NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nindu Noorella Saavasam December 26 2023 Episode 116: భాగమతి అరుంధతి అక్క చెల్లెలు అని తెలియగానే మూర్ఛ పోయిన నీలా..

Nindu Noorella Saavasam Today Episode December 26 2023 Episode 116 Highlights

Nindu Noorella Saavasam December 26 2023 Episode 116: ఏదో ఆలోచిస్తున్నారు వెళ్లేటప్పుడు ఉత్సాహంగా ఉన్నారు వచ్చేటప్పుడు కొంచెం కంగారుగా వచ్చారు ఏమై ఉంటుంది అడిగి తెలుసుకుందామని నీలా కాఫీ తీసుకొని మనోహరి దగ్గరికి వెళుతుంది. అమ్మగారు ఎందుకో టెన్షన్ పడుతున్నట్టున్నారు తలనొప్పిగా ఉందా కాఫీ తాగండి అమ్మ అని నీలా మనోహరి కి కాఫీ ఇస్తుంది. నాకు కాఫీ కావాలని నిన్ను అడిగానా అని మనోహరీ కోపంగా అంటుంది. అది కాదమ్మా మీరు వచ్చేటప్పుడు మిస్సమ్మని ఏవేవో క్యూస్షన్లు అడిగారు వచ్చి కూర్చొని టెన్షన్ పడుతున్నారు తలనొప్పిగా ఉందేమో కాఫీ తాగుతారేమో అని తెచ్చాను అని నీలా అంటుంది. కోపంతో మనోహరి నీలా గొంతు పట్టుకొని నేను ఎలా ఉంటే నీకెందుకే నువ్వేమైనా తీర్చే దానివ అర్చే దానివా అని మనోహరి అంటుంది. అది కాదమ్మా మీ బాధని చెప్పుకుంటే కాస్తే  తగ్గుతుందని అడుగుతున్నాను అని నిలా ఉంటుంది. ఈ మిస్సమ్మ  ఎవరో తెలుసానే ఆర్ జి బాగి అని మనోహరి చెప్తుంది. అమ్మ ఈ విషయం ఇంట్లో వాళ్లకి తెలిస్తే ఎలా అని నీలా అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode December 26 2023 Episode 116 Highlights
Nindu Noorella Saavasam Today Episode December 26 2023 Episode 116 Highlights

అదొక్కటే కాదే ఇంకా ఉంది ఈ ఇంటికి భాగమతికి ఏంటి సంబంధంమో తెలుసా అరుంధతి భాగమతి అక్క చెల్లెలు అందుకే నేను ఏ ప్లాన్ వేసినా తనని ఇంటి నుంచి పంపించలేకపోయాను ఇది వీధి ఆడుతున్న నాటకమే అని మనోహరి అంటుంది. ఆ మాటలు వినగానే నీలా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ఏమైందే నీకు అలా పడిపోయావ్ ఏంటి అని మొహం మీద నీళ్లు చల్లి లేపుతుంది మనోహరి అమ్మగారు విన్న నాకే ఇలా ఉంటే నిజం తెలిసిన మీరు ఎలా తట్టుకుంటున్నారు అమ్మగారు ఈ విషయం అమరేంద్రయ్య గారి కైనా సరే ఇంట్లో వాళ్లకైనా తెలిస్తే ఇంకేమైనా ఉందా అని నీలా అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode December 26 2023 Episode 116 Highlights
Nindu Noorella Saavasam Today Episode December 26 2023 Episode 116 Highlights

తెలియకూడదే నిలా అమరేంద్ర కి భాగమతి మరదలని తెలిసిన ఇంట్లో వాళ్లకి అరుంధతి చెల్లెలు అని తెలిసిన అమర్ తో నా పెళ్లి కలగానే మిగిలిపోతుంది అలా జరగకూడదు అమర్ తో నా పెళ్లి అయ్యేదాకా ఈ విషయం ఇంట్లో వాళ్లకి ఎవరికీ తెలియకూడదు నీలా నువ్వు పొరపాటున ఎవరికైనా చెప్పావే అనుకో నిన్ను చంపేస్తాను అని మనోహరి అంటుంది. అమ్మగారు ఇందాక అయ్యగారు రాథోడ్ మాట్లాడుకుంటుంటే విన్నాను అమ్మ అరుంధతి అమ్మగారిని యాక్సిడెంట్ చేసిన ట్రక్కు డ్రైవర్ దొరికాడంట అతని పట్టుకోడానికి రాథోడ్ అమరేంద్రయ్య వెళ్లారు అని నీలా చెప్తుంది.

