NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: వైసీపీ రెండో జాబితా వచ్చేసిందోచ్ .. జాబితాలో విశేషం ఏమిటంటే..?

YSRCP: వైసీపీ నియోజకవర్గాల ఇన్ చార్జిల రెండో జాబితా విడుదల అయ్యింది. మొత్తం 27 మందితో రెండో జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ లతో చర్చించిన అనంతరం రెండో జాబితాను సీఎం జగన్ ఖరారు చేశారు.

YSRCP

గత నెలలో 11 నియోజకవర్గాల్లో పార్టీ ఇన్ చార్జిలను మార్చిన వైసీపీ తాజాగా 27 నియోజకవర్గాల్లో మార్పులు చేసింది.. దీంతో ఇప్పటి వరకు 38 నియోజకవర్గాలకు ఇన్ చార్జిలను ప్రకటించింది. ఈ జాబితాలో నాలుగు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల వారసులకు ఇన్ చార్జి బాధ్యతలు అప్పగించారు. తిరుపతి, చంద్రగిరి, మచిలీపట్నం, గుంటూరు ఈస్ట్ నియోజకవర్గాల ఎమ్మెల్యేల వారసులను ఇన్ చార్జిలుగా నియమించారు.

మరో కీలక విషయం ఏమిటంటే.. పార్టీలో చేరిన రోజునే హిందూపురం పార్లమెంట్ అభ్యర్ధిత్వాన్ని మాజీ బళ్లారి బీజేపీ ఎంపి జోలదరాసి శాంతకు సీఎం జగన్ ఖరారు చేశారు. మంగళవారం మధ్యాహ్నం సీఎం జగన్మోహనరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు శాంత. 2009 ఎన్నికల్లో ఆమె కర్ణాటకలోని బళ్లారి నుండి బీజేపీ అభ్యర్ధి ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసి గెలిచారు. సామాజిక సమీకరణాల నేపథ్యంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ స్థానంలో ఆమెను ఇన్ చార్జిగా నియమించారు. అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన జే శాంత వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వారు. తాజా జాబితాలోనూ పలువురికి స్థానచలనం జరిగింది.

నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలు (ఇన్ చార్జిలు)

అనంతపురం లోక్ సభ – శ్రీ మాలగుండ్ల శంకరనారాయణ
హిందూపురం లోక్ సభ – శ్రీమతి జోలదరాశి శాంత
అరకు లోక్ సభ (ఎస్టీ) – శ్రీమతి కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి
రాజాం (ఎస్సీ) – డా. తాలె రాజేష్‌
అనకాపల్లి – శ్రీ మలసాల భరత్‌ కుమార్‌
పాయకరావుపేట (ఎస్సీ) – శ్రీ కంబాల జోగులు
రామచంద్రాపురం – శ్రీ పిల్లి సూర్యప్రకాష్‌
పి.గన్నవరం (ఎస్సీ) – శ్రీ విప్పర్తి వేణుగోపాల్‌
పిఠాపురం – శ్రీమతి వంగ గీత
జగ్గంపేట – శ్రీ తోట నరసింహం
ప్రత్తిపాడు – శ్రీ వరుపుల సుబ్బారావు.
రాజమండ్రి సిటీ – శ్రీ మార్గాని భరత్‌
రాజమండ్రి రూరల్‌ – శ్రీ చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ
పోలవరం (ఎస్టీ) – శ్రీమతి తెల్లం రాజ్యలక్ష్మి
కదిరి బి ఎన్ మక్బుల్ అహ్మద్
ఎర్రగొండపాలెం (ఎస్పీ) తాటిపర్తి చంద్రశేఖర్‌
ఎమ్మిగనూరు మాచాని వెంకటేష్‌
తిరుపతి భూమన అభినయ్‌ రెడ్డి
గుంటూరు ఈస్ట్‌ – శ్రీమతి షేక్‌ సూరి ఫాలిమా
మచిలీపట్నం – శ్రీ పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)
చంద్రగిరి – శ్రీ చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి
పెనుకొండ – శ్రీమతి కె.వి. ఉషా శ్రీచరణ్‌
కళ్యాణదుర్గం – శ్రీ తలారి రంగయ్య
అరకు (ఎస్టీ) – శ్రీమతి గొడ్డేటి మాధవి
పాడేరు (ఎస్టీ) = శ్రీ మత్స్యరాస విశ్వేశ్వర రాజు
విజయవాడ సెంట్రల్‌ – శ్రీ వెలంపల్లి శ్రీనివాస రావు
విజయవాడ వెస్ట్‌ – శ్రీ షేక్‌ ఆసిఫ్‌

YS Sharmila: ఇడుపులపాయ వేదికగా కీలక ప్రకటన చేసిన వైఎస్ షర్మిల .. తెలంగాణ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు

Related posts

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!