

రేపటి ఎపిసోడ్ లో పద్దు విక్కీ డ్రింక్ చేస్తారు. ఆ తాగిన మత్తులో పద్దు డాన్స్ చేస్తూ ఉంటుంది విక్కీ కూడా పద్దుకి సపోర్ట్ చేస్తూ డాన్స్ చేస్తూ ఉంటాడు వాళ్ళిద్దరుని రూమ్లో కావ్య, రాజ్ చూస్తారు. వాళ్ళు అలా డాన్స్ చేయడం చూసి ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు.

Related posts

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

Brahmamudi May 13 Episode 408:అత్తగారికి సవాల్ స్వీకరించిన కావ్య.. బ్యాగ్ సద్దేసిన రాహుల్.. మామ గారికి నిజం చెప్పిన కావ్య.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Karthika Deepam 2 May 13th 2024 Episode: బావ కోసం జ్యోత్స్న ఆరాటం.. దీపకి అండగా ఉంటానంటూ మాట ఇచ్చిన కార్తీక్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema May 13 Episode 622:కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ ఫ్యామిలీ.. కృష్ణ ప్లాన్ సక్సెస్ నడిరోడ్డు మీదకి విక్కి.. కృష్ణకు అరవింద సలహా..

bharani jella

Krishna Mukunda Murari May 13 Episode 468:ముకుంద అనుమానం.. నిజం చెప్పిన మురారి..సరోగసి మదర్ ముకుందని తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది?

bharani jella

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri

Zara Hatke Zera Bachke OTT: ప్రేక్షకుల ఎదురుచూపుకు పులిస్టాప్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న లవ్ స్టోరీ..!

Saranya Koduri

The Goat Life OTT: మరింత ఆలస్యం అవ్వనున్న పృధ్విరాజ్ ” ది గోట్ లైఫ్ “.. రిలీజ్ అప్పుడే..!

Saranya Koduri

Vidya Vasula Aham OTT: డైరెక్ట్ ఓటీటీ ఎటాక్ చేయనున్న విద్యా వాసుల అహం మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: కాంట్రవర్సీకి చిక్కుకున్న ఆవేశం మూవీ.. భాషను హేళన చేశారంటూ ఫైర్..!

Saranya Koduri

Jyoti Roy: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగతి మేడమ్ బాయ్ ఫ్రెండ్ వీడియో.. ఈ బ్యూటీ ని టార్గెట్ చేసింది ఎవరంటే..?

Saranya Koduri

Pallavi Prashant: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి రహస్యాలు.. రైతు పేరుతో లక్షలు సంపాదిస్తున్నాడుగా..!

Saranya Koduri