Nindu Noorella Saavasam Today Episode December 26 2023 Episode 116 Highlights
Nindu Noorella Saavasam Today Episode December 26 2023 Episode 116 Highlights

అలా జరగకూడదు విడు ఎక్కడ చచ్చాడో ఏమో అని మనోహరి టెన్షన్ పడుతుంది. కట్ చేస్తే, అక్క నువ్వు చెప్పింది మనోహరి నమ్మిందా అక్క ఏమన్నది అని మంగళ వాళ్ళ తమ్ముడు అంటాడు. ఏమో తెలియదు రా తమ్ముడు నేను చెప్పిన మాటలు వినగానే మౌనంగా వెళ్ళిపోయింది కానీ తప్పకుండా తనను మళ్ళీ కలుస్తాను మన ప్రయత్నం మనం చేయాలి కదరా ఆ భాగమతి ఆ ఇంటి కోడలు కాకూడదు నీకు ఇచ్చి పెళ్లి చేయాలి అని మంగళ అంటుంది. కట్ చేస్తే,తాతయ్య లంచ్ కి టైం అయింది రండి అన్నం తిందాం అని అమృత అంటుంది. నేను ఇప్పుడు మీతో కలిసి తింటే మేడం నన్ను తిడుతుంది అమ్మ మీరు వెళ్లి తినండి నేను తర్వాత తింటాను అని రామ్మూర్తి అంటాడు. లేదు తాతయ్య మీరు మాతో రండి మేడం ఏమి అనదులే అని అంజలి అంటుంది. పర్వాలేదు అమ్మ మీరు తింటూ ఉండండి నేను వస్తాను అని రామ్మూర్తి అంటాడు. ఇంతలో తనకి భాగమతి గుర్తుకు వచ్చి ఫోన్ చేస్తాడు రామ్మూర్తి. ఏంటి నాన్న ఈ టైంలో ఫోన్ చేశారు అన్నం తిన్నారా అని అడుగుతుంది భాగమతి. ఏమీ లేదమ్మా వీలు చూసుకుని ఒకసారి ఇంటికి రా నీతో మాట్లాడాలి అని రామ్మూర్తి అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode December 26 2023 Episode 116 Highlights
Nindu Noorella Saavasam Today Episode December 26 2023 Episode 116 Highlights

ఎందుకు నాన్న ఏమైంది ఒంట్లో ఆరోగ్యం బాగోలేదా అని భాగమతి అంటుంది.ఒక విషయం మాట్లాడాలి అని రామ్మూర్తి అంటూ ఉండగా పిల్లలందరూ వచ్చి మీ అమ్మాయి తాతయ్య మేం మాట్లాడతా మేము మాట్లాడతామని ఫోన్ లాక్కుంటారు ఆ గజిబిజిలో సిగ్నల్ లేక ఫోన్ కట్ అయిపోతుంది. అరెరే పిల్లలు ఫోను సిగ్నల్ లేదు ఇంకెప్పుడైనా మాట్లాడుదుర్లే అని రామ్మూర్తి అంటాడు. ఇదేంటి నాన్న ఫోన్ కట్ అయిపోయింది అని భాగమతి ఆలోచిస్తుంది. ఇంతలో స్కూల్లో ఒక అబ్బాయి రేపు జరగబోయే ఎలక్షన్ లో లీడర్ గా నాకే ఓటు వేయాలి అని అందరిని బెదిరిస్తూ ఉంటాడు.హలో నువ్వు ఇలాగేనా  ఓట్లు అడిగేది ఇలా అడిగితే ఎవరూ వేయరు అని అంజలి అంటుంది. ఎందుకు వేరు ఈ స్కూల్లో నేను తప్ప ఎవ్వరూ లీడర్ గా వడానికి వీల్లేదు అని అతను అంటాడు.నువ్వంత తల పొగరుగా అన్నావు కాబట్టి నీకు పోటీగా మా అక్క నిలబడుతుంది అని అంజలి శబదం చేస్తుంది. ఏ అంజలి నీ పంతం కోసం నన్ను ఎందుకే బలి చేస్తున్నావు అని అమృత అంటుంది. అక్క నాకోసం నిలబడవే అని అంజలి బ్రతిమలాడుతుంది.

Nindu Noorella Saavasam Today Episode December 26 2023 Episode 116 Highlights
Nindu Noorella Saavasam Today Episode December 26 2023 Episode 116 Highlights

కట్ చేస్తే, మనోహరి ఆ రౌడీ కి ఫోన్ చేసి రేయ్ ఎక్కడ చచ్చావ్ రా ఇంకా హైదరాబాదులోనే ఎందుకు ఉన్నావు నిన్ను ఎక్కడికైనా వెళ్లిపొమ్మన్నాను కదా అని అంటుంది మనోహరి.నేనింకా హైదరాబాదులోనే ఉన్నట్టు నీకెలా తెలుసు మేడం అని ఆ రౌడీ అంటాడు.నువ్వు ఇంకా హైదరాబాదులోనే ఉన్నావ్ మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో బెడ్ రూమ్లో మందు తాగుతూ ఉన్నావు కదరా నాకే కాదు పోలీసులు కూడా తెలిసిపోయింది అమర్ నిన్ను పట్టుకోడానికి వస్తున్నాడు నువ్వు తొందరగా వెళ్ళిపో అని మనోహరి అంటుంది. అలాగే మేడం అని ఆ రౌడీ డోర్ తీసేసరికి అమరేంద్ర ఎదురుగా కనబడతాడు. ఆ రౌడీ అమరేంద్ర నుండి తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ రాథోడ్ అమరేంద్ర అతని వెంట వెంబడిస్తూ ఉంటారు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Ashika Gopal: ఆన్ స్క్రీన్ లో పద్ధతి కి చీర కట్టినట్టు.. ఆఫ్ స్క్రీన్ లో బికినీతో రచ్చ.. త్రినయని సీరియల్ నటిపై ట్రోల్స్..!

Saranya Koduri

Janaki kalaganaledu: మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన సీరియల్ కపుల్ విష్ణు – సిద్దు.. ఆనందంలో మునిగి తేలుతున్న అభిమానులు..!

Saranya Koduri

Pavitra Jayaram: నా తల్లిప్రాణాలు తీసింది వాళ్లే.. నిజాలను బయటపెట్టిన సీరియల్ యాక్ట్రెస్ పవిత్ర కూతురు..!

Saranya Koduri

Trinayani: ఒక్కసారి నన్ను మావా అని పిలవవే.. త్రినయని నటి మరణం అనంతరం ఎమోషనల్ ట్వీట్ పెట్టిన భర్త..!

Saranya Koduri

Sirisha: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బర్రెలక్క వీడియో.. చనిపోవాలనిపిస్తుంది అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

Brahmamudi May 13 Episode 408:అత్తగారికి సవాల్ స్వీకరించిన కావ్య.. బ్యాగ్ సద్దేసిన రాహుల్.. మామ గారికి నిజం చెప్పిన కావ్య.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Karthika Deepam 2 May 13th 2024 Episode: బావ కోసం జ్యోత్స్న ఆరాటం.. దీపకి అండగా ఉంటానంటూ మాట ఇచ్చిన కార్తీక్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema May 13 Episode 622:కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ ఫ్యామిలీ.. కృష్ణ ప్లాన్ సక్సెస్ నడిరోడ్డు మీదకి విక్కి.. కృష్ణకు అరవింద సలహా..

bharani jella

Krishna Mukunda Murari May 13 Episode 468:ముకుంద అనుమానం.. నిజం చెప్పిన మురారి..సరోగసి మదర్ ముకుందని తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది?

bharani jella

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri